STOCKS

News


పెన్షన్‌ కోసం... ఎల్‌ఐసీ జీవన్‌శాంతి!

Monday 1st October 2018
personal-finance_main1538373040.png-20744

లేటు వయసులో నికరంగా నెలవారీ పెన్షన్‌ అందుకోవాలనుకునే వారి కోసం జీవిత బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ... ‘జీవన్‌ శాంతి’ పేరిట సరికొత్త పెన్షన్‌ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. దీన్లో పెన్షన్‌ నిమిత్తం ఒకేసారి ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టిన పెట్టుబడిని బట్టే పెన్షన్‌ ఎంత వస్తుందనేది ఆధారపడి ఉంటుంది. పెన్షన్‌ ఏ వయసు నుంచీ కావాలనుకుంటున్నారన్నది కూడా ఇందులో ముఖ్యమే. కాస్త ముందు నుంచే పెన్షన్‌ ఆశిస్తే కొంత తక్కువ వస్తుంది. అలాకాకుండా పెట్టుబడి పెట్టాక వీలైనంత లేటుగా పెన్షన్‌ ఆశిస్తే... ఎక్కువ వస్తుంది. 
♦ పెన్షన్‌ కావాలనుకుని ఇందులో ఇన్వెస్ట్‌ చేసేవారికి కంపెనీ రెండు ఆప్షన్లిస్తోంది. ఒకటి... పెట్టుబడి పెట్టినప్పటి నుంచే తక్షణం పెన్షన్‌ అందుకోవటం. రెండోది కొన్నాళ్ల తరవాత అందుకోవటం. 
♦ పెన్షన్‌ చెల్లింపులు నెలవారీ, మూడునెలలకోసారి, ఆరునెలలకోసారి, ఏడాదికోసారి చొప్పున ఎలా కావాలంటే అలా చెల్లిస్తారు.
♦ పాలసీ తీసుకోవటానికి కనీసం 35 ఏళ్లు... గరిష్ఠంగా 85 ఏళ్ల వయసులోపు ఉండాలి. 
♦ ఇక కొన్నాళ్ల తరవాత నుంచి పెన్షన్‌ తీసుకోవాలనుకున్నవారు 79 ఏళ్లలోపు మాత్రమే ఉండాలి. 
♦ దీన్లో కనీస పెట్టుబడి రూ.1.5 లక్షలు. గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు. 
♦ ఈ పాలసీని ఆన్‌లైన్లో కూడా పొందే అవకాశం ఉంది. 
♦ పెన్షన్‌కు రకరకాల ఆప్షన్లున్నాయి. పాలసీదారు జీవించినంత కాలం పెన్షన్‌ పొందటం... ఆ తరవాత తన జీవిత భాగస్వామి కూడా అదే పెన్షన్‌ పొందటం... ఆ తరవాత ముందుగా చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని వారసులకు అందజేయటం వంటి ఆప్షన్‌ కూడా ఉంది. 
♦ ఎన్‌పీఎస్‌ నుంచి బయటకు వస్తున్నవారు కొంత మొత్తాన్ని యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయాల్సి వస్తుంది కనక దీని గురించి ఆలోచించవచ్చన్నది నిపుణుల మాట.



You may be interested

ఫండ్లా... లేక షేర్లా?

Monday 1st October 2018

(సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను పొందుదామనే అభిలాష నేటి తరం వారిలో ఎక్కువగానే కనిపిస్తోంది. స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్లపై వీరిలో అవగాహన కూడా నానాటికీ పెరుగుతోంది. అయితే, ఎక్కువ మందికి ఈ విషయంలో ఎదురయ్యే సాధారణ ప్రశ్న ఏమిటంటే... నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలా లేక మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలా?.  ఈ ప్రశ్నకు సమాధానం ఎలా ఉన్నా... చాలా మంది

గృహ రుణం ముందే తీరిస్తే లాభమేనా ?  

Monday 1st October 2018

ప్ర: నేను ఏడాది క్రితం డీఎస్‌పీ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లో రూ. 2 లక్షలు ఇన్వెస్ట్‌ చేశాను. ఇతర స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్‌ పనితీరు బాగా లేదు. ఈ ఫండ్‌ నుంచి మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని కెనరా రెబొకో లేదా రిలయన్స్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. లేదంటే  డీఎస్‌పీ స్మాల్‌ క్యాప్‌ఫండ్‌ నుంచి వెనక్కి తీసుకున్న మొత్తాన్ని రెండు సమాన భాగాలుగా చేసి,

Most from this category