STOCKS

News


బీమా ఇంటర్మీడియరీ రంగంలోనూ పూర్తి ఎఫ్‌డీఐలు!

Thursday 11th October 2018
personal-finance_main1539231817.png-21036

న్యూఢిల్లీ:  ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌తోపాటు బీమా ఇంటర్మీడియరీ రంగంలోనూ పూర్తి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ)  ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు ఐఆర్‌డీఏఐ ఆర్థికశాఖకు తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇన్సూరెన్స్‌ బ్రోకరేజ్‌ సంస్థల్లో ప్రస్తుతం ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతంగా ఉంది. దీనిని 100 శాతం పెంచడంపై ఆర్థికశాఖ ఐఆర్‌డీఏఐ సలహా కోరింది. అదే జరిగితే ఇలాంటి వెసులుబాటునే అగ్రిగేటర్లు, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్ల (టీపీఏ)కూ వర్తింపచేయొచ్చని ఐఆర్‌డీఏఐ ప్రతిపాదిస్తోంది. 



You may be interested

ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా ఈ-కేవైసీ..!

Thursday 11th October 2018

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలు ఆధార్‌ అడగకూడదని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆపరేటర్లు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు. ఆధార్‌కు బదులుగా ఈ-కేవైసీ ధృవీకరణకు అనుమతి ఇవ్వాలని టెలికాం శాఖ (డాట్‌)ను కోరారు. వెరిఫికేషన్‌ కోసం ఒక ప్రత్యేక అప్లికేషన్‌ (యాప్‌)ను రూపొందిచిన ఆపరేటర్లు.. పేవర్‌ వర్క్‌ లేకుండా, క్షణాల్లోనే ధృవీకరణ పూర్తయ్యే విధంగా టెక్నాలజీని వివరించారని టెలికాం అపెక్స్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ (యాక్ట్‌) ఒక లేఖ ద్వారా డాట్‌కు

ఆమ్రపాలి గ్రూప్ స్థిరాస్తులకు తాళాలు

Thursday 11th October 2018

న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌నకు చెందిన 9 ప్రాపర్టీలకు సీల్ వేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. గ్రూప్‌లోని 46 సంస్థల కీలక పత్రాలు ఆయా ప్రాపర్టీల్లో ఉన్నాయంటూ కంపెనీ డైరెక్టర్లు తెలిపిన మీదట అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థిరాస్తులు నోయిడా, గ్రేటర్ నోయిడా, బీహార్‌లోని రాజ్‌గిర్‌, బక్సర్‌లో ఉన్నాయి. తొమ్మిది ప్రాపర్టీలకు సీల్ వేసిన తర్వాత తాళం చెవులను సుప్రీం కోర్టు

Most from this category