STOCKS

News


మీ పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిన ‘బీమా’లు

Wednesday 28th November 2018
personal-finance_main1543345085.png-22422

సౌకర్యవంతంగా జీవించేందుకు కావాల్సిన సంపద కోసం చాలా మంది ఎంతో కష్టించి పనిచేస్తుంటారు. కానీ, జీవితంలో అనిశ్చిత పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు. ఆర్థికం భారం పడొచ్చు. తెలియకుండా వచ్చి పడే ఉపద్రవాల నుంచి కుటుంబానికి, సంపద రక్షణ కోసం బీమాను ప్రతి ఒక్కరూ పోర్ట్‌ఫోలియోలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ వ్యక్తి తన జీవితంలో చేర్చుకోవాల్సిన బీమా ఉత్పత్తుల వివరాలు ఇవి.

 

జీవిత బీమా
ఓ వ్యక్తి కేవలం తన భద్రత, తన కుటుంబ భద్రత కోసమే కాకుండా, దీర్ఘకాల లక్ష్యాల కోసం జీవిత బీమా ప్లాన్‌పై ఇన్వెస్ట్‌ చేయాలని పాలసీఎక్స్‌ సీఈవో నావల్‌ గోయల్‌ పేర్కొ‍న్నారు. పన్ను ఆదాతోపాటు, పొదుపు చేసుకునేందుకు కూడా బీమా ఉపయోగపడుతుందన్నారు. చిన్న వయసు నుంచే ఆరంభిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సూచించారు. 

ఆరోగ్య బీమా
‘‘ఆరోగ్య బీమా కలిగి ఉండడం తప్పనిసరి. అదనపు పన్ను ప్రయోజనం కింద కాకుండా, ఈ పాలసీ వల్ల ఉండే ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ ఆరోగ్య బీమా లేకపోతే అన్ని రకాల వ్యాధులు, వ్యాధికి ముందస్తు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత వైద్య చికిత్సలకు అయ్యే వ్యయాలను భరించే పాలసీ తీసుకోవాలి’’ అని పాలసీబజార్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ తరుణ్‌ మాథుర్‌ సూచించారు. రీస్టోరేషన్‌ సదుపాయం, సబ్‌ లిమిట్స్‌, మేటర్నిటీ కవరేజీ, పోర్టబులిటీ అంశాలను తీసుకునే ముందు పరిశీలించుకోవాలన్నారు.

వ్యక్తిగత ప్రమాద బీమా
దీనివల్ల ప్రమాదంలో చనిపోతే అదనపు పరిహారం పొందొచ్చు. అలాగే, వైకల్యం బారిన పడినా పరిహారం లభిస్తుంది. ‘‘ఇది ఇండెమ్నిటీ పాలసీ కాదు. ప్రయోజనం కలిగించేది. ప్రమాదాలు ఏర్పడితే ఆదుకునేది’’ అని గోయల్‌ పేర్కొన్నారు.

హోమ్‌ ఇన్సూరెన్స్‌
జీవిత కాలం కష్టపడితే సొంతింటి కల సాకారం అవుతుంది చాలా మందికి. మరి తమ కలల ఇంటిని కాపాడుకోవాలన్న అవసరాన్ని ఎంత మంది గుర్తిస్తారు?... అన్ని రకాల ముప్పుల నుంచి ఇంటికి రక్షణ కల్పించుకోవాలని మాథుర్‌ సూచన. ‘‘హోమ్‌ ఇన్సూరెన్స్‌పాలసీ తీసుకుంటే ఇంటితోపాటు ఇంట్లో ఉన్న వాటికి కూడా రక్షణ లభిస్తుంది. దొంగతనం, దోపిడీ వల్ల జరిగిన నష్టానికి పరిహారం లభిస్తుంది. అలాగే, ఎలక్ట్రికల్‌ షార్ట్‌సర్క్యూట్‌, మెకానికల్‌ బ్రేక్‌డౌన్‌, అగ్ని ప్రమాదం, తుఫానులు, భూకంపాలు, పిడుగుపాటు వల్ల వాటిల్లే నష్టాలకు కూడా కవరేజీ లభిస్తుంది’’ అని మాథుర్‌ తెలిపారు. 

మోటార్‌ ఇన్సూరెన్స్‌
దేశంలో మోటారు బీమా తప్పనిసరిగా తీసుకోవాలి. మోటారు బీమా తీసుకోవడం వల్ల ప్రమాదాలు ఎదురైతే ఊహించని ఆర్థిక సమస్యలను గట్టెక్కవచ్చు.You may be interested

నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌??

Wednesday 28th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:33 సమయంలో 35 పాయింట్ల లాభంతో 10,725 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,684 పాయింట్లతో పోలిస్తే 41 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.

ఎఫ్‌డీఏ నిర్ణయంతో ఈ ఫార్మా కంపెనీలకు ప్లస్‌

Wednesday 28th November 2018

అమెరికాలోని మోర్గాన్‌టౌన్‌లోని మైలాన్‌ ప్లాంట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖ జారీ చేయడం మూడు భారత ఫార్మా కంపెనీలకు కలిసొస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. మైలాన్‌ కేంద్రంలో ఉత్పత్తి తగ్గడం వల్ల సన్‌ఫార్మా, అరబిందో ఫార్మా, క్యాడిలా హెల్త్‌కేర్‌ కంపెనీలు లాభపడతాయని విశ్లేషించింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఇక్కడ ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించి, ఫామ్‌ 483 జారీ చేసింది. ఇందులో 13 అభ్యంతరాలను వ్యక్తం

Most from this category