సాధారణ వ్యాధి ఉందని క్లెయిమ్ ఇవ్వరా?
By Sakshi

న్యూఢిల్లీ: సాధారణ జీవనశైలి వ్యాధి ఉందని చెప్పి బీమా పరిహారాన్ని తిరస్కరించడం కుదరదని వినియోగదారుల వివాదాల పరిష్కార జాతీయ కమిషన్ (ఎన్సీడీఆర్సీ) స్పష్టం చేసింది. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఎల్ఐసీని ఆదేశించింది. అలాగే, ఖర్చుల కింద మరో రూ.30,000 కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ కేసులో పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పును పక్కన పెట్టింది. నీలమ్ చోప్రా భర్త 2003లో ఎల్ఐసీ నుంచి జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. తనకు మధుమేహం ఉన్నప్పటికీ పాలసీ దరఖాస్తు పత్రంలో ఆ విషయాన్ని వెల్లడించలేదు. గుండె పోటు కారణంగా 2004లో అతడు మరణించాడు. దీంతో నీలమ్ చోప్రా భర్త బీమా పాలసీకి సంబంధించి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకుంది. కానీ, ఎల్ఐసీ తిరస్కరించింది. పాలసీదారుడు తన ఆరోగ్యానికి సంబంధించిన వాస్తవాలను దాచి ఉంచారని కారణాన్ని చూపింది. విచారణలో వాదనలు విన్న కమిషన్ ‘‘కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ కారణంగా వ్యాధిగ్రస్తుడు మరణించాడు. మరణించడానికి ఐదు నెలల ముందు నుంచే ఆ సమస్య ఉంది. పాలసీ ప్రపోజల్ పత్రం పూర్తి చేసే నాటికి ఈ సమస్య లేదు. మధుమేహం ఉన్నప్పటికీ అది పాలసీ తీసుకునే నాటికి నియంత్రణలోనే ఉంది. జీవనశైలి వ్యాధి అయిన మధుమేహం గురించి తెలియజేయనందున, క్లెయిమ్ హక్కును కోల్పోయినట్టు కాదు’’ అని తీర్పు చెప్పింది.
You may be interested
ఆర్థిక గణాంకాల నీరసం!
Saturday 13th October 2018న్యూఢిల్లీ: భారత్ తాజా ఆర్థిక గణాంకాలు కొంత నిరాశ పరిచాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా (2017 ఇదే నెలతో పోల్చి చూస్తే) నమోదయ్యింది. మూడు నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. మైనింగ్ రంగం అలాగే భారీ ఉత్పత్తుల యంత్ర
సుంకాల పెంపుతో దిగుమతులు భారం
Saturday 13th October 2018న్యూఢిల్లీ: కమ్యూనికేషన్ రంగంలో ఉపయోగించే కొన్ని ఉత్పత్తులపై సుంకాలను పెంచడం వల్ల దిగుమతుల వ్యయాలు దాదాపు పది శాతం మేర పెరిగిపోతాయని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పరిశ్రమకు ఇది మరింత భారంగా మారుతుందని పేర్కొంది. అయితే, దేశ ప్రయోజనాలు కాపాడేందుకు తమ వంతు బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని సీవోఏఐ తెలియజేసింది. సాధారణంగా ఆపరేటర్లు ఏటా దాదాపు 8