STOCKS

News


2020 నాటికి రూ.20 లక్షల కోట్లకు

Monday 10th September 2018
personal-finance_main1536557173.png-20120

న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగం 2019-20 సంవత్సరానికి 280 బిలియన్‌ డాలర్ల (రూ.20 లక్షల కోట్లు) స్థాయికి చేరుతుందని, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆయుష్మాన్‌ భారత్‌ పథకం, ఖర్చు చేసే ఆదాయం పెరగడం, బీమాపై అవగాహన పెరగడం వృద్ధికి కారణాలుగా అసోచామ​-ఏపీఏస్‌ అధ్యయనం పేర్కొంది. ‘‘బీమా విస్తరణ దేశంలో 2001 నాటికి 2.71 శాతంగా ఉంటే, 2017 నాటికి 3.7 శాతానికి పెరిగింది. 2011-12లో బీమా సంస్థల స్థూల ప్రీమియం వసూళ్లు రూ.3.2 లక్షల కోట్లుగా ఉంటే, 2017-18 నాటికి రూ.5 లక్షల కోట్లకు చేరింది. ‘‘ప్రభుత్వ ప్రోత్సాహం, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏ) బీమా విస్తరణకు సహకారం అందించడం, పథకాల విస్తరణ కూడా పెరిగింది. మధ్యతరగతి ప్రజలు పెరుగుతుండడం, యువ జనాభాకుతోడు, జీవితానికి రక్షణ, రిటైర్మెంట్‌ ప్రణాళికల అవసరాన్ని గుర్తించడం వంటివి మరింత వృద్ధికి దోహదపడతాయి’’ అని ఈ అధ్యయన నివేదిక వివరించింది. పేద కుటుంబాలకు ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్‌ భారత్‌ పథకం బీమా రంగం ముఖచిత్రాన్ని మార్చేదిగా అభివర్ణించింది. బీమా అనుబంధ రంగాలపై ప్రభావాన్ని ఎన్నో రెట్ల మేర పెంచడంతోపాటు, లక్షలాది కొత్త ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని పేర్కొంది. సమర్థవంతంగా ఈ పథకాన్ని అమలు చేస్తే హెల్త్‌కేర్‌తోపాటు, ఫార్మా, డయాగ్నస్టిక్స్‌, మెడికల్‌ డివైజెస్‌, డేటా మేనేజ్‌మెంట్‌, ఇన్సూరెన్స్‌ హాస్పిటాలిటీ టీపీఏ రంగాలకూ మేలు కలుగుతుందని వివరించింది. ప్రైవేటు రంగ బీమా కంపెనీలు సాధారణ బీమా రంగంలో 48 శాతం వాటాను, జీవిత బీమా రంగంలో 29 శాతం మేర వాటా కలిగి ఉండగా, మరిన్ని వృద్ధి అవకాశాలను చూస్తాయని ఈ నివేదిక అభిప్రాయపడింది. మధ్య కాలానికి చూస్తే 2023 వరకు జీవిత బీమా రంగం బలమైన పనితీరు చూపిస్తుందని, ప్రీమియం వసూళ్లు దండిగా ఉంటాయన్న అంచనాను వెలువరించింది. 



You may be interested

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిబెంచర్ల రేటింగ్ డౌన్‌గ్రేడ్‌

Monday 10th September 2018

న్యూఢిల్లీ:  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాలు, డిబెంచర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసినట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. భారీ స్థాయిలో రుణాల చెల్లింపులు జరపాల్సి ఉండటం, నిధులపరమైన ఒత్తిళ్లు నెలకొనడంతో డిఫాల్టు రిస్కులు ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. రూ. 5,225 కోట్ల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ ప్రోగ్రామ్ దీర్ఘకాలిక రేటింగ్‌ను, రూ. 350 కోట్ల టర్మ్ రుణాల రేటింగ్‌ను 'ఎఎప్లస్‌' నుంచి 'బిబి' స్థాయికి తగ్గించినట్లు ఇక్రా

జెనెసిస్‌ కలర్స్‌లో రిలయన్స్‌ రిటైల్‌ పెట్టుబడులు

Monday 10th September 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) తన వ్యాపార ప్రయోజనాలను విస్తృతం చేసే క్రమంలో పలు  కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా వాటాలు సొంతం చేసుకుంది. రెడీమేడ్‌ వస్త్రాల రిటైల్‌, హోల్‌సేల్‌ కంపెనీ జెనెసిస్‌ కలర్స్‌ లిమిటెడ్‌ (జీసీఎల్‌)లో 16.31 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాల కోసం రూ.34.80 కోట్లు ఖర్చు చేసింది. జెనెసిస్‌ కలర్స్‌లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ అనుబంధ

Most from this category