STOCKS

News


బీమా కొనుగోలు సరిగ్గా ఉందా..?

Sunday 9th December 2018
personal-finance_main1544378335.png-22777

ఎవరైనా కానీ జీవితంలో సంపాదన ప్రారంభించిన తర్వాత చేయాల్సిన మొదటి పని బీమా పాలసీ తీసుకోవడం. అయితే, ఎంత మంది బీమా తీసుకుంటున్నారు? తీసుకునే వారిలోనూ ఎంత మంది సరిగ్గా తీసుకుంటున్నారు? అని ప్రశ్నిస్తే కనుక సమాధానం సంతృప్తిగా ఉండకపోవచ్చు. నష్టం జరిగితే (అది ప్రాణ, ఆస్తి నష్టం కావచ్చు) అందుకు చెల్లించే పరిహారం బీమా. బీమా కంపెనీ అందిస్తున్న అన్ని ఉత్పత్తులూ అందరికీ సరిపడకపోవచ్చు. ప్రకటనలు, ఏజెంట్ల మాటలు, ఇతర ఆకర్షణలకు గురై బీమా తీసుకుంటుంటే పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇందుకోసం ఏం చేయాలన్నది వ్యాల్యూరీసెర్చ్‌ సంస్థ అధినేత ధీరేంద్రకుమార్‌ తెలియజేశారు. 

 

ఎంత మేర బీమా తీసుకోవాలి? అని ప్రశ్నించుకుంటే... అందుకు భిన్న సమాధానాలు ఉన్నాయి. అయితే, పదేళ్ల మీ ఆదాయానికి సరిపడా బీమా అన్నది ప్రాథమిక అంచనా మాత్రమే. కానీ, పాలసీదారుడు మరణిస్తే అతడి పదేళ్ల ఆదాయ వనరులు అతనిపై ఆధారపడిన కుటుంబానికి చాలవు. కుటుంబ సభ్యుల్లో ఇతరుల ఆదాయం, ఆస్తులు, ఇల్లు వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక మన దేశంలో మీకు తగినంత బీమా ఉందా అని ప్రశ్నిస్తే... లేదన్న సమాధానమే ఎక్కువ మంది నుంచి వస్తుంది. బీమా ప్రీమియం ఎంత చెల్లించాలన్నదే చాలా మంది తెలుసుకుంటారు కానీ, అకాల మరణం చెందితే తమ కుటుంబ సభ్యులకు ఎంత వస్తుందన్నది పట్టించుకోరు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) ... ఎంత మేర ఎంత మందికి బీమా అందించిందన్న విషయానికి బదులు కస్టమర్ల నుంచి ఎంత ప్రీమియం వసూలు చేస్తున్నదీ అనే దాని ఆధారంగానే బీమా పరిశ్రమ సక్సెస్‌ను అంచనా వేస్తుంది. ఏ తరహా ప్రజలు బీమా తీసుకున్నారన్న విషయాన్ని ఐఆర్‌డీఏ వార్షిక నివేదిక తెలియజేయదు. బీమా సాంద్రతను తలసరి ప్రీమియం ఆధారంగా చూస్తుంది. ఇవన్నీ కూడా ఎంత బీమా కవరేజీని కంపెనీలు అందించాయన్న దానికి బదులు, ఎంత మేర ప్రీమియం వసూలు చేశాయన్నదే తెలియజేస్తుంది.  

 

ఇక బీమా తీసుకోవాలంటే అందుకు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ సరైనది. బీమా పాలసీకి ప్రాథమిక సూత్రం... బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌ను వేరు చేయడం. అచ్చమైన బీమా పాలసీ తీసుకోవాలి. టర్మ్‌ పాలసీల్లో చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. దీంతో తాము కట్టిన డబ్బులు వెనక్కి రావన్నది ఇష్టం లేక మన దేశంలో చాలా మంది టర్మ్‌ పాలసీలకు దూరంగా ఉంటుంటారు. దీంతో బీమా సంస్థలు పెట్టుబడుల ధోరణిని ప్రోత్సహిస్తుంటాయి. బీమా, పెట్టుబడి కలిపిన పథకాలను ఎక్కవుగా తీసుకొస్తుంటాయి. ఏజెంట్లు కూడా వీటినే సిఫారసు చేస్తుంటారు. ఎందుకంటే వారికి ఇతర ఉత్పత్తులతో పోలిస్తే వీటిపై కమీషన్లు ఎక్కువ ముడతాయి. కానీ, వీటి వలలో పడకుండా తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీని తీసుకోవడం సరైనది. You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ సురక్షితమేనా?

Sunday 9th December 2018

దేశంలో మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఎంతో చరిత్ర ఉంది. కానీ, గత కొన్నేళ్ల నుంచి వీటి పట్ల ఆదరణ పెరుగుతూ వస్తోంది. నేటి తరం యువత మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ, ఇతర సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడులు తక్కువగా ఉండడం వంటి ఎన్నో అంశాలు ఇందుకు కారణమని చెప్పొచ్చు. మరి వీటిల్లో భదత్ర ఏ మేరకు? అన్న సందేహం చాలా మంది ఇన్వెస్టర్లను

70 డాలర్లను దాటదు!

Saturday 8th December 2018

క్రూడాయిల్‌ ధరపై వందనా హరి అంచనా ఒకపక్క ట్రంప్‌ ట్వీట్లను పట్టించుకున్నామని చెబుతూనే సౌదీ అరేబియా ఉన్నట్లుండి చమురు ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోమారు క్రూడాయిల్‌ ధరల ర్యాలీ ఉండొచ్చన్న భయాలు పెరిగాయి. కానీ ఇవన్నీ నిరర్ధకాలేనని, క్రూడాయిల్‌ ధర 70- 75 డాలర్లను దాటకపోవచ్చని ప్రముఖ విశ్లేషకురాలు వందనా హరి అంచనా వేస్తున్నారు. సౌదీ ప్రకటన వెనుక చాలా కసరత్తు జరిగిందని, ట్రంప్‌కు కోపం రాకుండా ఉండేందుకు

Most from this category