STOCKS

News


నిజానికి మీకెంత బీమా అవసరం?

Thursday 15th November 2018
personal-finance_main1542305092.png-22057

రూ.కోటి రూపాయల లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ఎక్కువలో ఎక్కువ? అన్నది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే రూ.కోటి అన్నది చాలా మంది వార్షిక వేతనానికి ఎన్నో రెట్లు అధికం. ఆర్జించే వ్యక్తికి ప్రాణాపాయం ఎదురైతే అతనిపై ఆధారపడిన వారిని ఆదుకునేందుకు తగినంత బీమా కవరేజీ ఉండడం ప్రతి ఒక్కరికీ అవసరం. అతను లేదా ఆమె లేకపోయినా వారిని నమ్ముకుని ఉన్న కుటుంబ అవసరాలు, లక్ష్యాలకు ఆర్థిక అవరోధాలు ఎదురు కాకుండా బీమా పరిహారం అవసరం అవుతుంది. అందుకే తగినంత బీమా తీసుకోవడం కీలకం. ఈ విషయమై పాలసీబజార్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సంతోష్‌ అగర్వాల్‌ వివరాలు తెలియజేస్తున్నారు.

 

రూ.కోటి సరిపోతుందా?
తమ అవసరాలన్నింటినీ రూ.కోటి తీరుస్తుందని చాలా మంది అభిప్రాయం. అయితే, లెక్కలను ఆశ్రయించకుండా కేవలం ఊహాజనితంగా ఇంత మొత్తం సరిపోతుందన్న అంచనా బీమాకు పనికిరాదు. పైగా ఈ తరహా అంకెలపై ఆధారపడితే ఇబ్బంది కూడా రావచ్చు. రూ.కోటి బీమా పరిహారాన్ని తీసుకెళ్లి 7 శాతం వడ్డీపై బ్యాంకులో ఉంచితే ప్రతీ నెలా రూ.58,333 వస్తుంది. ఇది ఓ మధ్య తరగతి కుటుంబ జీవనానికి సరిపోతుంది. కానీ, ఇందులో మరో కోణం కూడా చూడాలి. ఒకవేళ ఇంటి కోసమో, మరో అవసరం కోసమే రుణాలు తీసుకుని ఉంటే వాటిని కూడా కలిపి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వ్యక్తి మరణిస్తే రుణాలను చెల్లించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉంటుంది. అలాగే, పిల్లల ఉన్నత విద్య, వివాహం తదితర లక్ష్యాలకు ఏక మొత్తంలో భారీగా అవసరం అవుతుంది. 

 

సరైన మొత్తం...
ఎంత మొత్తానికి బీమా అన్నది జీవన స్థాయి, వయసుపై ఆధారపడి ఉంటుంది. 40 ఏళ్లలోపు వయసు ఉన్న వారు కనీసం తమ వార్షిక ఆదాయానికి 20 రెట్ల మేర బీమా తీసుకోవాలి. 40 ఏళ్లపైన వయసున్న వారు అయితే తమ వార్షిక ఆదాయానికి 10-20 రెట్ల మధ్య బీమా తీసుకోవాలి. 50 ఏళ్లపైన వయసు ఉన్న వారు కనీసం 5 రెట్ల నుంచి 10 రెట్ల మేర అయినా బీమా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వార్షిక ఆదాయమే కాకుండా తమ కుటుంబం ఖర్చులు ఏడాదికి ఎంత అవుతున్నాయో చూసి... దానికి కనీసం 12-15 రెట్ల మేర బీమా తీసుకున్నా సమంజసమే. అయితే, అందరికీ ఒకటే సూత్రం అన్నది వర్తించదు. ప్రతీ కుటంబానికి ఉండే ఖర్చులు, చెల్లించాల్సిన రుణాలు, చేయాల్సిన పెట్టుబడులు ఇలా అన్నీ లెక్కలోకి తీసుకుని చూడాల్సిందే. తీసుకునే బీమా మొత్తం జీవిత భాగస్వామి అవసరాలను తీర్చాలి. జీవిత భాగస్వామి వృద్ధాప్య జీవన, వైద్య అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నవారు, దీనికితోడు తల్లిదండ్రులు కూడా తమపై ఆధారపడి ఉంటే రూ.కోటి బీమా సరిపోదు.

 

ద్రవ్యోల్బణాన్నీ చూడాలి
కుటుంబ భవిష్యత్తు వ్యయాలు, అవసరాలను బీమా కోసం లెక్కించే సమయంలో ద్రవ్యోల్బణాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. కుటుంబ వ్యయాలు, అవసరాలు అన్నవి ఏటేటా పెరుగుతూనే ఉంటాయని తెలిసిందే. ఈ రోజు కుటుంబం కోసం రూ.50,000 అవసరం అవుతున్నాయంటే... 7 శాతం ద్రవ్యోల్బణం ఉంటే ఐదేళ్ల తర్వాత కుటుం‍బం కోసం ప్రతీ నెలా రూ.70,000 మొత్తం కావాల్సి ఉంటుంది. అందుకే జీవిత బీమా కవరేజీ తీసుకునే వారు తప్పకుండా చూడాల్సిన అంశం ద్రవ్యోల్బణం. ఇక ప్రతీ ఐదేళ్లకోసారి తమ కుటుంబ అవసరాలు, తీర్చాల్సిన రుణాలు, జీవిత లక్ష్యాలకు అవసరమైన మొత్తంపై అంచనా వేసుకుని, తమకున్న బీమా సరిపోతుందా లేదా అన్నది సమీక్షించుకోవాలి. అవసరమైతే అదనపు మొత్తాన్ని తీసుకోవడం సరైన నిర్ణయం.
 You may be interested

పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఈటీఎఫ్‌... ఏది బెటర్‌?

Thursday 15th November 2018

పీపీఎఫ్‌ పథకం ఎంతో కాలంగా సామాన్యులకు పెట్టుబడి సాధనంగా, పన్ను ఆదా ఉపకరణంగా ఉంటూ వస్తోంది. పెన్షన్‌ అవసరాల కోసం పొదుపు చేసుకునేందుకు కూడా దీన్ని ఎంతో మంది వినియోగించుకునే వారు ఉన్నారు. ఈపీఎఫ్‌ అయితే, ఉద్యోగుల తరఫున పనిచేస్తున్న సంస్థ కూడా తన వాటాను జమ చేస్తుంది. కానీ, పీపీఎఫ్‌ మాత్రం ఎవరికి వారు సొంతంగానే ఇన్వెస్ట్‌ చేసుకునే పథకమే. ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడి ఇస్తూ, పన్ను

కొత్త ఏడాది నుంచి ‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు’ 

Thursday 15th November 2018

క్యాపిటల్‌ ఫస్ట్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంకుల విలీనానంతరం ఏర్పడే ‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు’ వచ్చే జనవరి నుంచి కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. అన్ని కీలక అనుమతులు వచ్చేశాయని, ఒక్క ఎన్‌సీఎల్‌టీ ఆమోదం కోసం చూస్తున్నామని, నెలలోపు అది కూడా రావచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వద్ద పేరు మార్పునకు దరఖాస్తు చేయనున్నట్టు పేర్కొన్నాయి. విలీనం తర్వాత కొత్త బ్యాంకు కార్యకలాపాలు జనవరి నుంచి ఆరంభం

Most from this category