STOCKS

News


బీమా కవరేజీ ఎంత ఉండాలి ..

Monday 3rd September 2018
personal-finance_main1535952360.png-19907

అంతర్జాతీయ రీఇన్సూరెన్స్‌ సంస్థ స్విస్‌ ఆర్‌ఈ 2015లో రూపొందించిన నివేదిక ప్రకారం భారత్‌లో సగటు జీవిత బీమా కవరేజీ ప్రామాణిక స్థాయి కన్నా 92 శాతం మేర తక్కువగా ఉంది. మరో రకంగా చెప్పాలంటే రూ. 100 మేర బీమా కవరేజీ అవసర మైతే.. తీసుకునే కవరేజీ రూ. 7.8 మాత్రమే ఉంటోంది. అంటే అవసరమైనదానికి, తీసుకుంటున్న కవరేజీకి మధ్య ఏకంగా 92.2 శాతం మేర వ్యత్యాసం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అసలు ప్రామాణికంగా తీసుకోతగిన జీవిత బీమా కవరేజీ ఎంత అన్నది తెలియజేసేదే ఈ కథనం.
    ప్రస్తుత జీవన ప్రమాణాలతో కుటుంబ నిర్వహణకు ఎంత జీవిత బీమా కవరేజీ అవసరం అన్నది తెలుసుకోవడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. రూ. 50 లక్షల జీవిత బీమా డబ్బుని ఫిక్సిడ్‌ డిపాజిట్‌ వంటి సురక్షిత సాధనంలో 6 శాతం వడ్డీ రేటుకు (దీర్ఘకాలిక) ఉంచితే.. నెలవారీగా రూ. 25,000 వస్తాయనుకుందాం. ప్రస్తుతం నగరాల్లో సగటు మధ్యతరగతి కుటుంబం ఖర్చులకు ఇది సరిపోయే పరిస్థితి లేదు కదా. కాబట్టి.. మన ప్రస్తుత నెలవారీ ఖర్చుల సరళిని బేరీజు వేసుకుంటే ఎంత మొత్తం కవరేజీ అవసరమవుతుందన్నది ఒక అంచనాకు రావొచ్చు. ఇందుకోసం ఈ కింది విధానాన్ని పరిశీలించవచ్చు. 

దశలవారీగా లెక్కింపు..
మీ మొత్తం నెలసరి ఇంటి ఖర్చులన్నీ (ఈఎంఐలు సహా) లెక్కేయండి. అందులో నుంచి ఈఎంఐలను తీసివేస్తే.. మొత్తం నెలవారీగా ఇంటి ఖర్చులు ఎంత అన్నది తెలుస్తుంది. ముందుగా దీనికోసం కవరేజీ పొందాల్సి ఉంటుంది. నెలవారీ ఖర్చులను 12తో గుణిస్తే.. ఏడాది మొత్తానికి ఇంటి ఖర్చులు ఎంత అన్నది తెలుస్తుంది.ఇక దీర్ఘకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేటుతో వార్షిక ఇంటి ఖర్చులను భాగిస్తే మీ ఆదాయాన్ని సంరక్షించుకోవడానికి ఎంత మొత్తం కవరేజీ అవసరమవుతుందన్నది తెలుసుకోవచ్చు. ఇక ఆ తర్వాత తీసుకున్న రుణాలకు చెల్లించాల్సిన అసలును కూడా దీనికి కలిపితే.. మొత్తం కవరేజీ ఎంత తీసుకోవాలన్నది తెలుస్తుంది. ఒకవేళ ఇప్పటికే మీకు కొంత జీవిత బీమా కవరేజీ ఉండి ఉంటే .. మీరు లెక్క వేసిన మొత్తం కవరేజీ నుంచి దాన్ని తీసివేస్తే ఇకపై తీసుకోవాల్సింది ఎంత అన్నదానిపై స్పష్టత వస్తుంది. పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు మొదలైన ఆర్థిక అవసరాలు కూడా ఉంటాయి. వీటిని కూడా లెక్క వేసి .. కవరేజీ మొత్తానికి కలిపితే నికరంగా ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలన్నది తెలుస్తుంది. 

ఈ విధంగా అవసరమైన కవరేజీని లెక్క వేసుకుని తగిన పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. కుటుంబానికి ఆర్థిక భరోసానివ్వొచ్చు.

- భరత్‌ కల్సి, చీఫ్‌ స్ట్రాటెజీ ఆఫీసర్, టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
 
 You may be interested

ఆదమరిస్తే అంతే సంగతి...

Monday 3rd September 2018

మీ ఫోన్‌.. మీ డేటా... ఇక మీ ఇష్టం!! టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) చైర్మన్‌ ఆర్‌.ఎస్‌.శర్మ ఈ మధ్య ఉన్నట్టుండి అందరికీ హాట్‌ టాపిక్‌ అయ్యారు. కారణం... చేతనైతే నా డేటా హ్యాక్‌ చేయండంటూ తన ఆదార్‌ నెంబర్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. హ్యాకర్లకు సవాల్‌ విసిరారు. ఇంది కొంత విమర్శలకు దారితీసినా... తన డేటా భద్రతపై తనకున్న నమ్మకమే అలా చేయించిందనే వాదనలు ఎక్కువగా వినిపించాయి.  ఇది

నిరోధ శ్రేణి 38,990-39,100

Monday 3rd September 2018

ఇతర వర్థమాన దేశాల సూచీలు దిగువస్థాయిలో ట్రేడవుతున్నా, ఇండియా మార్కెట్‌ వరుసగా మరోవారం కొత్త రికార్డుల్ని నెలకొల్పింది.  అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌తో చాలావరకూ ప్రయోజనం పొం‍దనున్నందున అమెరికా సూచీలు రికార్డు గరిష్టం వద్ద కదులుతుండగా, వర్థమాన దేశాల్లో ప్రస్తుతానికి సురక్షితమైన స్థానంగా ఇండియాను ఇన్వెస్టర్లు పరిగణిస్తున్న నేపథ‍్యంలో మన మార్కెట్‌ పెరుగుతున్నది. గత వారాంతంలో భారత్‌ సూచీలు గరిష్టస్థాయి నుంచి స్వల్పంగా తగ్గినప్పటికీ, సూచీల్ని నడిపిస్తున్న ఐదారు హెవీవెయిట్‌

Most from this category