STOCKS

News


హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చాలా అవసరం

Monday 10th June 2019
personal-finance_main1560154396.png-26201

వైద్య బీమా నేటి రోజుల్లో ఎంతో కీలకమైనదని, ముఖ్యంగా వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో దీని అవసరం ఎంతో ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌ అండ్‌ అండర్‌ రైటింగ్స్‌ చీఫ్‌ సంజయ్‌ దత్తా పేర్కొన్నారు. వైద్య బీమా అవసరం ఏ మేరకు, అది ఏ విధంగా ఓ కుటుంబాన్ని ఆదుకుంటుందన్న విషయాల గురించి ఆయన ఇలా వివరించారు. 

బేసిక్‌ హెల్త్‌ ఇండెమ్నిటీ పాలసీ హాస్పిటల్‌ పాలైనప్పుడు కవరేజీనిస్తుంది. డాక్టర్‌ ఫీజులు, వైద్య చికిత్సల వ్యయాలను చెల్లిస్తుంది. భారతీయులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అవసరం. ఎందుకంటే అధిక రిస్క్‌తో కూడిన జీవన శైలి వ్యాధులు స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల బారిన పడడం పెరిగిపోతోంది. ఆహార అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, ఉదయం వేళ్లలో ఒత్తిడి, పట్టణీకరణ పెరిగిపోవడం వంటివి వీటికి కారణాలు. మరోవైపు గత కొన్నేళ్లలో వైద్య వ్యయాలు రాకెట్‌లా పెరిగిపోయాయి. ఏటేటా వైద్య ద్రవ్యోల్బణం 7-8 శాతం ఉందని ఎన్నో నివేదికలు చెబుతున్నాయి. భారతీయులు వైద్య చికిత్సల కోసం అయ్యే వ్యయాల్లో 70 శాతాన్ని తమ జేబుల నుంచి ఖర్చు చేస్తు‍న్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక చెబుతోంది. ఊహించని వైద్య అవసరాలు ఎదురైతే కుటుంబ బడ్జెట్‌ మొత్తానికి పెద్ద చిల్లు పడుతుంది. అందుకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అన్నది చాలా అవసరం. 

ప్రయోజనాలు
తీవ్రమైన అనారోగ్యాలు, వైద్య ఖర్చులు, నగదు రహిత చికిత్సలతోపాటు, పన్ను ఆదా వంటి ప్రయోజనాలు వైద్య బీమాతో ఉన్నాయి. ఉద్యోగులకు తమ సంస్థ తరఫున బృంద బీమా పాలసీ ఉన్నా కానీ, విడిగా తమ కుటుంబానికి ఓ పాలసీ తీసుకోవాలి. చిన్న వయసులో ఉన్న వారు సాధారణంగా మంచి ఆరోగ్యంతో ఉన్నామని భావిస్తుంటారు. వారు వ్యాయాయం చేయడంతోపాటు, ఆరోగ్యకరమైన ఆహారం, చెడు అలవాట్లు లేకపోవడం లేదా ఉన్నా కానీ పరిమిత అలవాట్లతో వారికి వైద్య బీమా ఆ వయసులో అవసరం అనిపించకపోవచ్చు. కానీ, గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఎటువంటి వైద్య సమస్యల్లేని సమయంలోనే హెల్త్‌ పాలసీ తీసుకోవడం మంచిది. అందుకే చిన్న వయసులోనే వైద్య బీమా పాలసీ తీసుకోవాలని సిఫారసు చేస్తుంటారు. దీనివల్ల పెద్ద వయసులో తీసుకునే పాలసీతో పోలిస్తే తక్కువ ప్రీమియానికే సమగ్ర కవరేజీతో కూడిన పాలసీ లభిస్తుంది. 

వయసుతోపాటు వైద్య బీమా పాలసీ కొనుగోలు వ్యయం కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ వైద్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల ప్రీమియం కూడా ఎక్కువవుతుంది. చిన్న వయసులోనే వైద్య బీమా పాలసీ తీసుకోవడానికి ఉన్న మరో కారణం... క్యుమిలేటివ్‌ బోనస్‌ను పొందొచ్చు. చిన్న వయసులో ఉన్న వారు క్లెయిమ్స్‌ చేసుకునే అవకాశాలు తక్కువ. క్యుములేటివ్‌ బోనస్‌ 50 శాతం వరకు సమ్‌ ఇన్సూర్డ్‌ మొత్తంలో లభిస్తుంది. దీంతో మీ వైద్య బీమా మొత్తం 150 శాతం అవుతుంది. కానీ ప్రీమియం మాత్రం 100 శాతం బీమాకు చెల్లిస్తే చాలు. చిన్న వయసులోనే ఎందుకు వైద్య బీమా తీసుకోవాలన్న దానికి ఇవి కొన్ని కారణాలు మాత్రమే. ఓ కుటుంబానికి ఆధారమైన వారు కుటుంబమంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ పాలసీ తీసుకోవాలి. ప్రజలు వైద్య బీమాను దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడాలి. తగినంత వైద్య బీమా కవరేజీ ఉన్న వారు ప్రశాంతతో ఉండొచ్చు. ఆర్థిక భద్రతను కూడా ఇస్తుంది. అయితే, కొందరు తమకు వైద్య సమస్యలు ఆరంభమైన తర్వాతే వైద్య బీమా అవసరాన్ని గురిస్తుంటారు. అందుకే ఆలస్యం చేయకుండా వైద్య పాలసీ తీసుకోవాలి. 

- సంజయ్‌దత్తా, చీఫ్‌ క్లెయిమ్స్‌, అండర్‌రైటింగ్‌ అండ్‌ రీఇన్సూరెన్స్‌
ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

 



You may be interested

రిస్క్‌ ఉన్నా రాబడులు ఆశించే వారికి

Monday 10th June 2019

రిస్క్‌ ఉన్నా రాబడులు ఆశించే వారికి కోటక్‌ ఎమర్జింగ్‌ ఈక్విటీ ఫండ్‌ స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ దిద్దుబాటుకు గురై ఆకర్షణీయ విలువలకు చేరాయి.  గతేడాది స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 21 శాతం పతనం కాగా, మిడ్‌క్యాప్‌ సూచీ 12 శాతం మేర నష్టపోయింది. స్మాల్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో అస్థిరత కాస్త తక్కువ.  ఈ తరుణంలో మంచి మిడ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఎంచుకుని దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మెరుగైన రాబడులను సొంతం

పెట్టుబడి నిర్ణయాలకు....మహిళలూ ముందుకు రావాలి...

Monday 10th June 2019

పెట్టుబడి నిర్ణయాల్లో మహిళల పాత్ర సగమే పురుషులతో పోలిస్తే సగం మందే సొంత నిర్ణయాలు నిర్ణయాలు తీసుకునే వారి వెనుక జీవిత భాగస్వాముల ప్రోత్సాహం డీఎస్‌పీ విన్‌వెస్టర్‌ పల్స్‌ సర్వేలో ఆశ్చర్యకర అంశాలు పురుషులతో సమానంగా మహిళలూ తమ శక్తి సామర్థ్యాలను చాటుకుంటున్నారు. సొంతంగా వ్యాపారాలను సృష్టిస్తున్న వారు... ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్న వారు... వ్యాపార సామ్రాజ్యాలను ఒంటిచేత్తో నడిపిస్తున్న వారు... ఎందరో ఉన్నారు. అయితే, ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలకు వచ్చే సరికి వారిలో ఎక్కడో తటపటాయింపు..!

Most from this category