STOCKS

News


జీవిత బీమా చౌక... ఆరోగ్య బీమా ఖరీదు!

Sunday 2nd December 2018
personal-finance_main1543774933.png-22575

జీవిత బీమా పాలసీలు అందుబాటు ధరలకు దిగిరానున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం కాస్త భారం కానుంది. ప్రజల ఆయుర్ధాయం పెరిగిపోతుండడం ఇందుకు కారణం. ఇక ఆరోగ్య బీమా పాలసీల్లో మినహాయింపులను తగ్గించేయాలని పలు కోర్టులు ఆదేశాలు జారీ చేసినందున వీటి ప్రీమియం పెరగనుంది. ‘‘నూతన మోర్టాలిటీ (మరణాలకు సంబంధించి) టేబుల్‌లో 10 శాతం మెరుగుదల ఉంది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఇండియా దీన్ని రూపొందించింది. ఈ మోర్టాలిటీ టేబుల్‌ ఆధారంగానే బీమా కంపెనీలు ప్రీమియంను నిర్ణయిస్తాయి’’ అని మిలిమన్‌ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ హెడ్‌ సంకేత్‌ కవత్‌కార్‌ తెలిపారు. అయితే, జీవిత బీమా ప్రీమియం రేట్లు మన ప్రాంతంలో ఇప్పటికే తక్కువగా ఉన్నట్టు చెప్పారు. ‘‘టర్మ్‌ ఇన్సూరెన్స్‌ రేట్లు ఆస్ట్రేలియాలో పోలిస్తే భారత్‌లో తక్కువ. కానీ, ఆస్ట్రేలియాలో జీవిత కాలం ఎక్కువ’’ అని కవత్‌కార్‌ తెలిపారు. అంతర్జాతీయ రీఇన్సూరెన్స్‌ సంస్థల సహకారం వల్లే బీమా సంస్థలు తక్కువ ప్రీమియంకే టర్మ్‌ఇన్సూరెన్స్‌ పాలసీలను అందిస్తున్నట్టు చెప్పారు. 

 

భారత మార్కెట్‌ భారీ పరిమాణం నేపథ్యంలో అంతర్జాతీయ రీఇన్సూరెన్స్‌ సంస్థలు బుల్లిష్‌గా ఉన్నాయని మిలిమన్‌ సంస్థకు చెందిన హీరక్‌బసు తెలిపారు. భారత్‌లో జీవిత బీమా రక్షణ అంతరంగా ఎక్కువగా ఉందని, ఇది రూ.9 లక్షల కోట్ల డాలర్ల మేర ఉంటుందన్నారు. దీంతో ఇది వాటికి అతిపెద్ద మార్కెట్‌ అని అభివర్ణించారు. ప్రస్తుత జీవన ప్రమాణాలకు తగ్గకుండా జీవించేందుకు కావాల్సిన రక్షణను మార్కెట్‌ పరిమాణంగా పరిగణిస్తారు. విక్రయాలు పెంపు, అండర్‌రైటింగ్‌ ప్రక్రియల్లో టెక్నాలజీ వినియోగం ద్వారా వ్యయాలు తగ్గుతాయని చెప్పారు. హెచ్‌ఐవీ, మానసిక అనారోగ్యాలు, పుట్టకతో వచ్చే లోపాలకు కూడా కవరేజీ ఇవ్వాలంటూ పలు కోర్టులు తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో భారత్‌లో వైద్య బీమా ప్రీమియం పెరగనుందని మిలిమన్‌ సంస్థకు చెందిన లలిత్‌ బవేజా తెలిపారు. బీమా కంపెనీలు తమ ప్రస్తుత పాలసీల్లో ఉన్న మినహాయింపులను సమీక్షించి, సవరించిన ధరల కోసం ఐఆర్‌డీఏ వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు.You may be interested

టాప్‌ కంపెనీల్లో 95 శాతం రేపు కనుమరుగే!

Sunday 2nd December 2018

ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) ఇక ఎంత మాత్రం ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు కానే కావని, అవి ప్రధాన పెట్టుబడి సాధనాలుగా అవతరిస్తున్నాయని, అధిక ధనవంతులు (హెచ్‌ఎన్‌ఐలు) మార్కెట్‌ను మించిన రాబడుల (ఆల్ఫా) కోసం వీటిని ఆశ్రయిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. 2012 నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ రూ.9 లక్షల కోట్ల నిధులను ఆకర్షిస్తే... ఏఐఎఫ్‌ల్లోకి వచ్చింది రూ.లక్ష కోట్లుగా ఉన్నట్టు ప్రముఖ వెల్త్‌, హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్లు ఈటీమార్కెట్స్‌

ఈ స్టాక్స్‌పై సానుకూలత: మోతీలాల్‌ ఓస్వాల్‌

Sunday 2nd December 2018

నిఫ్టీ తన డౌన్‌లెగ్‌లో 10,880 సమీపంలో 50 శాతం రీట్రేస్‌మెంట్‌ను పూర్తి చేసిందని, ఇక కీలకమైన 11,000 మార్కును చేరుకోవాలంటే 10,777-10,800పైన నిలదొక్కుకోవాల్సి ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చందన్‌ తపారియా తెలిపారు. దిగువ వైపు 10,650 వద్ద కీలక మద్దతుగా నిలుస్తుందన్నారు. ‘‘నిఫ్టీ నవంబర్‌ సిరీస్‌లో 734 పాయింట్ల మేర లేదా 7.25 శాతం పెరిగింది. 2016 మార్చి తర్వాత చూస్తే ఒక

Most from this category