STOCKS

News


ఎడిల్‌వైజ్‌ టోకియో లైఫ్‌ కొత్త టర్మ్‌ ప్లాన్‌

Thursday 9th August 2018
personal-finance_main1533809434.png-19104

ఎడిల్‌వైజ్‌ గ్రూప్‌, టోకియో మెరైన్‌ హోల్డిం‍గ్స్‌ జాయింట్‌ వెంచరే ఎడిల్‌వైజ్‌ టోకియో లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. కస్టమర్ల కోసం ‘జిందగి పల్స్‌’ అనే కొత్త ప్లాన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది టర్మ్‌ ప్లాన్‌. కస్టమర్లకు సంబంధించి మారుతున్న ప్రాధాన్యతలు, అవసరాలకు అనువుగా సమగ్రమైన రక్షణే లక్ష్యంగా కంపెనీ ఈ పాలసీని ఆవిష్కరించింది. జిందగి ప్లస్‌లో బెటర్‌ హాఫ్‌ బెనిఫిట్‌, సమ్‌ అస్యూర్డ్‌ తగ్గుదల అనే రెండు ప్రధాన పీచర్లుంటాయని పేర్కొంది. బెటర్‌ హాఫ్‌ బెనిఫిట్‌ విషయంలో పాలసీదారుడు మరణిస్తే అతని భార్యకు పాలసీ కవరేజ్‌ వర్తిస్తుంది. దీనికి భవిష్యత్‌లో ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. గృహిణులకు ఈ పాలసీ ఎంతో ఉత్తమంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. సమ్‌ అస్యూర్డ్‌ తగ్గుదల ఫీచర్‌ విషయానికి వస్తే.. పాలసీదారుడికి 60 ఏళ్లు వచ్చే వరకు పాలసీ సమ్‌ అస్యూర్డ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. దీని తర్వాత 50 శాతం తగ్గుతుంది. సమ్‌ అస్యూర్డ్‌ తగ్గుదల ఆప్షన్‌ ఎంచుకుంటే ప్రీమియం చెల్లింపు తక్కువగా ఉంటుంది. 
పాలసీ ప్రత్యేకతలు..
♦ టాప్‌అప్‌ బెనిఫిట్‌: సమ్‌ అస్యూర్డ్‌ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లే సదుపాయం ఉంది.
♦ లైఫ్‌ స్టేజ్‌ బెనిఫిట్‌: జీవితంలోని వివిధ దశల్లో సమ్‌ అస్యూ‍ర్డ్‌ మొత్తం పెరుగుతుంది.
♦ 60 ఏళ్ల వరకు చెల్లింపులు: రిటైర్మెంట్‌ వయసు వరకే ప్రీమియం చెల్లించే ఆప్షన్‌ కూడా ఉంది.
♦ క్లిష్టమైన అనారోగ్యంతో బాధపడుతుంటే భవిష్యత్‌ ప్రీమియం చెల్లింపులు రద్దు అవుతాయి.
♦ పాలసీదారుడు మరణించిన తర్వాత సమ్‌ అస్యూర్డ్‌ మొత్తాన్ని డిపెండెంట్‌కు చెల్లిస్తుంది. దీన్ని ఏకమొత్తంగా, నెలవారీ ఆదాయంగా, లేదా రెండు మార్గాల్లో తీసుకోవచ్చు. 
♦ ప్రమాదాల వల్ల మరణించడం, శాశ్వత అంగ వైకల్యం, క్లిష్టమైన అనారోగ్యం వంటి వాటికి రైడర్లు తీసుకోవచ్చు.


 



You may be interested

ఆసుస్‌ ‘బ్యాక్‌ టు కాలేజ్‌’ ఆఫర్‌

Thursday 9th August 2018

కుర్ర కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆసుస్‌సంస్థ బ్యాక్‌ టు కాలేజ్‌తో పాటు పలు ఆఫర్లను ప్రకటించింది. బ్యాక్‌ టు కాలేజ్‌ ఆఫర్‌: ఈ ఆఫర్‌లో భాగంగా ఆసుస్‌ సంస్థ నోట్‌బుక్స్‌ కొనుగోలు చేసినవారికి వారెంటీ పొడిగింపు ఉంటుంది. ఆసుస్‌నోట్‌ బుక్‌ కొనుగోలు దారులు రూ. 499, గేమింగ్‌ నోట్‌బుక్‌ కొనుగోలుదారులు రూ. 999 చెల్లించి రెండేళ్ల వారెంటీ, రూ. 999, రూ. 1499 చెల్లించి మూడేళ్ల వారెంటీ పొడిగింపు పొందవచ్చు. ఈ ఆఫర్‌

స్వరాజ్‌ ఇంజిన్స్‌కు బై రేటింగ్‌

Thursday 9th August 2018

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: స్వరాజ్‌ ఇంజిన్స్‌ ఇండస్ట్రీ: ఆటో రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర రూ.1820 టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,498  స్వరాజ్‌ ఇంజిన్స్‌ షేరుపై బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి.. స్వరాజ్‌ స్టాక్స్‌పై బుల్లిష్‌గా ఉంది. షేరు కొనొచ్చని సిఫార్సు చేస్తోంది. స్వరాజ్‌ ఇంజిన్స్‌ షేరు ధర రూ.2,498 వరకూ వెళ్లొచ్చని అంచనా వేస్తోంది. ప్రభుత్వాల సబ్సిడీ స్కీమ్స్‌, ట్రాక్టర్‌ విక్రయాల బాగా పెరగొచ్చనే అంచనాలు, తక్కువ ‍వ్యయాలు, బలమైన బ్యాలెన్స్‌ షీటు వంటి పలు అంశాల ఇందుకు కారణంగా నిలుస్తాయని పేర్కొంది.

Most from this category