STOCKS

News


బీమా క్లెయిమ్‌ తిరస్కరణకు కారణాలు ఇవే...

Monday 27th August 2018
personal-finance_main1535309297.png-19652

జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అవునంటే దరఖాస్తు పత్రాన్ని నింపే విషయంలో తప్పులకు చోటివ్వకండి. ఎందుకంటే ఊహించని సందర్భాల్లో క్లెయిమ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే... బీమా కంపెనీలు పరిహారం చెల్లింపునకు తిరస్కరించే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. రవికిరణ్‌ బాబు కోటి రూపాయిల టర్మ్‌ పాలసీ తీసుకున్నాడు. దరఖాస్తు పత్రాన్ని నింపే బాధ్యతను ఏజెంట్‌పైనే పెట్టడంతో, ఆ ఏజెంట్‌ తనకు తోచినట్టు ఫామ్‌ను నింపేసి సమర్పించాడు. కానీ, దురదృష్టవశాత్తూ గతేడాది బాబు తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాబు భార్య సుజాత బీమా కంపెనీ వద్ద క్లెయిమ్‌ పత్రాలు సమర్పించగా, కంపెనీ తిరస్కరించింది. ముందు నుంచి ఉన్న వ్యాధుల సమాచారం తెలియజేయనందున కంపెనీ మొండి చేయి చూపించింది. అందుకే బీమా పాలసీ సమయంలో పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. బీమా క్లెయిమ్‌ తిరస్కరణకు ప్రధానమైన కారణాలను నిపుణుల ఆధారంగా తెలియజేసే కథనం ఇది.

 

బీమా ప్రపోజల్‌ ఫామ్‌లో తప్పుడు సమాచారం లేదా అసంపూర్ణ సమాచారం పేర్కొన్నా... లేదా వాస్తవ సమాచారాన్ని దాచి పెట్టినా క్లెయిమ్‌ తిరస్కారానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని కవర్‌ఫాక్స్‌ డాట్‌ కామ్‌ డైరెక్టర్‌ మహావీర్‌ చోప్రా తెలిపారు. ‘‘ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినా లేక ఉద్దేశపూర్వకంగా కాకపోయినా సరే అది బీమా పరిహారం క్లెయిమ్‌ తిరస్కారానికి దారితీస్తుంది’’ అని పాలసీబజార్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సంతోష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 

 

వైద్య చరిత్ర
జీవన విధానం, వైద్య, కుటుంబ చరిత్ర గురించిన కాలమ్స్‌లో వివరాలను సమగ్రంగా ఇవ్వడమే మంచిది. ఈ కాలమ్స్‌ను వదిలివేయడం లేదా వ్యక్తిగత ఆరోగ్యం, జీవన అలవాట్లు, ముఖ్యంగా పొగతాగడం, ఆల్కహాల్‌ సంబంధిత అలవాట్ల సమాచారాన్ని దాచి ఉంచడం చేయవద్దని మహావీర్‌చోప్రా సూచించారు. సిగరెట్‌ను అప్పుడప్పుడు తాగుతున్నా... ప్రపోజల్‌ పత్రంలో నాన్‌ స్మోకర్‌గా పేర్కొనవద్దని సలహా ఇచ్చారు. తక్కువ ప్రీమియం కోసమని ఆల్కహాల్‌, సిగరెట్ల అలవాట్లను దాచి ఉంచడం వల్ల కచ్చితంగా క్లెయిమ్‌ తిరస్కారానికి దారితీస్తుందని సంతోష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. పాలసీ జారీకి తిరస్కరిస్తారని ఏదైనా అనారోగ్య సమాచారాన్ని దాచి ఉంచితే అది సైతం పరిహారం చెల్లింపునకు నిరాకరించడానికి కారణమవుతుందన్నారు. పాగతాగడం, లైఫ్‌స్టయిల్‌కు సంబంధించి అలవాట్ల కారణంగా ఏదైనా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే ఆ సమచారాన్ని సైతం కచ్చితంగా తెలియజేయాలన్నది వీరి సూచన.

 

ముందస్తు వ్యాధులు
టర్మ్‌ పాలసీకి హెల్త్‌ సంబంధిత రైడర్లను జోడించుకునే వారు తమకున్న అనారోగ్య సమస్యలు, ఇతర వైద్య చరిత్రను సంపూర్ణంగా బీమా ప్రపోజల్‌ ఫామ్‌లో పేర్కొనాలని చోప్రా సూచించారు. ప్రస్తుతం చాలా టర్మ్‌ పాలసీలు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌తో వస్తున్నాయి.

 

క్లెయిమ్‌ దాఖలులో జాప్యం
మరణానంతరం నిర్ణీత వ్యవధిలోపు క్లెయిమ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోపు క్లెయిమ్‌ అప్లికేషన్‌ దాఖలు చేయకపోయినా అనవసర అనుమానాలకు దారితీస్తుందని చోప్రా వివరించారు. ఇలా జరిగితే బీమా సంస్థ సుదీర్ఘ దర్యాప్తును చేపడుతుందని, దీనివల్ల కాలహరణంతోపాటు కొన్ని సందర్భాల్లో పరిహారం తిరస్కారానికి కూడా అవకాశం ఉంటుందన్నారు. 

 

పాలసీ ల్యాప్స్‌
బీమా పాలసీ తీసుకున్న ప్రతి ఒక్కరూ దాన్ని ఇన్‌ఫోర్స్‌లో ఉంచేలా చూసుకోవాలి. సకాలంలో ప్రీమియం చెల్లించడం ద్వారానే ఇది సాధ్యం. గడువు దాటిన తర్వాత గ్రేస్‌ పీరియడ్‌ ముగిసేలోపు ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్‌ అయిపోతుంది. అలా ల్యాప్స్‌ అయిన పాలసీ తరఫున క్లెయిమ్‌లను కంపెనీలు తిరస్కరిస్తాయి. You may be interested

రూపాయి పతనంతో ఏ స్టాక్‌పై ఎటువంటి ప్రభావం?

Monday 27th August 2018

రూపాయి 70 దగ్గర్లో చలిస్తోంది. డాలర్‌తో ఇటీవలి కాలంలో రూపాయి బలహీనపడింది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 9 శాతం విలువను కోల్పోయింది. టర్కిష్‌ లిరా 40 శాతం పతనం కావడం, చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం, చమురు ధరలు ఇలా ఏ అంశాలైనా కారణం కావచ్చు... రూపాయి విలువ పతనం స్టాక్స్‌పై సానుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఏ స్టాక్‌పై

రిస్క్‌ తక్కువ... రాబడులు ఎక్కువ!

Monday 27th August 2018

రిస్క్‌ తక్కువ, రాబడులు ఎక్కువ ఉండే స్టాక్స్‌ను ఎంచుకోవడం వల్ల ఇన్వెస్టర్లు నిశ్చింతగా ఉండొచ్చు. మరి ఓ స్టాక్‌ రిస్క్‌ను ఎలా గుర్తించాలి...? నిర్ణీత కాలంలో ఓ స్టాక్‌ సగటు రాబడులు, సాధారణ రాబడుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ద్వారా దీన్ని అంచనా వేయవచ్చంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఓ స్టాక్‌ గడిచిన ఐదేళ్ల కాలంలో 5 శాతం, 10 శాతం, 7 శాతం, 8 శాతం, మైనస్‌ 7 శాతం

Most from this category