STOCKS

News


36 క్లిష్ట ఆరోగ్య సమస్యలకు పాలసీ

Tuesday 11th September 2018
personal-finance_main1536641351.png-20144

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బీమా రంగ సంస్థ బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌... సోమవారం కొత్త​పాలసీని ప్రవేశపెట్టింది. బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ హెల్త్‌ కేర్‌ గోల్‌ పేరుతో రూపొందిన ఈ పాలసీ 36 రకాల క్లిష్ట ఆరోగ్య సమస్యలను కవర్‌ చేస్తుంది. ఒక ప్రీమియంతో ఒకే పాలసీ కింద ఆరుగురు సభ్యులున్న కుటుంబం లబ్ది పొందవచ్చు. రూ.5 లక్షల పాలసీ తీసుకుంటే ఒక్కొక్కరికి రూ.5 లక్షల కవరేజ్‌ ఉంటుంది. సంప్రదాయ హెల్త్‌ పాలసీలతో పోలిస్తే ఇది చాలా భిన్నం. సమస్యను గుర్తిస్తూ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ఇచ్చే రిపోర్ట్‌ ఉంటే చాలు. బీమా మొత్తాన్ని పాలసీదారు ఖాతాలో జమ చేయడం ఈ పాలసీ ప్రత్యేకత. 
క్లెయిమ్‌ చేయనట్టయితే..
పిల్లల క్లిష్ట ఆరోగ్య సమస్యలను సైతం కవర్‌ చేసిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తమదేనని సంస్థ ఎండీ తరుణ్‌ చుగ్‌ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. 36 రకాల్లో పాలసీదారుకు ఇప్పటికే ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్టయితే 90 రోజుల తర్వాత కవరేజ్‌ లభిస్తుందని చెప్పారు. 32-35 ఏళ్ల వయసున్న పాలసీదారు, ఆయన భార్య, ఇద్దరు పిల్లల కోసం రూ.6,477 చెల్లిస్తే రూ.5 లక్షల పాలసీ లభిస్తుంది. 10, 15, 20 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో క్లెయిమ్‌ చేయనట్టయితే చెల్లించిన ప్రీమియం వెనక్కి వస్తుంది. ఈ ఫీచర్‌ కావాల్సినవారు సుమారు రెండింతల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 



You may be interested

స్పైస్‌జెట్‌ నుంచి ఎయిర్‌ కార్గో సర్వీసులు

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌ కంపెనీ ఈ నెల 18 నుంచి పూర్తి స్థాయి ఎయిర్‌ కార్గో సర్వీసులను ప్రారంభించనుంది. స్పైస్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్రాండ్‌ కింద ఈ ఎయిర్‌ కార్గో సర్వీసులను అందిస్తామని స్పైస్‌జెట్‌ సీఎమ్‌డీ అజయ్‌ సింగ్‌ చెప్పారు.  పూర్తి స్థాయి ఎయిర్‌ కార్గో సేవలను అందిస్తున్న తొలి దేశీయ విమానయాన సంస్థ తమదేనని పేర్కొన్నారు.. బోయింగ్‌ 737-700 విమానాన్ని దీని కోసం వినియోగిస్తామని, ఇది 20 టన్నుల కార్గోను రవాణా

అక్కడక్కడే పసిడి

Tuesday 11th September 2018

క్రితంరోజు 1200 డాలర్ల దిగువన ట్రేడైన పసిడి ధర మంగళవారం కూడా అక్కడక్కడే కదులుతోంది. ఫెడరల్‌ వడ్డీరేట్ల పెంపు భయాలు, అమెరికా - చైనా దేశాల మధ్య తొలగని వాణిజ్య యుద్ధ భయాలు ఇందుకు కారణమవుతున్నాయి. నేడు ఆసియా మార్కెట్లో భారతవర్తమాన కాలం ఉదయం10 గంటలకు ఔన్స్‌ పసిడి 0.70 డాలర్లు నష్టపోయి రూ.1,199.00 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనా నుంచి దిగుమతయ్యే అన్ని

Most from this category