STOCKS

News


జీవిత బీమా పాలసీల్లో భారీ వృద్ధి

Sunday 16th December 2018
personal-finance_main1544982095.png-22977

జీవిత బీమా పాలసీల ప్రాధాన్యతను మన దేశీయులు బాగానే అర్థం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సూచికగా సగటు టికెట్‌ సైజు గత పదేళ్ల కాలంలో 2.45 రెట్లు పెరిగిందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఓ సగటు రిటైల్‌ కస్టమర్‌ నుంచి వసూలు చేసే రెగ్యులర్‌ ప్రీమియం రూ.9,942 ఉండగా, 2017-18 సంవత్సరంలో ఇది రూ.22,549కి పెరిగినట్టు పేర్కొంది. టికెట్‌ సైజు పెరగడం అంటే కస్టమర్లు బీమా పాలసీల కోసం అధిక ప్రీమియం చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని కోటక్‌ తెలిపింది. అయితే, బీమా అవసరంతో పోలిస్తే తీసుకునే మొత్తం తక్కువగా ఉందని ఈ సంస్థ తన నివేదికలో వివరించింది.  

 

బీమా రక్షణ తక్కువే
తగినంత బీమా రక్షణ లేని దేశాల్లో ప్రపంచంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. బీమా అంతరం విలువ 27 బిలియన్‌ డాలర్లు (రూ.1.98 లక్షల కోట్లు సుమారు). భారత్‌లో 2012 నుంచి చూస్తే బీమా వ్యాప్తి మొత్తం మీద 0.2 శాతమే పెరిగినట్టు ఇన్సూరెన్స్‌, రీఇన్సూరెన్స్‌కు చెందిన లయడ్‌ నిర్వహించిన సర్వే తెలియజేసింది. ప్రపంచంలో అత్యధిక బీమా అంతరం ఉన్న ఒకానొక దేశంగా భారత్‌ కొనసాగుతోందని ఈ సంస్థ అంటోంది. ప్రజలకు వాస్తవంగా అవసరమైన బీమా రక్షణ కంటే తక్కువ తీసుకుంటే దాన్ని అంతరంగా చెబుతారు. ఉదాహరణకు ఓ వ్యక్తికి రూ.10 లక్షల బీమా అవసరం అయితే, దాని కంటే తక్కువ తీసుకోవడం. 

 

బ్యాంకులతో భాగస్వామ్యం ఉన్న బీమా సంస్థలను పరిశీలిస్తే వాటి టికెట్‌సైజు ఎక్కువగా ఉంది. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటే సగటు టికెట్‌ సైజు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య రూ.80,365గా ఉంది. కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సగటు టికెట్‌ సైజు రూ.70,135తో రెండో స్థానంలో ఉంది. ప్రైవేటు కంపెనీలు ఎక్కువగా యులిప్‌ పాలసీలను విక్రయిస్తుంటే, ఎల్‌ఐసీ మాత్రం సం‍ప్రదాయ పాలసీలను ఎక్కువగా విక్రయిస్తోంది. ఎల్‌ఐసీ సగటు టికెట్‌ సైజు రూ.13,943గా ఉంది. ప్రైవేటు బీమా సంస్థల సగటు టికెట్‌ సైజు రూ.52,939గా ఉంది.



You may be interested

మూడేళ్లు దాటితే ఎల్‌టీసీజీ వద్దు: బ్రోకర్ల డిమాండ్‌

Sunday 16th December 2018

షేర్లను కొనుగోలు చేసి మూడేళ్ల పాటు కొనసాగించిన వారికి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) మినహాయింపు కల్పించాలని బ్రోకరేజీ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సూచించాయి. ఏడాది కాలానికి మించి షేర్లను అట్టిపెట్టుకుంటే, వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) మినహాయింపును మోదీ సర్కారు ఈ ఏడాది ఎత్తేసి, లాభం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష దాటితే 10 శాతం పన్నును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

వచ్చే వారం ఎలా ఉండొచ్చు?

Saturday 15th December 2018

ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా వారాంతానికి దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. దీంతో రాజకీయ అంశాలు మార్కెట్లపై తాత్కాలిక ప్రభావాన్ని మాత్రమే చూపుతాయని మరోమారు నిరూపితమైంది. ఈ వారం చివరకు నిఫ్టీ దాదాపు ఒక శాతం లాభంతో 10805 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం 10333పాయింట్ల కనిష్ఠం నుంచి నిఫ్టీ దాదాపు 500 పాయింట్ల ర్యాలీ జరిపింది. అయితే ఇప్పటికీ నిఫ్టీ తాత్కాలిక టాప్‌ 10940 పాయింట్ల దిగువనే ఉంది. ఈ

Most from this category