STOCKS

News


యాప్‌కీ కహానీ...

Monday 30th October 2017
personal-finance_main1509345343.png-10552

ప్రైవేట్‌ రంగ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తన క్రెడిట్‌ కార్డు వినియోగదారుల కోసం ‘ఆర్‌బీఎల్‌ మైకార్డ్‌’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

  • ప్రత్యేకతలు

- ఆర్‌బీఎల్‌ క్రెడిట్‌ కార్డు అకౌంట్‌ను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా యాక్సెస్‌ చేయవచ్చు.
- కార్డు లావాదేవీలు చూసుకోవచ్చు. స్టేట్‌మెంట్లను పొందొచ్చు.
- క్రెడిట్‌ కార్డు బిల్లులను చెల్లించొచ్చు. 
- కార్డును స్విచ్‌ ఆఫ్, ఆన్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.
- రివార్డు పాయింట్ల ఎన్నున్నాయో తెలుసుకోవచ్చు.
- క్రెడిట్‌ లిమిట్‌ ఆప్షన్‌ ఉంది. దీని సాయంతో కొనుగోళ్లపై పరిమితి విధించుకోవచ్చు.
- ఇంటర్నేషనల్‌ ట్రాన్సాక‌్షన్లను యాక్టివేట్, డియాక్టివేట్‌ చేసుకునే ఫీచర్‌ ఉంది. 
- అధిక మొత్తంతో నిర్వహించిన లావాదేవీలను ఈఎంఐలోకి మార్చుకోవచ్చు.



You may be interested

ఐటీసీ రేటింగ్‌ కట్‌: తగ్గిన షేరు

Monday 30th October 2017

ముంబై: ఐటీసీ షేరు ధర సోమవారం ట్రేడింగ్‌లో ఒకటిన్నర శాతం నష్టపోయింది. రూ.265.30 దగ్గర ఇంట్రాడే కనిష్టస్థాయిని నమోదుచేసింది. పలు బ్రోకింగ్‌ సంస్థలు షేరు టార్గెట్‌ ధరను తగ్గించిన నేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్‌లో షేరు ధర నష్టాలబాట పట్టింది. తాజాగా కంపెనీ ప్రకటించిన క్యూ2 ఫలితాలు అంత ఆకర్షణీయంగా లేనందున టార్గెట్‌ ధరను కట్‌ చేసినట్లు బ్రోకింగ్‌ సంస్థలు తెలియజేశాయి.  బ్రోకింగ్‌ సంస్థల టార్గెట్‌ ధరలు  బ్రోకింగ్‌ సంస్థ పాత టార్గెట్‌ (రూ.) తాజా టార్గెట్‌ (రూ.) గోల్డ్‌మన్‌ శాక్స్ 305 283 ఐడీఎఫ్‌సీ 315 209 ఎస్‌బీఐ

ఏడాదిలో రూ.పదివేలకు మారుతీ షేరు!

Monday 30th October 2017

బ్రోకరేజ్‌ సంస్థల అంచనా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 50 శాతం ర్యాలీ జరిపిన మారుతీ సుజుకీ షేరు ఇదో జోరు కొనసాగిస్తుందని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఏడాది కాలంలో మారుతీ మరో 20 శాతం దూసుకుపోయి రూ.10,000కు చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నాయి. తాజాగా విడుదల చేసిన క్యు2 ఫలితాలు బాగుండడంతో మారుతీ షేరు సోమవారం లాభాల్లో ట్రేడవుతోంది. పరిశ్రమతో పోలిస్తే అత్యుత్తమ వృద్ధి రేటను మారుతీ

Most from this category