STOCKS

News


ఇ- వాలెట్‌ మోసాలకు కస్టమర్‌ బాధ్యుడు కాడు!

Saturday 5th January 2019
personal-finance_main1546682763.png-23423

మూడురోజుల్లోపు ఫిర్యాదు చేయాలి
ఆర్‌బీఐ ఆదేశాలు
ప్రీపెయిడ్‌ వాలెట్లను వినియోగించే కస్టమర్లు మోసానికి గురైతే వారు మూడు రోజుల్లోపు సదరు మోసాన్ని గురించి ఫిర్యాదు చేయాలని, అప్పుడు సదరు మోసానికి సంబంధించి కస్టమర్లకు ఎలాంటి బాధ్యత ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. జరిగిన మోసానికి అటు కంపెనీ, ఇటు కస్టమర్‌కు సంబంధం లేకుంటే మూడు రోజుల లోపు ఫిర్యాదుచేసిన కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. ఇంతవరకు బ్యాంకు మోసాలకు సంబంధించి ఇలాంటి నిబంధనలున్నాయి. తాజా ఆదేశాలతో కస్టమర్లకు మరింత విస్తృత ప్రయోజనం చేకూరనుంది. ఒకవేళ కస్టమర్‌ 4- 7 రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే లావాదేవీ విలువ లేదా రూ. పదివేలు(ఏది తక్కువైతే అది) వరకు కస్టమర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. అంటే మూడు రోజుల తర్వాత ఫిర్యాదు చేసిన కస్టమర్‌కు పదివేల రూపాయలకు పైన నష్టం వాటిల్లితే తప్ప ఎలాంటి సాయం అందదు.

ఒవేళ కస్టమర్‌ మోసం జరిగిన 7 రోజుల అనంతరం ఫిర్యాదు చేస్తే సదరు కస్టమర్‌కు పరిహారం చెల్లించాలా లేదా అనేది వాలెట్‌ నియమనిబంధనలను అనుసరించి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. అంటే ఏడు రోజుల అనంతరం ఫిర్యాదు చేసిన కస్టమర్‌కు పరిహారం ఇవ్వడమా? మానడమా? అనేది పూర్తిగా వాలెట్‌ కంపెనీపై ఆధారపడి ఉంటుంది. ఈ తరహా నిబంధనలు కస్టమర్లలో ధైర్యాన్ని నింపడంతో పాటు వారిలో బాధ్యతను పెంచుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ కస్టమర్‌ నిర్లక్ష్యం కారణంగా మోసం సంభవిస్తే అప్పుడు కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదని, కస్టమరే పూర్తి నష్టం భరించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే సొంత తప్పిదం వల్ల మోసపోయిన కస్టమర్‌ సదరు కంపెనీకి ఫిర్యాదు చేస్తే ఆపై ఏదైనా నష్టం వాటిల్లితే అప్పుడు కంపెనీనే బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో ఎక్కువభాగం కస్టమర్ల అజాగ్రత్త వల్లనే జరుగుతున్నాయని, ఈ నిబంధనతో వారిలో చైతన్యం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కస్టమర్లు ఫిర్యాదులు చేయడానికి వీలుగా వాలెట్‌ కంపెనీలు 24*7 కస్టమర్‌ కేర్‌ సేవలను అందుబాటులో ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశించింది. 



You may be interested

మరో 3 నెలల్లో విమానాల్లో మొబైల్‌ మాటలు

Saturday 5th January 2019

విమానాల్లో, ఓడల్లో మరో మూడు నెలల్లో మొబైల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో మొబైల్‌ వినియోగానికి సంబంధించి విధివిధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఒక మంత్రుల బృందాన్ని ఏర్పరిచింది. ఈ బృందం ఇకపై ప్రతి 15 రోజులకొకసారి సమావేశమయి ఇందుకు సంబంధించిన అడ్డంకులు, కావాల్సిన అనుమతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కనెక్టివిటీకి కావాల్సిన సేవలు తదితర అంశాలను చర్చించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి వైమానిక, షిప్పింగ్‌, టెలికం రంగాలకు చెందిన కంపెనీలు, ప్రభుత్వ

ఆనంద్‌ రాఠి సూచించిన వాల్యూ పిక్‌ ఇదే

Saturday 5th January 2019

ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలు తయారు చేసే హావెల్స్ ఇండియా షేరుకు ప్రముఖ రేటింగ్ సంస్థ ఆనంద్ రాఠి బుల్లిష్ రేటింగ్‌ను కేటాయించింది. విద్యుత్ స‌ర‌ఫ‌రా ప‌రిక‌రాల త‌యారీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హావెల్స్ షేరుకు బ‌ల‌మైన ఫండ‌మెంటల్‌తో కంపెనీ ధీర్ఘకాలంలో అత్యున్నత స్థితికి చేరుంద‌ని బ్రోక‌రేజ్ సంస్థ చెప్పుకొచ్చింది.  కంపెనీ షేరు టార్గెట్ ధ‌రను రూ.788లకు పెంచింది. షేరుపై బ్రోక‌రేజ్ సంస్థ మ‌రింత‌ విశ్లేష‌ణ‌ను ఇప్పుడు చూద్దాం... 1). ప్రస్తుత ఆర్థిక

Most from this category