STOCKS

News


వ్యాలెట్‌లో మోసాలకు ఇకపై మీది కాదు బాధ్యత?

Wednesday 5th December 2018
personal-finance_main1544033219.png-22672

ఆర్‌బీఐ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. అనధికారిక ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల్లో (ఖాతాదారుని ప్రమేయం లేకుండా జరిగేవి) సైబర్‌ దాడి, హ్యాకింగ్‌ వంటి చర్యల వల్ల ఖాతాదారులు మోసపోతే అందుకు వారికి ఉండే బాధ్యత పరిమితం. వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చినట్టయితే అస్సలు బాధ్యత లేనట్టే. ఇకపై ప్రీపెయిడ్‌ సాధనాలు (పీపీఐ) అయిన అమేజాన్‌ పే, పేటీఎం, మొబిక్విక్‌, ఫ్రీచార్జ్‌, ఆక్సిజెన్‌ వంటి వ్యాలెట్లకు కూడా ఇదే అమలు కానుంది. అంటే ప్రీపెయిడ్‌ సాధనాల ద్వారా అనధికారిక లావాదేవీలు జరిగినా, వ్యాలెట్లను హ్యాక్‌ చేసి డబ్బులు కొట్టేసినా నష్టపోవాల్సిన పరిస్థితి రాకుండా కస్టమర్లకు రక్షణ లభించనుంది. 

 

‘‘బ్యాంకులు, క్రెడిడ్‌ కార్డులు జారీ చేసే ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి అనధికారిక ఎలక్ట్రానిక్‌ లావాదేవీల్లో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేయాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వినియోగదారుల రక్షణ చర్యల్లో భాగంగా పీపీఐలకు సంబంధించిన అనధారిక ఎలక్ట్రానిక్‌ లావాదేవీలకు సంబంధించిన కస్టమర్లను కూడా ఒకే రక్షణ గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ఈ నెలాఖరులోపు విడుదల చేస్తాం’’అని ఆర్‌బీఐ బుధవారం నాటి తన ప్రకటనలో పేర్కొంది. బ్యాంకులు, క్రెడిట్‌ కార్డుల అనధికారిక, మోసపూరిత లావాదేవీల విషయంలో ప్రస్తుత నిబంధనలను చూస్తే... బ్యాంకు వైపు లోపం ఉంటే అందుకు కస్టమర్‌ నష్టపోవాల్సిన అవసరం రాకూడదు. అలాగే, బ్యాంకు వైపు, కస్టమర్‌ వైపు కూడా లోపం లేకుండా, వ్యవస్థలో ఎక్కడైనా లోపం కారణంగా మోసం జరిగి ఉంటే, దాన్ని కస్టమర్‌ వెంటనే మూడు పనిదినాల్లోపు బ్యాంకుకు తెలియజేస్తే అతనికి బాధ్యత ఉండదు. అలా కాకుండా ఆలస్యంగా నాలుగు నుంచి ఏడు రోజుల మధ్య బ్యాంకుకు రిపోర్ట్‌ చేస్తే అప్పుడు కస్టమర్‌ వైపు బాధ్యత రూ.5,000-25,000 మధ్య ఉంటుంది. ఏడు రోజుల తర్వాత రిపోర్ట్‌ చేస్తే బ్యాంకు బోర్డు నిబంధనల ప్రకారం నిర్ణయం ఉంటుంది. కస్టమర్‌ వైపు లోపం లేకుండా, బ్యాంకుకు నిర్ణీత సమయంలోపు రిపోర్ట్‌ చేసినట్టయితే... 10 రోజుల్లోగా బ్యాంకు ఖాతాదారుడు నష్టపోయిన మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. కస్టమర్‌ బాధ్యత విషయంలో సందేహం ఉంటే సదరు ఫిర్యాదును 90 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఇదీ ఆర్‌బీఐ మార్గదర్శకాల సారాంశం. ఇకపై వ్యాలెట్లను వినియోగించే వారు సైతం ఇదే విధమైన రక్షణ పొందే అవకాశం రానుంది.



You may be interested

కొంటే ఈ నెల్లోనే...! జనవరిలో ధరలు భారీగా పెంపు

Wednesday 5th December 2018

వచ్చే వేసవిలో చల్లదనం కోసం ఏసీ కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉందా...? అయితే, కాస్త ముందుగా, ఈ నెలలోనే కొనుగోలు చేసుకుంటే ఆర్థికంగా కలిసొస్తుంది. ఎందుకంటే కంపెనీలు 10 శాతం వరకు ధరల పెంపును జనవరి నుంచి అమలు చేయబోతున్నాయి. ధరల పెంపు ఒక్క ఏసీలకే కాదు... టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు వంటి వైట్‌గూడ్స్‌ అన్నింటి ధరలు పెరగబోతున్నాయి. వీటి ధరలు 7-10 శాతం మధ్యలో పెరుగుతాయని, ఏసీలలపై

హెచ్‌యూఎల్‌ టార్గెట్‌ ధర రూ.2,160..!

Wednesday 5th December 2018

ముంబై: హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) షేరు ధర బుధవారం ఒకదశలో రూ.1,854.80 వద్దకు చేరుకుని జీవితకాల గరిష్టస్థాయిని తిరగరాసింది. మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.44 (2.45 శాతం) లాభపడి రూ.1,852 వద్ద ముగిసింది. ఈ షేరుకు ఫిలిప్స్‌ కాపిటల్‌ (ఇండియా) బై కాల్‌ ఇచ్చింది. రూ.2,160 టార్గెట్‌ ధరను ప్రకటించింది. గ్లాక్సో స్మిత్‌క్లయిన్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌కు (జీఎస్‌కే) డీల్‌ ప్రకటన అనంతరం టార్గెట్‌ ధరను సవరించినట్లు తెలిపింది. 2021 ఆర్థిక

Most from this category