STOCKS

News


యాప్‌కీ కహానీ... –బీఎస్‌ఎన్‌ఎల్‌ వాలెట్‌

Monday 21st August 2017
personal-finance_main1503295799.png-7283

ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ ఇటీవల మొబైల్‌ వాలెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం మొబి క్విక్‌ సాయం తీసుకుంది. ఈ ‘బీఎస్‌ఎన్‌ఎల్‌ వాలెట్‌’ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
ప్రత్యేకతలు
–పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బాండ్, డేటా కార్డు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఇన్సూరెన్స్, యుటిలిటీ బిల్లులను చెల్లించొచ్చు. ప్రిపెయిడ్‌ మొబైల్, డీటీహెచ్‌ రీచార్జ్‌ చేసుకోవచ్చు.  
–బస్సు టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చు. క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. 
–షాపింగ్, ఫుడ్, ట్రావెల్‌ వెబ్‌సైట్స్‌/యాప్స్‌లో షాపింగ్‌ చేసి, ఎక్స్‌క్లూజివ్‌ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.  
–రెస్టారెంట్స్, కేఫ్‌లు, సూపర్‌మార్కెట్స్, గిఫ్ట్‌ షాప్స్, ఫిజికల్‌ స్టోర్స్‌లలో క్యాష్‌లెస్‌ చెల్లింపులు చేయవచ్చు. 
–ఇతరులకు డబ్బుల్ని పంపొచ్చు. 
–వాలెట్‌ను డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా డబ్బులతో నింపుకోవచ్చు. 
 



You may be interested

రేపే అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్ ఐపీఓ

Monday 21st August 2017

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆక్వాకల్చర్‌ కంపెనీ అపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ ఐపీఓ రేపు (22 ఆగస్టు, 2017)న ప్రారంభంకానుంది. రొయ్యల ఉత్పత్తి రంగంలోని ఈ కంపెనీ ఇష్యూ ప్రైస్‌ బ్యాండ్‌ రూ.171–175గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐపీఓ ద్వారా రూ.152 కోట్ల నిధులను సమీకరించనున్న కంపెనీ.. ఇందులో రూ.90 కోట్లను కాకినాడ వద్ద కొత్తగా ఏర్పాటుచేయనున్న రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం వ్యయం చేయనున్నట్లు వెల్లడించింది. ఇష్యూ

దూసుకుపోతోన్న టాటా గ్లోబల్‌ బేవరేజేస్‌ 

Monday 21st August 2017

టాటా గ్లోబల్‌ బేవరేజేస్‌ జోరు కొనసాగుతోంది. సోమవారం స్టాక్‌సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గుల మధ్య ట్రేడవుతున్నప్పటికీ టాటా గ్రూప్‌కు చెందిన ఈ మిడ్‌క్యాప్‌ షేర్‌  జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.203 ను తాకింది. ఈ షేర్‌గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో 25 శాతం వరకూ లాభపడడం విశేషం. ఈ నెల 10న రూ.156 వద్ద ఉన్న ఈ షేర్‌ సోమవారం రూ. 200ను దాటేసింది.  ఈ కంపెనీ అనుబంధ ప్లాంటేషన్‌ కంపెనీలు-అమాల్గమేటెడ్‌

Most from this category