STOCKS

News


మార్కెట్లోకి నిస్సాన్‌ ‘కిక్స్’

Wednesday 23rd January 2019
news_main1548220043.png-23742

ధరల శ్రేణి రూ.9.55 – 14.65 లక్షలు న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ నిస్సాన్‌.. ‘కిక్స్’ పేరుతో భారత మార్కెట్లో నూతన ఎస్‌యూవీ మోడల్‌ కారును విడుదల చేసింది. ప్రత్యేకించి ఇక్కడి మార్కెట్‌ కోసం రూపొందించిన ఈ కారు పెట్రోల్‌ వేరియంట్‌ లీటరుకు 14.23 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్‌ వేరియంట్‌ 20.45 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. పెట్రోల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.9.55 లక్షలు – రూ.10.95 లక్షలు కాగా, డీజిల్‌ వేరియంట్స్‌ ధరల శ్రేణి రూ.10.85 లక్షలు – రూ.14.65 లక్షలుగా నిర్ణయించింది. ఈ సందర్భంగా నిస్సాన్‌ ఇండియా, ఆఫ్రికా, మధ్యతూర్పు ప్రాంతాల చైర్మన్‌ పెయమన్‌ కార్గర్‌ మాట్లాడుతూ.. ‘భారత రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ కారును డిజైన్‌ చేశాం. ఇక్కడి పరిశోధన, అభివృద్ధి టీం.. జపాన్, అమెరికా, బ్రెజిల్ సంస్థలతో కలిసి పనిచేసి ఈ కారును రూపొందించింది. ఎస్‌యూవీ విభాగంలో కిక్స్‌ పూర్తిస్థాయి పోటీనివ్వనుంది.’ అని వ్యాఖ్యానించారు.
ఈ ఏడాదిలోనే ‘లీఫ్‌’ పేరుతో ఎలక్ట్రిక్‌ కార్‌
అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయిస్తోన్న ఎలక్ట్రిక్‌ కార్‌ ‘లీఫ్‌’ను ఈ ఏడాదిలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్లు నిస్సాన్‌ ప్రకటించింది. ఈ కారు విడుదలతోపాటు ఈ-పవర్‌, హైబ్రిడ్‌ కారు వంటి పర్యావరణ అనుకూల టెక్నాలజీని ఇక్కడి మార్కెట్‌లోకి తీసుకుని రావాలని యోచిస్తున్నట్లు కార్గర్‌ తెలిపారు. అయితే, 2010 నుంచి ఇప్పటివరకు 3.5 లక్షల యూనిట్ల గ్లోబల్‌ అమ్మకాలతో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న లీఫ్‌ను ముందుగా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారాయన.



You may be interested

టయోటా- ప్యానాసోనిక్‌ జట్టు

Wednesday 23rd January 2019

- ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీ తయారీకి జేవీ - 2020 కల్లా ఏర్పాటు! టోక్యో: ఎలక్ట్రిక్‌ కార్లకు అవసరమైన బ్యాటరీల తయారీ కోసం జపాన్‌ వాహన దిగ్గజం టొయోటా కంపెనీ మరో జపాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ప్యానాసోనిక్‌తో చేతులు కలుపుతోంది. ప్యానాసోనిక్‌తో కలసి 2020 నాటికల్లా ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ జేవీలో తమ వాటా 51 శాతంగా ఉండనున్నదని టయోటా తెలిపింది. బ్యాటరీలు కీలకం టయోటా కంపెనీ ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో

కెప్టెన్‌ మోదీ.. వరాల సిక్సర్‌?

Wednesday 23rd January 2019

రైతులకు నేరుగా నగదు ప్రయోజనం సబ్సిడీలన్నీ కలిపి నేరుగా ఇచ్చే ప్రతిపాదన సాగు రంగానికి మరింతగా రుణ వితరణ మధ్య తరగతి వర్గాలకు పన్ను ప్రోత్సాహకాలు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు  ప్రభుత్వానికి ద్రవ్యలోటు సవాళ్లు ప్రోత్సాహకాలు పెంచితే సమస్యలు పెంచకపోతే ఎన్నికల్లో గెలుపుపై ప్రభావం దీంతో బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో ఆసక్తి న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తన చివరి ఆదాయ, వ్యయాల చిట్టాను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఆఖరి ప్రయత్నంలో అయినా

Most from this category