STOCKS

News


మరో 3 నెలల్లో విమానాల్లో మొబైల్‌ మాటలు

Saturday 5th January 2019
news_main1546684295.png-23424

విమానాల్లో, ఓడల్లో మరో మూడు నెలల్లో మొబైల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో మొబైల్‌ వినియోగానికి సంబంధించి విధివిధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఒక మంత్రుల బృందాన్ని ఏర్పరిచింది. ఈ బృందం ఇకపై ప్రతి 15 రోజులకొకసారి సమావేశమయి ఇందుకు సంబంధించిన అడ్డంకులు, కావాల్సిన అనుమతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కనెక్టివిటీకి కావాల్సిన సేవలు తదితర అంశాలను చర్చించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి వైమానిక, షిప్పింగ్‌, టెలికం రంగాలకు చెందిన కంపెనీలు, ప్రభుత్వ అధికారుల మధ్య ఒక సమావేశం కూడా జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశానంతరం మంత్రులబృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ అనుమతులకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం గతంలో నోటిఫై చేసింది. ప్రస్తుతం నడుస్తున్న విమానాల్లో మొబైల్‌ సేవలకు సంబంధించిన అనుమతులను డీజీసీఏ ఇవ్వనుంది. ఇకమీదట నిర్మించే ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో ఇన్‌బుల్ట్‌గా మొబైల్‌సేవలు అందించే సదుపాయం కల్పించనున్నారు.

అయితే ఈ సేవలకు ఉపయోగించే హై శాటిలైట్‌ బ్యాండ్‌విడ్త్‌ చార్జీలు ఇన్‌ఫ్లైట్‌ మొబైల్‌ సేవలను దెబ్బతీయవచ్చని టెక్నాలజీ సంస్థ హగ్స్‌ ఇండియా హెచ్చరించింది. రెండు గంటల విమాన ప్రయాణంలో మొబైల్‌ సేవల వినియోగానికి టికెట్‌పై అదనంగా 700- 1000 రూపాయల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని, దీనివల్ల టికెట్‌ ధరలు పెరగవచ్చని అంచనాలున్నాయి. ఇస్రోమాత్రమే ఈ బ్యాండ్‌విడ్త్‌ అందించే ఏకైక సంస్థ కావడం వల్ల చార్జీలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. అయితే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే బ్యాండ్‌విడ్త్‌ సేవలను అందించే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వైమానిక సంస్థలకు హామీ ఇచ్చింది. 



You may be interested

కొత్త నిబంధనలకు గడువు పొడిగించండి..

Saturday 5th January 2019

కేంద్రాన్ని కోరనున్న ఈ కామర్స్ సంస్థలు న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి కొత్త నిబంధనల అమలుకు గడువును పొడిగించాలంటూ బడా ఈ కామర్స్ సంస్థలు.. కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిసింది. మార్పులు అమలు చేసేందుకు కనీసం 4- 5 నెలలు పడుతుందని, కాబట్టి అంత వరకూ సమయం ఇవ్వాలని అభ్యర్థించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వాస్తవానికి ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనల

ఇ- వాలెట్‌ మోసాలకు కస్టమర్‌ బాధ్యుడు కాడు!

Saturday 5th January 2019

మూడురోజుల్లోపు ఫిర్యాదు చేయాలి ఆర్‌బీఐ ఆదేశాలు ప్రీపెయిడ్‌ వాలెట్లను వినియోగించే కస్టమర్లు మోసానికి గురైతే వారు మూడు రోజుల్లోపు సదరు మోసాన్ని గురించి ఫిర్యాదు చేయాలని, అప్పుడు సదరు మోసానికి సంబంధించి కస్టమర్లకు ఎలాంటి బాధ్యత ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. జరిగిన మోసానికి అటు కంపెనీ, ఇటు కస్టమర్‌కు సంబంధం లేకుంటే మూడు రోజుల లోపు ఫిర్యాదుచేసిన కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. ఇంతవరకు బ్యాంకు మోసాలకు సంబంధించి ఇలాంటి

Most from this category