STOCKS

News


షావోమీ నుంచి రెడ్‌మీ గో స్మార్ట్‌ఫోన్‌

Wednesday 20th March 2019
Markets_main1553061165.png-24707

- ధర రూ. 4,499
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షావోమీ తాజాగా రెడ్‌మీ గో పేరిట భారత మార్కెట్లో కొత్త ఫోన్‌ ఆవిష్కరించింది. దీని ధర రూ. 4,499గా ఉంటుంది. 1 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్‌) ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెన్సార్‌, క్వాడ్‌-కోర్‌ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 425 చిప్‌ మొదలైనవి ఇందులో ప్రత్యేకతలు. మరోవైపు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత చెల్లింపులకు సంబంధించి 'మి' పేమెంట్స్ యాప్‌ను కూడా షావోమీ ఆవిష్కరించింది. పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఐసీఐసీఐ బ్యాంకు వ్యవహరిస్తుందని తెలిపింది. కేవలం యూపీఐకి మాత్రమే పరిమితం కాకుండా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లింపులు జరిపేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. త్వరలోనే దీన్ని 'మి' యాప్‌స్టోర్‌లో అందుబాటులోకి వస్తుందని షావోమీ తెలిపింది. షావోమీ అటు తమిళనాడులో మరో ప్లాంటును ప్రారంభించింది. దీంతో భారత్‌లో తమ ప్లాంట్ల సంఖ్య 7కు చేరినట్లు కంపెనీ పేర్కొంది. ఫాక్స్‌కాన్‌, ఫ్లెక్స్‌, హైప్యాడ్ సంస్థల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించింది. 



You may be interested

వ్యాపార అవకాశాల విస్తృతికి ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఒప్పందం

Wednesday 20th March 2019

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల విస్తృతికి పరస్పర సహకారం లక్ష్యంగా భారత్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), చైనా బ్యాంకింగ్‌ దిగ్గజం, మూలధనం పరిమాణం పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద బ్యాంక్‌-  బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (బీఓసీ) లు చేతులు కలిపాయి. ఈ మేరకు ఒక అవగహనా పత్రం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయంగా తమతమ మార్కెట్ల విస్తృతికి రెండు

జేఎల్‌ఆర్‌ కార్ల ధరలు పెరుగుతాయ్‌ !

Wednesday 20th March 2019

-కొన్ని మోడళ్లపై 4 శాతం పెరగనున్న ధరలు  -వచ్చే నెల నుంచి అమల్లోకి  న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన విలాస కార్ల విభాగం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతోంది. ఎంపిక చేసిన మోడళ్ల ధరలను 4 శాతం వరకూ పెంచుతున్నామని, పెరిగిన ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని జేఎల్‌ఆర్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఎమ్‌డీ రోహిత్‌ సూరి తెలిపారు. అయితే ఏ మోడళ్ల ధరలను పెంచేదీ

Most from this category