STOCKS

News


మార్కెట్లోకి థాంప్సన్‌ ఆండ్రాయిడ్‌ టీవీలు

Thursday 13th June 2019
news_main1560405917.png-26263

న్యూఢిల్లీ నుంచి సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధి: ఫ్రెంచ్‌ కన్స్యూమర్‌ దిగ్గజం థాంప్సన్‌... దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆండ్రాయిడ్‌ టీవీలను విడుదల చేసింది. మేక్‌ ఇన్‌ ఇండియాకు అనుగుణంగా ఈ టీవీలను భారత్‌లోనే ఉత్పత్తి చేశామని కంపెనీ ఇండియా పేటెంట్‌ హక్కుదారు ఎస్‌పీపీఎల్‌ సీఈఓ అవనీత్‌ సింగ్‌ మార్వా చెప్పారు. దీంతో అన్ని రకాల ఆండ్రాయిడ్‌ టీవీలను స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న తొలి బ్రాండ్‌గా నిలిచామన్నారు. 43, 49, 55, 65 అంగుళాల వేరియంట్లలో ఈ టీవీలున్నాయని, వీటి ధర రూ. 29999 నుంచి రూ. 59999 వరకు ఉంటుందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌పై వీటిని విక్రయిస్తామన్నారు. 
ప్రత్యేకతలు:- ఇన్‌బుల్ట్‌ క్రోమ్‌క్యాస్ట్‌, డాల్బీ సౌండ్‌, 2.5 ర్యామ్‌, 16 జీబీ మెమరీ, 5000కు పైగా వివిధ ప్రీఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌, నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌ప్లే కోసం హాట్‌కీస్‌, 4కే 10హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే తదితరాలు. 



You may be interested

బ్యాంకుల్లో భారీ మోసాలు

Thursday 13th June 2019

11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల మేర 53 వేలకు పైగా చీటింగ్‌ కేసులు అత్యధికం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులు మోసగాళ్లకు లక్ష్యంగా మారుతున్నాయి. గత 11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల మేర భారీ మోసాలు ఇక్కడి బ్యాంకుల్లో చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. సంఖ్యా పరంగా ఎక్కువ ఘటనలు అత్యధికం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల్లోనే జరిగినట్టు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారీగా మోసపోయినది మాత్రం పంజాబ్‌

హోండా నుంచి ప్రీమియం యాక్టివా125

Thursday 13th June 2019

న్యూఢిల్లీ, సాక్షి బిజినెస్‌ బ్యూరో:- వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన న్యూ ప్రీమియం యాక్టివా 125ను హోండా బుధవారం ఆవిష్కరించింది. ఈ ఏడాది రెండవ త్రైమాసికం నుంచి దీని అమ్మకాలను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ నుంచి ఉత్పత్తి చేస్తున్న తొలి బీఎస్‌-6 అనుగుణ ద్విచక్రవాహనం ఇదేనని తెలిపింది. దీని ధర బీఎస్‌4 యాక్టివా స్కూటర్‌ కన్నా 10- 15 శాతం ఎక్కువ ఉంటుందని

Most from this category