STOCKS

News


మార్కెట్లోకి స్కోడా ఆక్టావియా కార్పొరేట్ ఎడిషన్ కారు

Tuesday 19th March 2019
news_main1552977451.png-24682

- ధర రూ. 15.49 లక్షలు నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా తమ ప్రీమియం సెడాన్ కారు ఆక్టావియాలో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఆక్టావియా కార్పొరేట్ ఎడిషన్ పేరుతో విడుదల చేసిన ఈ కారు (పెట్రోల్‌ ఇంజిన్‌) ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంటుంది. ఇక డీజిల్‌ వేరియంట్ రేటు రూ. 16.99 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 16.7 కి.మీ. మైలేజినిస్తుంది. 8.1 సెకన్లలో గంటకు 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 219 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. మరోవైపు డీజిల్ వేరియంట్‌ లీటరుకు 21 కి.మీ. మైలేజినిస్తుంది. 8.4 సెకన్లలో గంటకు 0-100 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు. గరిష్టంగా గంటకు 218 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.



You may be interested

మారుతీ కార్ల ఉత్పత్తిలో కోత

Tuesday 19th March 2019

- ఫిబ్రవరిలో 8 శాతం పైగా కట్‌ న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఉత్పత్తిని తగ్గించింది. ఫిబ్రవరిలో వాహనాల తయారీలో 8 శాతం పైగా కోత విధించింది. స్టాక్‌ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం మారుతీ సుజుకీ గత నెల 1,48,959 యూనిట్లు తయారు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉత్పత్తి చేసిన 1,62,524 యూనిట్లతో పోలిస్తే ఇది 8.3 శాతం తక్కువ కావడం

రూపాయి... 6 రోజుల్లో 161 పైసలు రన్‌!

Tuesday 19th March 2019

- సోమవారం ఒక్కరోజే  57పైసలు లాభం - 68.53 వద్ద ముగింపు - ఏడు నెలల గరిష్టం న్యూఢిల్లీ: రూపాయి అప్రతిహత పురోగమనం కొనసాగుతోంది. సోమవారం వరుసగా ఆరవ ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాల బాటన పయనించింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో 57 పైసలు లాభపడింది. 68.53 వద్ద ముగిసింది.  ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి 161 పైసలు లాభపడింది.  2018 ఆగస్టు 1వ తేదీన రూపాయి ముగింపు 68.43. అప్పటి తర్వాత

Most from this category