STOCKS

News


జనవరి 28న శాంసంగ్‌ ‘గెలాక్సీ ఎం సిరీస్’ విడుదల

Tuesday 15th January 2019
news_main1547536443.png-23601

  • తొలి ఫోన్‌ భారత్‌లోనే విడుదల
  • షావోమికి పోటీగా స్మార్ట్‌ఫోన్‌
  • ధరల శ్రేణి రూ.20,000

న్యూఢిల్లీ: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ షావోమికి పోటీగా.. కొరియా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ అతి త్వరలోనే ‘గెలాక్సీ ఎం సిరీస్’ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండంకల వృద్ధి రేటును సాధించడంలో భాగంగా తొలుత ఈఫోన్‌ సిరీస్‌ను భారత్‌లోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ధరలు రూ.20,000 వరకు ఉండనున్నట్లు శాంసంగ్‌ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ వార్సీ మీడియాతో అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఈనెల తరువాత స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయాలని భావిస్తున్నాం. శాంసంగ్‌, అమేజాన్‌ వెబ్‌సైట్లలో వీటిని అందించనున్నాం. ఎం సిరీస్‌ విడుదల ద్వారా 2019లో రెండంకెల వృద్ధి రేటును లక్ష్యంగా నిర్థేశించుకున్నాం. కేవలం డివైజ్‌ల పరంగానే కాకుండగా.. ఫ్యాక్టరీ, ఎక్సిపీరియన్స్‌ సెంటర్ల  విస్తరణపై కూడా దృష్టి సారించాం. భారత మార్కెట్‌కు అవసరాలకు తగిన విధంగా సేవలందించడమే మా సంస్థ ధ్యేయం.’ అని వివరించారు.



You may be interested

నత్తనడకన ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు..

Tuesday 15th January 2019

గడిచిన ఆరు నెలల్లో 5 నెలల అమ్మకాలు తగ్గుదల న్యూఢిల్లీ: గతేడాది రెండవ అర్థభాగంలో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు నెమ్మదించాయి. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) సోమవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన ఆరు నెలల్లో 5 నెలల అమ్మకాలు తగ్గుదలను నమోదుచేశాయి. అక్టోబర్‌ మినహాయించి మిగిలిన ఐదు నెలల్లో అమ్మకాలు తగ్గాయి. తాజాగా డిసెంబర్‌ విక్రయాలు 2,38,692 యూనిట్లుగా వెల్లడి కాగా, అంతక్రితం ఏడాది ఇదే నెల్లో 2,39,723 యూనిట్లు

మహిళా వ్యాపారవేత్తలకు కేంద్రం తోడ్పాటు

Tuesday 15th January 2019

న్యూఢిల్లీ:  గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) పోర్టల్‌లో వివిధ ఉత్పత్తులను విక్రయించేలా మరింత మంది మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలను (ఎస్‌హెచ్‌జీ) ప్రోత్సహించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉమనియా పేరిట జీఈఎం పోర్టల్‌లో ప్రత్యేకంగా హోమ్‌పేజీ రూపొందించింది. [https://gem.gov.womaniya] ఈ పేజీలో మహిళా వ్యాపారవేత్తలు విక్రయించే ఉత్పత్తులు, సర్వీసుల గురించి వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వివరాలు లభిస్తాయని ప్రభుత్వం

Most from this category