News


4జీ స్పీడ్‌లో జియో టాప్‌

Thursday 15th November 2018
news_main1542257894.png-22017

న్యూఢిల్లీ: 4జీ సేవలకు సంబంధించి అక్టోబర్‌లో రిలయన్స్ జియో అగ్రస్థానం దక్కించుకుంది. సగటున 22.3 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌తో సర్వీసులు అందించింది. మరోవైపు, అప్‌లోడ్ స్పీడ్‌లో (5.9 ఎంబీపీఎస్‌) ఐడియా సెల్యులార్‌ అగ్రస్థానంలో నిల్చింది. జియో 4జీ డౌన్‌లోడ్‌ వేగం.. పోటీ సంస్థ భారతి ఎయిర్‌టెల్‌తో పోలిస్తే (9.5 మెగాబిట్స్ పర్‌ సెకను.. ఎంబీపీఎస్‌) రెట్టింపు స్థాయిలో ఉందని మైస్పీడ్‌ పోర్టల్‌లో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఉంచిన గణాంకాల ద్వారా వెల్లడైంది. ప్రైవేట్ సంస్థ ఓపెన్ సిగ్నల్‌ నవంబర్‌ తొలి వారంలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్‌ 1- ఆగస్టు 29 మధ్య కాలంలో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌ విషయంలో ఎయిర్‌టెల్‌ నంబర్ వన్ స్థానంలో నిల్చింది. అయితే, ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం జూన్‌, ఆగస్టులో కూడా జియోనే అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. You may be interested

నోట్ల రద్దు తర్వాత 5 లక్షల పీవోఎస్‌లు: ఆర్‌బీఎల్‌ బ్యాంకు

Thursday 15th November 2018

హైదరాబాద్‌: మాస్టర్‌ కార్డు వ్యూహాత్మక సహకారంతో డీమోనిటైజేషన్‌ తర్వాత... అంటే 2016 నవంబర్‌ నుంచి దేశవ్యాప్తంగా 5 లక్షల పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) మెషిన్లను ఏర్పాటు చేసినట్టు ఆర్‌బీఎల్‌ బ్యాంకు ప్రకటించింది. ఈ కాలంలో ఈ స్థాయిలో విస్తరణ చేసింది తామేనని పేర్కొంది. అందుబాటులో లేని ప్రాంతాల్లోకీ డిజిటల్‌ చెల్లింపులను తీసుకువెళ్లడమే ఇరు సంస్థల ధ్యేయంగా తెలిపింది.   

అపోలో హాస్పిటల్స్‌ నుంచి అపోలో ఫార్మసీ విభజన

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్‌ ఎంటర్‌ప్రైజెస్‌... తన ఫార్మసీ (ఔషధ విక్రయ శాలలు) రిటైల్‌ వ్యాపారాన్ని అపోలో ఫార్మసీస్‌ లిమిటెడ్‌ (ఏపీఎల్‌) పేరుతో వేరు చేయాలని నిర్ణయించింది. అపోలో మెడికల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు ఏపీఎల్‌ పూర్తి అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. అపోలో మెడికల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు 25.5 శాతం వాటా ఉంటుంది. అలాగే, జీలమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌-1కు 19.9 శాతం, హేమెంద్ర కొఠారికి 9.9 శాతం వాటా,

Most from this category