డిజిటల్ పేమెంట్స్‌పై ఫిర్యాదుల కోసం అంబుడ్స్‌మెన్
By Sakshi

దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోతున్నాయి. 2016 పెద్ద నోట్ల రద్దు తర్వాత ఊపందుకున్న డిజిటల్ లావాదేవీలు ఆ తర్వాత వేగంగా పెరుగుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. టెక్నాలజీ, డేటా, స్మార్ట్ ఫోన్ల విస్తరణతో ఫిజికల్ లావాదేవీల నుంచి ప్రజలు సౌకర్యం, సమయం ఆదా కోసం డిజిటల్ చెల్లింపులను ఆశ్రయిస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కానీ, ఏ రూపంలో లావాదేవీలు అయినా వాటికి సంబంధించి ఫిర్యాదులు ఉండడం సాధారణమే. అయితే, ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు ఆన్లైన్లో జరిగేవి కావడం, సాంకేతిక లోపాలు, తప్పిదాలతో భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో డిజిటల్ లావాదేవీలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా అంబుడ్స్‌మెన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ వివరాలను 2017-18 ఆర్థిక సంత్సరానికి సంబంధించి ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం... మొత్తం ఫిర్యాదుల్లో 28 శాతం ఎంపిక చేసిన కేంద్రాల్లో
బ్యాంకులు, నాన్ బ్యాంకులు జారీ చేసే ప్రీపెయిడ్ చెల్లింపుల సాధనాలు (పీపీఐలు), డిజిటల్ చెల్లింపులకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో 19 శాతం డిజిటల్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే ఉన్నాయి. అదే 2018 జూన్ నాటికి (ఆర్బీఐ అకౌంటింగ్ సంవత్సరం జూలైతో మొదలై, జూన్‌తో ముగుస్తుంది)... మొత్తం ఫిర్యాదుల్లో డిజిటల్ చెల్లింపులకు సంబంధించినవి 28 శాతానికి పెరిగిపోయాయి. ప్రీపెయిడ్ ఇనుస్ట్రుమెంట్లకు సంబంధించి రూ.1,41,600 కోట్ల విలువైన 350 కోట్ల లావాదేవీలు జరిగాయి. రిటైల్ పేమెంట్స్‌లో ఎలక్ట్రానిక్ లావాదేవీల వాటా 2016-17లో ఉన్న 88.9 శాతం నుంచి 2017-2018లో 92.6 శాతానికి చేరింది. పేపర్ ఆధారిత చెల్లింపులైన చెక్కులు తదితర సాధనాల వాటా 2017-18లో 7.4 శాతానికి పరిమితమైంది.
డిజిటల్ చెల్లింపులపై ఫిర్యాదులు పెరుగుతుండడంతో వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా అంబుడ్స్‌మెన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు 2017-18 నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. ఎంపిక చేసిన ఆర్బీఐ కార్యాలయాల్లో ఇవి ప్రారంభం అవుతాయి. డిజిటల్ పేమెంట్స్ విభాగంలో బ్యాంకింగేతర సంస్థల పాత్ర ఉండడంతో, వీటిపై ఫిర్యాదులకు ప్రత్యేకంగా అంబుడ్స్‌మెన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆర్బీఐ పేర్కొంది.
You may be interested
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్ జంప్..
Saturday 1st September 2018అమెరికా స్టాక్ మార్కెట్లోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్వైఎస్ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్ శుక్రవారం దాదాపు లాభాల్లోనే ట్రేడయ్యాయి. కేవలం ఒక్క వేదాంత ఏడీఆర్‌ను మినహాయిస్తే.. విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ స్టాక్స్ ఏడీఆర్‌లు పెరిగాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఏడీఆర్ గరిష్టంగా 4 శాతానికిపైగా ఎగసింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వేదాంత ఏడీఆర్ స్వల్పంగా 0.16 శాతం
‘డీఎస్పీ స్మాల్‌క్యాప్ ఫండ్’లో ‘సిప్’లకు అనుమతి
Saturday 1st September 2018డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)/ సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)లకు చందాలను సెప్టెంబర్ 3 నుంచి అనుమతిస్తున్నట్టు డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రకటించింది. ఇక సబ్స్క్రిప్షన్లు/స్విచ్ ఇన్ అప్లికేషన్లు, నూతన డివిడెండ్ ట్రాన్స్ఫర్ ప్లాన్‌కు రిజిస్ట్రేషన్లపై తాత్కాలిక సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. డీఎస్పీ మొదటి సారిగా 2014 అక్టోబర్‌లో స్మాల్ క్యాప్ పథకంలోకి పెట్టుబడుల రాకపై ఆంక్షలు విధించింది. ఒక్కో ఇన్వెస్టర్‌కు పెట్టుబడుల