STOCKS

News


యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌లో కోత..!

Wednesday 12th June 2019
news_main1560319367.png-26247

  • పరిశీలిస్తున్న మూడీస్‌;
  • రేటింగ్‌ తగ్గించే అవకాశం

ముంబై: బ్యాంకింగేతర సంస్థలకు అధిక స్థాయిలో రుణాలను మంజూరీ చేసిన నేపథ్యంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ తగ్గే అవకాశం ఉందని.. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ సంకేతాలిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు ‘బీఏ1’ రేటింగ్‌ ఉండగా.. ఇందులో సవరణ జరిగే అవకాశం ఉందనే దిశగా మూడీస్‌ వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంక్‌ మొత్తం కేటాయింపుల్లో ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగ సంస్థలకు 6.4 శాతం, రియల్టీ రంగానికి 7 శాతం రుణ మంజూరీ జరిగినట్లు వివరించింది. ప్రస్తుతం ఫైనాన్స్‌ కంపెనీల్లో కొనసాగుతున్న ద్రవ్య ఒత్తిళ్లు బ్యాంక్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపింది. ఈ రంగంలోని బలహీన కంపెనీలకు రుణాలు ఇవ్వడంతో పాటు రియల్టీ రంగం కూడా ఒత్తిళ్లలో ఉన్న కారణంగా యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను పరిశీలనలో ఉంచినట్లు పేర్కొంది. కొత్త సీఈఓ రవ్‌నీత్‌ గిల్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత తాజా త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.1,500 కోట్ల నష్టాలను ప్రకటించి.. పరిశీలించాల్సిన జాబితాలో రూ.10,000 కోట్లను చేర్చిన సంగతి తెలిసిందే కాగా, ఈ మొత్తం కూడా ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషించింది. 
ఆస్తుల నాణ్యతపై తీవ్ర ఒత్తిడి..
బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత, లాభదాయకత, మూలధన పరిస్థితిపై తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉందని మూడీస్‌ పేర్కొంది. ఒత్తిడి ఉన్నప్పటికీ.. మార్చి త్రైమాసికంలో జరిగిన చురుకైన ప్రొవిజనింగ్, సానుకూలంగా మారే ఆస్కారం కూడా లేకపోలేదని వివరించింది. అయితే ఇదే సమయంలో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు తాము అనుమతి పొందిన ఒక బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ విషయంలో విఫలమైతే ఒత్తిడి తీవ్ర స్థాయిలోనే ఉంటుందని విశ్లేషించింది. నిరర్థక ఆస్తుల పరంగా బ్యాంక్‌ చేసిన తప్పిదాలు నూతన యాజమాన్య చర్యలతో సమసిపోయే వీలుందని తెలిపింది.
రేటింగ్‌ పెరిగే అవకాశం లేదు...
వచ్చే 18 నెలల్లో బ్యాంక్‌ రేటింగ్‌ మెరుగుపడే అవకాశం లేదు. అయితే, కరెంట్‌ అసెట్‌ క్వాలిటీ నిర్వాహణ తగిన స్థాయి కేటాయింపులతో ఉండి.. ఈక్విటీ కాపిటల్‌ పెంపు జరిగితే ‘స్టేబుల్‌’ రేటింగ్‌కు మాత్రం ఆస్కారం ఉందని మూడీస్‌ అంచనావేసింది. నిరర్థక ఆస్తులు పెరగడం, కాపిటల్‌ రేషియో తగ్గిపోవడం, నష్టాలు పెరగడం వంటివి జరిగితే.. తమ పరిశీలనలోని రేటింగ్‌ తగ్గిపోతుందని వెల్లడించింది. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Wednesday 12th June 2019

మార్కెట్‌ పతనంలో నెలకొన్న అమ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుదవారం ట్రేడింగ్‌లో 1 శాతం క్షీణించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు  31,219.30ల వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఇండెక్స్‌ ఒక దశలో 1శాతం క్షీణించి 30,947.65ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30లకు ఇండెక్స్‌ గత ముగింపు(31,265.45)తో పోలిస్తే 276 పాయింట్లు ను

బ్లాక్‌స్టోన్‌ చేతికి ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

Wednesday 12th June 2019

97.7 శాతం వాటా కొనుగోలు  రూ.2,200 కోట్ల డీల్‌ మరో రూ.800 కోట్లు పెట్టుబడి  న్యూఢిల్లీ: తక్కువ ఆదాయ వర్గాల వారికి గృహరుణాలిచ్చే ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీని బ్లాక్‌స్టోన్‌ సంస్థ కొనుగోలు చేసింది. ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 97.7 శాతం వాటాను రూ.2,200 కోట్లకు కొనుగోలు చేశామని బ్లాక్‌స్టోన్‌ వెల్లడించింది. ఈ కంపెనీ భవిష్యత్తు వృద్ధి కోసం మరో రూ.800 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని పేర్కొంది. ఈ పెట్టుబడుల కారణంగా కంపెనీ నెట్‌వర్త్‌

Most from this category