STOCKS

News


మాస్టర్‌కార్డ్‌కు నిద్ర లేకుండా చేస్తున్న ‘రూపే కార్డ్‌’ 

Friday 2nd November 2018
news_main1541183395.png-21673

మీ దగ్గరో, లేక మీ కుంటుంబ సభ్యుల్లో ఒక్కరి దగ్గరయినా మాస్టర్‌కార్డ్‌ ఉండే ఉంటుంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ మన దేశంలో మొన్నటి వరకు బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల్లో సింహ భాగం వాటాతో ప్రతీ లావాదేవీపై కమీషన్‌ ఆర్జిస్తూ బాగానే ఆర్జించింది. కానీ, మోదీ సర్కారు తీసుకొచ్చిన స్వదేశీ ‘రూపే కార్డ్‌’ ఇప్పుడు మాస్టర్‌ కార్డుకు నిద్ర లేకుండా చేస్తోంది. రూపే కార్డ్‌ను వినియోగించడం ద్వారా స్వదేశీ నిధులను ఆదా చేయాలని ప్రధాని పిలుపునివ్వడం, ప్రోత్సహిస్తుండడంపై మాస్టర్‌ కార్డు అమెరికా ప్రభుత్వానికి ఈ ఏడాది జూన్‌ 21న ఫిర్యాదు కూడా చేసింది. 

 

100 కోట్ల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులున్న మన మార్కెట్‌లో ఎంతో ఆదాయ అవకాశాలున్న మాట నిజం. ఒకప్పుడు ఈ మార్కెట్‌ పూర్తిగా మాస్టర్‌కార్డు, వీసా కార్డులదే. కానీ, ఇప్పుడు మనం స్వయంగా రూపొందించుకున్న రూపే కార్డు సగం వాటాను చేరుకుంది. దీంతో అత్యంత వృద్ధికి అవకాశం ఉన్న భారత మార్కెట్లో విస్తరణకు మాస్టర్‌ కార్డు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ వాదంతో స్వదేశీ పేమెంట్‌ నెట్‌వర్క్‌ రూపేను ప్రమోట్‌ చేస్తున్నారంటూ అమెరికా ప్రభుత్వానికి చేసిన పిర్యాదులో మాస్టర్‌కార్డ్‌ పేర్కొంది. న్యూఢిల్లీ రక్షణాత్మక విధానాలు విదేశీ పేమెంట్‌ కంపెనీలకు అవరోధాలు కల్పిస్తున్నాయని తెలియజేసింది. 

 

రూపే కార్డును వినియోగించడం దేశానికి సేవ చేయడం వంటిదేనని, దాంతో విదేశీ కార్డు కంపెనీలకు చెల్లిస్తున్న లావాదేవీల ఫీజులను ఆదా చేసుకోవచ్చని, ఆ నిధులతో రోడ్లు, స్కూళ్లు, హాస్పిటళ్లు కట్టుకోవచ్చని మోదీ ఓ సందర్భంలో ప్రజలకు పిలుపునిచ్చిన మాట నిజమే. ఇదో రకం జాతీయ సేవ అంటూ మోదీ పేర్కొన్నారని అమెరికా ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ కార్యాలయానికి ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులో మాస్టర్‌కార్డు వివరించింది. అయితే, మోదీ సర్కారు డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహం మెచ్చుకోతగినదిగా మాస్టర్‌ కార్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సారా ఇంగ్లిష్‌ అందులో పేర్కొన్నారు. ‘‘రూపేకు ప్రచారం, ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అమెరికా పేమెంట్‌ టెక్నాలజీ కంపెనీలకు మార్కెట్‌ అవకాశాలకు సమస్యలు సృష్టిస్తాయి. రూపే కార్డుకు భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆపేయాలి’’ అంటూ మాస్టర్‌ కార్డు అమెరికా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా కంపెనీలు మోదీ పాలసీలను రక్షణాత్మకం అంటూ వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. డేటాను స్థానికంగానే నిల్వ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాల పట్ల కూడా తొలుత వ్యతిరేకత వ్యక్తం చేసినా, ఆ తర్వాత దారికొచ్చాయి. వీసా, మాస్టర్‌ కార్డు రెండూ అమెరికా కంపెనీలే. న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న మాస్టర్‌ కార్డు ప్రపంచంలో రెండో అతిపెద్ద చెల్లింపుల లావాదేవీల నిర్వహణ కంపెనీ. డెబిట్‌ కార్డు ఫీజుల్లో కేవలం 15-20 శాతమే తమకు వస్తాయని, మిగిలినవి భారత్‌లోనే ఉంటాయని మాస్టర్‌ కార్డు అంటోంది. 



You may be interested

74 కంపెనీల్లో పెరిగిన ప్రమోటర్ల వాటా

Saturday 3rd November 2018

మార్కెట్లు భారీగా పతనం కావడం, కొన్ని స్టాక్స్‌ అయితే, కకావికలం కావడం ఇన్వెస్టర్లు గడిచిన రెండు నెలల కాలంలో చూసి ఉంటారు. కానీ, ప్రమోటర్లు మాత్రం దీన్ని ఓ అవకాశంగా తీసుకుని సెప్టెంబర్‌ త్రైమాసికంలో తమ కంపెనీల్లో స్వల్పంగా వాటాలు పెంచుకున్నారు. బీఎస్‌ఈ 500 సూచీలోని కంపెనీల్లో 74 కంపెనీల్లో ప్రమోటర్ల వాటా పెరిగినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. 2018లో ఇప్పటి వరకు ఈ కంపెనీల షేర్ల ధరలు 80

మోతీలాల్‌ ఓస్వాల్‌ దీపావళీ ‘వెలుగు దివ్వెలు’

Friday 2nd November 2018

ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి లోపు ఇన్వెస్టర్లకు లాభాలు పూలు కురిపించే స్టాక్స్‌ వివరాలను ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రకటించింది. అవి.. మారుతి సుజుకీ, హిందాల్కో, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పీవీఆర్‌, ఒబెరాయ్‌ రియాలిటీ, ఇన్ఫోసిస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, అశోక్‌లేలాండ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కుమిన్స్‌ ఇండియా, వోల్టాస్‌, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌.    1. మారుతి సుజుకీ లక్ష్యం రూ.8,484, రాబడి 26

Most from this category