News


నెట్‌ యూజర్లు ఎట్‌ 63 కోట్లు!

Thursday 7th March 2019
news_main1551938219.png-24465

- గ్రామాల్లోనూ ఇంటర్నెట్‌ జోరు 
- ఫోన్‌ ద్వారానే ఎక్కువ మంది వాడకం
- వాడేవారిలో 42 శాతం మంది మహిళలే 
- కాంటర్‌ ఐఎమ్‌ఆర్‌బీఐ తాజా నివేదిక వెల్లడి

ముంబై: భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇంటర్నెట్‌ వాడకందారుల సంఖ్య రెండంకెల వృద్ధితో  63 కోట్లకు పెరగగలదని కాంటర్‌ ఐఎమ్‌ఆర్‌బీ సంస్థ అంచనా వేసింది. గ్రామాల్లో ఇంటర్నెట్‌ వృద్ధి జోరుగా ఉందని, దీంతో నెట్‌ వాడకందారుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఈ సంస్థ తన తాజా ఐక్యూబ్‌ 2018 నివేదికలో పేర్కొంది. ఇంటర్నెట్‌ కోసం దాదాపు 97 శాతం మంది మొబైల్‌ ఫోన్లనే వినియోగిస్తున్నారని, మొత్తం ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో మహిళల సంఖ్య 42 శాతంగా ఉందని పేర్కొన్న ఈ నివేదిక... ఇంకా ఏం చెప్పిందంటే...
- గతేడాది ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 18 శాతం వృద్ధి చెంది, తొలిసారిగా  50 కోట్లు దాటేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ వృద్ధి, వినియోగం జోరుగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. 
- ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారిలో దాదాపు 87 శాతం మంది రెగ్యులర్‌ వినియోగదారులే. వీరంతా కనీసం నెలకు ఒక్కసారైనా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. 
- మొత్తం ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 29 కోట్ల మంది పట్టణ ప్రాంతాల వారు కాగా, 25 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు. 
- ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య-పట్టణ ప్రాంతాల్లో 7 శాతం పెరగ్గా, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం వృద్ధి చెందడం విశేషం. 
- 2018లో  గ్రామీణ ప్రాంతాల్లో 25 కోట్ల మేర ఉన్న ఇంటర్నెట్‌ వినియోగ దారుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 29 కోట్లకు చేరవచ్చు. 
- బ్యాండ్‌విడ్త్‌ లభ్యత పెరగడం, డేటా ప్లాన్‌లు చౌకగా ఉండటం, అవగాహన పెరుగుతుండటం వంటి కారణాల వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్‌ లోటు క్రమేణా తగ్గుతూ వస్తోంది. 
- ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య బిహార్‌లో అత్యధికంగా, 35 శాతం  పెరిగింది. 
- ఇంటర్నెట్‌ వాడకం పెరుగుతుండటంతో మార్కెటింగ్‌కు ఇది మంచి అవకాశంగా మారుతోంది. You may be interested

ఏసీ మార్కెట్‌ వృద్ధి 10 శాతమే!

Thursday 7th March 2019

- వచ్చే రెండేళ్లూ ఇదే స్థాయిలో ఉండే అవకాశం - ఈ ఏడాది 60 లక్షల యూనిట్లు విక్రయించే అవకాశం - జీఎస్‌టీ తగ్గిస్తే మాత్రం మార్కెట్‌కు మరింత జోష్‌ - తయారీ కంపెనీల అంచనాలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: గడిచిన కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఏసీల డిమాండ్‌ను అంతకంతకూ పెంచుతుండగా... దేశంలో మాత్రం వీటిపై 28 శాతం జీఎస్‌టీ విధిస్తుండటం అమ్మకాల జోరుకు కొంత అడ్డుకట్ట వేస్తున్నట్లుగానే భావించాలి. ఎందుకంటే

‘డొనేట్‌కార్ట్‌’కు రూ.2.55 కోట్ల సీడ్‌ ఫండ్‌

Thursday 7th March 2019

- లెట్స్‌ వెంచర్‌, ఏంజెల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడి రాయదుర్గం: ఆన్‌లైన్‌ డొనేషన్‌ ప్లాట్‌ఫామ్‌గా టీ-హబ్‌లో ఊపిరి పోసుకున్న ‘డొనేట్‌కార్ట్‌’కు రూ.2.55 కోట్ల సీడ్‌ ఫండింగ్‌ లభించింది. లెట్స్‌ వెంచర్, ఇతర ఏంజెల్‌ ఇన్వెస్టర్ల ద్వారా ఈ సీడ్‌ ఫండింగ్‌ లభించినట్లు డొనేట్‌కార్ట్‌ వ్యవస్థాపకులు అనిల్‌ కుమార్‌రెడ్డి, సందీప్‌ శర్మ చెప్పారు. ఈ నిధులతో టెక్నాలజీని, టీమ్‌ను మరింత మెరుగుపర్చుకుంటామని వారు చెప్పారు. వీరిద్దరూ ఎన్‌ఐటి నాగ్‌పూర్‌లో చదువుకుని, 2016లో ఈ సంస్థను ఏర్పాటు

Most from this category