STOCKS

News


‘గజ’పరుగులు షురూ!

Wednesday 8th August 2018
news_main1533712341.png-19047

భారత ఎకానమీపై ఐఎంఎఫ్‌ పాజిటివ్‌ 
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటిగా భారత్‌ నిలుస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అభిప్రాయపడింది. దేశంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఫలాలనిస్తున్నాయని తెలిపింది. భారత్‌కు ప్రతీకగా చూపే ఏనుగును గుర్తు చేస్తూ ‘ఏనుగు పరుగు ఆరంభం అయింది’ అంటూ ఐఎంఎఫ్‌ ప్రతినిధి రనిల్‌ సల్గాడో వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇండియా 7.3 శాతం, వచ్చే ఏడాది 7.5 శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేశారు. ప్రపంచ వృద్ధిలో 15 శాతం వాటాకు భారత్‌ ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, అంతర్జాతీయ విత్త పరిస్థితులు కఠినంగా మారడం, పన్ను వసూళ్ల మందగమనం.. ఎకానమీ పరుగులకు రిస్కులని చెప్పారు. బలమైన ఆర్థిక వృద్ధిని ఆసరగా తీసుకొని రుణాలు తగ్గించుకొనేందుకు, పన్ను వ్యవస్థను సరళీకరించేందుకు, క్రమంగా వడ్డీరేట్లను పెంచుకునేందుకు యత్నించాలని సూచించారు. 2016 నోట్ల రద్దు అనంతరం ఎకానమీ మరలా గాడిన పడిందని చెప్పారు. ఆటో విక్రయాల నుంచి వృద్ధి డేటా వరకు గణాంకాలన్నీ పాజిటివ్‌ జోష్‌ చూపుతున్నాయని చెప్పారు. అయితే మరో పక్క క్రమంగా రిస్కులు కూడా పెరుగుతున్నాయని హెచ్చరించారు. రూపాయి బలహీనత, ద్రవ్యోల్బణ పెరుగుదల, అంతర్జాతీయ వాణిజ్యయుద్ధంలాంటివి వృద్ధిని దెబ్బతీయగలవని చెప్పారు. వీటిని తట్టుకొని వృద్ధిని కొనసాగించాలంటే నిర్మాణాత్మక సంస్కరణల కొనసాగించాలని సూచించారు. జీఎస్‌టీని మరింత సరళీకరించడం ద్వారా మరిన్ని లాభాలు పొందవచ్చని చెప్పారు. 


ఐఎంఎఫ్‌ నివేదికలో కీలకాంశాలు...
- పెట్టుబడులు పుంజుకోవడంతో రికవరీ కనిపిస్తోంది.
- భారత్‌, ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతోన్న ఎకానమీ
- బహిర్గత రిస్కులు పెరుగుతున్నాయి, కానీ తట్టుకోవచ్చు.
- సరళమైన ఎక్చేంజ్‌ రేట్‌ మెయిన్‌టెయిన్‌ చేయాలి.
- పోటీ తత్వాన్ని పెంచి ఎగుమతులను మరింత పెంచాలి.
- రుణభారం పెరగడం, విత్తలోటు.. కీలక స్థూల ఆర్థిక రిస్కులు
- మరిన్ని లేబర్‌, ల్యాండ్‌ సంస్కరణలతో ఉపాధి కల్పన మెరుగుపడుతుంది.
- పీఎస్‌బీలకు ప్రభుత్వం మరింత చేయూతనివ్వాలి.

 You may be interested

మల్టీప్లెక్స్‌ షేర్ల ర్యాలీ

Wednesday 8th August 2018

ముంబై:- మల్టీప్లెక్స్ థియేటర్‌లోకి బయటి ఆహారాన్ని తీసుకువచ్చేందుకు వీలు కల్పించే అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం తగ్గే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో బుధవారం మల్టీప్లెక్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సినిమా ప్రేక్షకులు బయటి నుంచి ఆహార పదార్ధాలు తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తూ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన  సంగతి తెలిసిందే. ఈ అంశంపై నేడు ముంబై హైకోర్టులో విచారణ జరగుతోంది. మహారాష్ట్ర తన అడఫిట్‌లో ‘‘బయటి ఆహార

ఈ వారంలో 11500 పక్కా!

Wednesday 8th August 2018

నిఫ్టీపై ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ అంచనా ఈ వారాంతానికి నిఫ్టీ 11500 పాయింట్లను చేరవచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. నిఫ్టీ ఫ్యూచర్స్‌లో షార్ట్‌ పొజిషన్లు చాలా ఉన్నాయని డెరివేటివ్స్‌ డేటా చెబుతోందని తెలిపింది. అందువల్ల మరోదఫా షార్ట్‌ కవరింగ్‌ను ఊహించవచ్చని పేర్కొంది. మరో షార్ట్‌ కవరింగ్ వస్తే నిఫ్టీ 11500- 11550 పాయింట్ల వరకు చేరవచ్చని తెలిపింది. ప్రస్తుతం నిఫ్టీకి 11200- 11300 పాయింట్ల వద్ద పలు మద్దతులున్నాయని

Most from this category