STOCKS

News


ప్రథమార్ధంలో 7 లక్షల సైబర్‌దాడులు..

Monday 12th November 2018
news_main1541999871.png-21887

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్‌)లో భారత్‌లోని యూజర్లపై ఏకంగా 6.95 లక్షల సైబర్‌ దాడులు జరిగినట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎఫ్‌-సెక్యూర్‌ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 4.36,090 దాడులు పెద్ద దేశాల నుంచే జరిగాయి. వీటిలో రష్యా (2,55,589) , అమెరికా (1,03,458), చైనా (42,544), నెదర్లాండ్‌ (19,169), జర్మనీ (15,330) ఉన్నాయి. మరోవైపు, భారతీయ హ్యాకర్లు కూడా సుమారు 73,482 సైబర్‌దాడులకు పాల్పడ్డారు. ఎక్కువగా ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌, జపాన్‌, ఉక్రెయిన్ దేశాలు టార్గెట్‌గా 35,563 దాడులు చేశారు. అత్యధికంగా సైబర్‌దాడులకు గురైన దేశాల జాబితాలో భారత్‌ 21వ స్థానంలో ఉండగా, దాడులకు కేంద్రంగా నిల్చిన దేశాల్లో 13వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 41 'హనీపాట్స్‌' ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించినట్లు ఎఫ్‌-సెక్యూర్‌ నివేదికలో పేర్కొంది. హ్యాకర్లను బోల్తా కొట్టించే నమూనా సర్వర్లను హనీపాట్స్‌గా వ్యవహరిస్తారు. వీటిని సిసలైన వ్యాపార సంస్థల సర్వర్లుగా భ్రమించి, హ్యాకర్లు సైబర్‌ దాడులు చేసినప్పుడు ఆయా ఎటాక్‌ల తీరుతెన్నుల గురించి అధ్యయనం చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. 



You may be interested

విదేశీ ఆటోమొబైల్‌ కంపెనీలకు గడ్డుకాలం

Monday 12th November 2018

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాల పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగం ఆటోమొబైల్‌ సంస్థలకు సంతోషాన్నివ్వలేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా భారత ఆటోమొబైల్‌ మార్కెట్లో బలమైన స్థానం కోసం పోటీ పడుతున్న విదేశీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మొత్తం 17 ఆటోమొబైల్‌ సంస్థల్లో సగానికి పైగా కంపెనీల ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు ఏప్రిల్‌-అక్టోబర్‌ కాలంలో తగ్గిపోవడం గమనార్హం. సియామ్‌ గనాంకాల ప్రకారం... అంతర్జాతీయ బ్రాండ్లు అయిన వోక్స్‌వ్యాగన్‌, రెనో, నిస్సాన్‌,

శత్రు షేర్ల విక్రయానికి త్వరలో విధివిధానాలు

Monday 12th November 2018

న్యూఢిల్లీ: శత్రు దేశాల పౌరులకు భారతీయ సంస్థల్లో ఉన్న షేర్ల విక్రయానికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు కేంద్ర డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం వెల్లడించింది. జప్తు చేసిన ఆస్తుల వేలంలో అనుభవం ఉన్న ప్రభుత్వ ఏజెన్సీలు, రెవెన్యూ విభాగం మొదలైన వాటితో సంప్రతించి వీటిని ఖరారు చేయనున్నట్లు వివరించింది. ఈ తరహా విక్రయ ప్రక్రియ చేపడుతుండటం ఇదే ప్రథమం కావడంతో మర్చంట్ బ్యాంకర్ ఒకరు సరిపోతారా లేదా మరింత మంది అవసరమవుతారా

Most from this category