News


విమానాల్లో మొబైల్‌ సేవలపై కమిటి

Saturday 5th January 2019
news_main1546686064.png-23434

న్యూఢిల్లీ: విమానాల్లోనూ, నౌకల్లోనూ మొబైల్ సేవలను (ఐఎఫ్‌ఎంసీ) మూడు నెలల వ్యవధిలోగా అందుబాటులోకి తెచ్చే అంశ౾ంపై అంతర్‌-మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. వీటి అమల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ఈ కమిటీ ప్రతి 15 రోజులకొకసారి సమావేశం అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. "ఎయిర్‌లైన్స్‌, షిప్పింగ్ కంపెనీలు, టెలికం ఆపరేటర్లు, ప్రభుత్వంలోని వివిధ శాఖల వర్గాలతో శుక్రవారం సమావేశం జరిగింది. ఐఎఫ్‌ఎంసీ సర్వీసులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చే దిశగా అంతర్‌-మంత్రిత్వ శాఖల గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సర్వీసులు సజావుగా అమలయ్యే క్రమంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ ప్రతి 15 రోజులకోసారి సమావేశం అవుతుంది" అని వివరించాయి. మూడు నెలల్లోగా సర్వీసులు అందుబాటులోకి తేవొచ్చని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు పేర్కొన్నాయి. పది ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఈ సేవలు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని స్పైస్‌జెట్ తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో శాటిలైట్ బ్యాండ్‌విడ్త్ చార్జీలు 7-8 రెట్లు అధికంగా ఉంటున్నాయని, దీంతో రెండు గంటల విమాన ప్రయాణంలో కాల్ చార్జీలు 30-50 రెట్లు అధికంగా ఉండే (సుమారు రూ. 700-1000 దాకా) అవకాశముందని బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీ సంస్థ హ్యూస్ ఇండియా పేర్కొంది.



You may be interested

నోకియా నుంచి మరో​ ఫోన్‌

Saturday 5th January 2019

న్యూఢిల్లీ: హెచ్‌ఎండీ గ్లోబల్‌ కంపెనీ నోకియా 106 మోడల్‌ ఫీచర్‌ ఫోన్‌ను భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి బ్యాటరీ లైఫ్‌, చూడ్డానికి సింపుల్‌గా, మన్నికగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 17.7 గంటల టాక్‌టైమ్‌, 21 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో ఈ ఫోన్‌ లభిస్తుంది. మైక్రో యూఎస్‌బీ చార్జర్‌ ద్వారా చార్జ్‌ చేసుకోవచ్చు. డార్క్‌ గ్రే రంగులో లభించే ఈ ఫోన్‌ ధర రూ.1,299.

మెడికల్‌ ఉత్పత్తుల అడ్డా ‘‘ఆర్కే’’

Saturday 5th January 2019

ఏటా రూ.6 కోట్ల వ్యాపారం ఈ ఏడాది లక్ష్యం రూ.20 కోట్లు స్టార్డప్‌ డైరీతో ఫౌండర్‌ రవికిరణ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్కానింగ్, ఈసీజీ వంటి వైద్య ఉత్పత్తులను సమీకరించుకోవటం కార్పొరేట్‌ ఆసుపత్రులకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, గ్రామాల్లోని ఆసుపత్రులకు కాస్త ఇబ్బందే. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది ఆర్కే ఎంటర్‌ప్రైజెస్‌. బహుళ జాతి కంపెనీలతో ఒప్పందం చేసుకొని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మెడికల్‌ ఉత్తత్తులను విక్రయించడమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు

Most from this category