STOCKS

News


గూగుల్ ప్లస్‌కు గుడ్‌బై!!

Wednesday 10th October 2018
news_main1539148367.png-21000

 వాషింగ్టన్‌: టెక్ దిగ్గజం గూగుల్‌కి చెందిన సోషల్ మీడియా సైట్ గూగుల్‌ ప్లస్ మూతపడనుంది. సాఫ్ట్‌వేర్‌ పరమైన సాంకేతిక లోపాలతో యూజర్ల డేటా ఇతరుల చేతికి చేరే అవకాశాలుండటమే ఇందుకు కారణం. ఒక బగ్ మూలంగా 5,00,000 మంది యూజర్ల ప్రైవేట్ డేటా బయటి డెవలపర్లకు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని గుర్తించిన గూగుల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‍అయితే, ఏ డెవలపర్‌కు కూడా ఈ బగ్ గురించి గానీ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ) దుర్వినియోగం గురించి గానీ తెలుసనడానికి తగిన ఆధారాలేమీ కనిపించలేదని గూగుల్ తెలిపింది. అలాగే ఎవరి ప్రొఫైల్ డేటా కూడా దుర్వినియోగం అయిన దాఖలాలు కూడా కనిపించలేదని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ఇంజినీరింగ్ విభాగం) బెన్ స్మిత్‌... ఒక బ్లాగ్‌లో పేర్కొన్నారు. బగ్‌ను సరిదిద్దేందుకు జరిగిన ప్రయత్నాల్లో భాగంగా అంతర్గతంగా నిర్వహించిన పరిశీలనలో ఈ అంశాలు వెల్లడైనట్లు ఆయన వివరించారు. అయితే, గూగుల్ ప్లస్‌ను తక్షణం మూసివేయబోమని, 10 నెలల వ్యవధి ఉంటుందని స్మిత్ తెలిపారు. వచ్చే ఆగస్టు ఆఖరు నాటికల్లా ప్రక్రియ పూర్తి కావొచ్చని పేర్కొన్నారు. ఈ లోగా తమ డేటాను ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, వేరే యాప్స్‌లోకి పంపించుకోవచ్చు తదితర అంశాల గురించి యూజర్లకు తగు అవగాహన ఇవ్వనున్నట్లు స్మిత్ తెలిపారు. You may be interested

2018లో 7.3...2019లో 7.4..!

Wednesday 10th October 2018

వాషింగ్టన్‌: భారత్‌ 2018లో 7.3 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును సాధిస్తుందని అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వెలువరించింది. 2019లో ఈ రేటు 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. అయితే తాజా అంచనాలు 2018 ఏప్రిల్‌లో ఇచ్చిన అంచనాలకన్నా కొంచెం తక్కువగా ఉండడం గమనార్హం.  మొత్తంగా ఈ ఏడాది ‘ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ హోదాను భారత్‌ 2018లో  కైవసం చేసుకుంటుందని వివరించింది.

భారత్‌లోనే పేమెంట్స్ డేటా స్టోరేజి: వాట్సాప్‌

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా చెల్లింపుల సంబంధిత డేటాను భారత్‌లోనే భద్రపర్చేలా (డేటా లోకలైజేషన్‌) తగు వ్యవస్థను రూపొందించుకున్నట్లు మొబైల్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా పది లక్షల మందితో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే దేశవ్యాప్తంగా అందరికీ దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాట్సాప్‌నకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 130 కోట్ల మంది యూజర్లు ఉండగా అందులో 20 కోట్ల

Most from this category