STOCKS

News


వాణిజ్య ఒప్పందం కోసం చైనా ఆతృత

Wednesday 12th June 2019
news_main1560323241.png-26249

  • సుంకాల పెంచడంతో చైనా తీవ్రంగా నష్టపోయింది
  • వాళ్ల కంపెనీలు అమెరికాకు వచ్చేం‍దుకు సిధ్దంగా ఉన్నాయి
  • జీ20 సమ్మిట్‌లో జిన్‌పింగ్‌తో కలిసే అవకాశం ఉంది: ట్రంప్‌

 చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకాల వలన చైనా బాగా నష్టపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ‘ వాళ్లకు తీవ్రంగా నష్టం జరిగింది. చైనా కంపెనీలు ఇప్పుడు అమెరికాకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. మేం సుంకాల విధించడం వలన బిలియన్ల డాలర్లను ‍ఆర్జించాం. ఇప్పుడు చైనా కంపెనీలు పెద్ద మొత్తంలో సుంకాలను చెల్లించడానికి సిద్ధంగా లేవు. అవి చైనాను వీడడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే చైనా ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది’ అని మంగళవారం మీడియాకు వివరించారు. ‘ఒక రిపోర్ట్‌ వెలువడింది. మన కంపెనీలకు రాయితీలను ప్రకటిస్తున్నారని, కానీ అది చాలా తక్కువ మొత్తంలోనే జరుగుతోంది. ఇలాంటి చర్యలు రెండు దేశాల మధ్య సత్ససంబంధలను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడతాయి. కానీ వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేసన్‌ ఏర్పడినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సత్ససంబంధాలు కొనసాగడం లేదు’ అని అన్నారు. జపాన్‌ ఒసాకాలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసే అవకాశం ఉందని తెలిపారు.

 
 



You may be interested

4నెలల కనిష్టానికి ఇండియాబుల్స్‌హౌసింగ్‌

Wednesday 12th June 2019

రెండు రోజుల్లో 15శాతం క్రాష్‌ 10కోట్ల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ హుష్‌కాకి..! దేశంలో రెండో అతిపెద్ద హౌసింగ్‌ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్ల పతనం బుధవారం 4నెలల కనిష్టానికి పతనమయ్యాయి. రూ.96 వేల కోట్ల ప్రజాధనాన్ని డైరెక్టర్లు, ఛైర్మన్‌ దారి మళ్లించారని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇన్వెస్టర్‌గా చెప్పుకుంటున్న అభయ్‌ యాదవ్‌ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ ధాఖలు చేశారు.  ఈ నిధుల దుర్వినియోగంపై లోతైన విచారణ జరిపించాలని పిటిషర్‌

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Wednesday 12th June 2019

మార్కెట్‌ పతనంలో నెలకొన్న అమ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుదవారం ట్రేడింగ్‌లో 1 శాతం క్షీణించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు  31,219.30ల వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఇండెక్స్‌ ఒక దశలో 1శాతం క్షీణించి 30,947.65ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30లకు ఇండెక్స్‌ గత ముగింపు(31,265.45)తో పోలిస్తే 276 పాయింట్లు ను

Most from this category