STOCKS

News


టయోటా కొత్త ‘‘కామ్రీ హైబ్రీడ్‌’’

Saturday 19th January 2019
news_main1547879427.png-23681

  • ధర రూ.36.95 లక్షలు

న్యూఢిల్లీ: టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తాజాగా ‘కామ్రీ హైబ్రీడ్‌’ కారు కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో శుక్రవారం విడుదలచేసింది. దీని ప్రారంభ ధర రూ.36.95 లక్షలుగా ఉంటుందని తెలిపింది. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉండే ఈ కారు లీటరుకు 23.27 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్స్‌, బ్రేక్ హోల్డ్ ఫీచర్ మొదలైనవి ఉన్నాయి. 2002లో కామ్రీ హైబ్రీడ్‌ను ప్రవేశపెట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా సుమారు 11,000 పైచిలుకు కార్లను టొయోటా విక్రయించింది. జీఎస్‌టీ కారణంగా డిమాండ్ తగ్గడంతో 2017లో ఉత్పత్తి తగ్గించింది. మరోవైపు, ఈ తరహా హైబ్రీడ్‌ కార్ల ఉత్పత్తితో ఆటో పరిశ్రమ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సంస్థ ఎండీ మజకాజు యోషిమురా చెప్పారు.

 



You may be interested

తగ్గిన పసిడి

Saturday 19th January 2019

గరిష్టస్థాయిల వద్ద స్వీకరణతో శుక్రవారం ప్రపంచమార్కెట్లో పసిడి ధర ఏకంగా 10డాలర్లు నష్టపోయింది. అమెరికా మార్కెట్లో రాత్రి ఔన్స్‌ పసిడి ధర 10డాలర్ల నష్టపోయి 1282.60డాలర్ల వద్ద స్థిరపడింది. చైనా-అమెరికా దేశాల మధ్య వాణిజ్య సత్సంబంధాలు మళ్లీ చిగురించవచ్చనే ఆశావహంతో ఆసియా, ఐరోపా, అమెరికా ఈక్విటీ మార్కెట్లు 1శాతానికి పైగా ర్యాలీచేశాయి. ప్రస్తుతం స్వల్పకాలానికి పసిడి ధరలో బేరిష్‌ క్యాండిల్‌ నెలకొన్నప్పటికీ.., అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌, ఐరోపాలో బ్రెగ్జిట్‌ అంశం,

కుట్ర జరుగుతోంది.. జోక్యం చేసుకోండి.

Saturday 19th January 2019

- సెబీని కోరిన సన్‌ఫార్మా - సన్‌ ఫార్మాకు వ్యతిరేకంగా రెండో ప్రజావేగు ఫిర్యాదు - 8 శాతం పతనమైన షేరు న్యూఢిల్లీ: కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు తమ కంపెనీకి, కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించే, విద్వేషపూరిత విధానాలకు పాల్పడుతున్నారంటూ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి ఫార్మా దిగ్గజం సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై జోక్యం చేసుకోవాలని సెబీని చైర్మన్‌ అజయ్‌ త్యాగిని కోరుతూ సన్‌ ఫార్మా ఒక లేఖ

Most from this category