STOCKS

News


మార్కెట్లోకి ‘వ్యాగన్‌ఆర్‌ ఎస్‌-సీఎన్‌జీ’

Thursday 7th March 2019
news_main1551936279.png-24462

- ప్రారంభ ధర రూ.4.84 లక్షలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజుకీ.. వ్యాగన్‌ఆర్‌ సీఎన్‌జీ వెర్షన్‌ కార్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘వ్యాగన్‌ఆర్‌ ఎస్‌-సీఎన్‌జీ’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈకార్లలో ఎల్‌ఎక్స్‌ఐ వేరియంట్‌ ధర రూ.4.84 లక్షలు కాగా, ఎల్‌ఎక్స్‌ఐ(ఓ) వేరియంట్‌ ధర రూ.4.89 లక్షలు. ఈ కార్లు ప్రతి కేజీ సీఎన్‌జీకి 33.54 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తాయని సంస్థ ఎండీ, సీఈఓ కెనిచి అయుకవా తెలిపారు. సీఎన్‌జీ ఇన్‌ఫ్రా కలిగిన ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్, ముంబై, పూణే, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈకార్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.



You may be interested

ప్రపంచ వృద్ధి అంచనాలకు కోత

Thursday 7th March 2019

3.3 శాతానికి తగ్గించిన ఓఈసీడీ వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్‌ అనిశ్చితుల వల్లే పారిస్‌: వాణిజ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బ్రెగ్జిట్‌ తదితర అంశాలు ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక సహకార - అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో 2019 సంవత్సరానికి ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను గత నవంబర్‌లో పేర్కొన్న 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించింది. అంతకుముందు అంచనాలు 3.7 శాతంతో పోలిస్తే మరింత

అమెరికా మార్కెట్‌... ఇకపైనా సవాలే!

Thursday 7th March 2019

- ఔషధ కంపెనీలపై కొనసాగనున్న ఒత్తిడి - జనరిక్స్‌ ధరల ఒత్తిడి మాత్రం కాస్త తగ్గుముఖం - పూర్తిగా సమసిపోలేదంటున్న విశ్లేషకులు - సన్‌ఫార్మా, బయోకాన్‌, అరబిందోపై సానుకూలం న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో భారత ఫార్మా కంపెనీలకు ధరల ఒత్తిడి కొంత తగ్గినప్పటికీ... సమస్యలు ఇంకా పూర్తిగా సమసిపోలేదని, వృద్ధి అవకాశాలు ఇకముందు కూడా సవాలేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అబ్రివేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్ల (ఏఎన్‌డీఏ) ఆమోదం గత కొన్ని నెలలుగా మెరుగుపడింది. ప్రస్తుత

Most from this category