STOCKS

News


చందమామ ‘స్విస్‌ బ్యాంక్‌’ కథలు!!

Tuesday 12th March 2019
Markets_main1552380937.png-24554

- మనీలాండరింగ్‌ కేసులో మ్యాగజీన్‌ కొత్త ఓనర్లు
- జియోడెసిక్‌ సంస్థ డైరక్టర్లపై విచారణ ముమ్మరం...
- నిధులను స్విస్‌ ఖాతాల్లోకి తరలించారని ఆరోపణ

న్యూఢిల్లీ: నీతి కథలతో ఒకప్పుడు పిల్లలను ఉర్రూతలూగించిన ‘చందమామ’ మ్యాగజీన్‌ గతంలోనే చేతులు మారిన సంగతి తెలిసిందే. దీన్ని తీసుకున్న కొత్త యాజమాన్యం ఇపుడు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. కంపెనీ నిధులు మనీలాండరింగ్‌ ద్వారా అక్రమంగా స్విస్‌ బ్యాంకుల్లోకి తరలించినట్లు సంస్థ డైరెక్టర్లపై కేసు నడుస్తోంది. చందమామ మ్యాగజీన్‌ను ముంబైకి చెందిన జియోడెసిక్‌ లిమిటెడ్‌ 2007లో కొనుగోలు చేసింది. అయితే, కంపెనీలో ఆర్థిక అవకతవకలకు తోడు నిధులను ముగ్గురు డైరెక్టర్లు స్విస్‌ ఖాతాల్లోకి మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు నిగ్గుతేల్చాయి. దీనిపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసులో స్విట్జర్లాండ్‌ అధికారులు కూడా తగిన సహకారం అందించేందుకు(ఖాతాల వివరాలు ఇవ్వడం ఇతరత్రా) అంగీకరించినట్లు సమాచారం. జియోడెసిక్‌ ముగ్గురు డైరెక్టర్లు... ప్రశాంత్‌ శరద్‌ ములేకర్‌, పంకజ్‌కుమార్‌ ఓంకార్‌ శ్రీవాస్తవ, కిరణ్‌ కులకర్ణిలపై దర్యాప్తుకు సంబంధించి భారతీయ దర్యాప్తు సంస్థలు అడిగిన వివరాలు ఇచ్చేందుకు స్విస్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ) ఈ నెల 5న సమ్మతి తెలిపిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ముంబై పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం వర్గాలు వెల్లడించాయి. అయితే, అక్కడి చట్టాల ప్రకారం 30 రోజుల్లోగా ఎఫ్‌టీఏ నిర్ణయాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ తగిన ఆధారాలతో సవాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాగా, లిస్టెడ్‌ కంపెనీ అయిన జియోడెసిక్‌ నిబంధనల అతిక్రమణపై ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝులిపించింది. దీంతో పాతాళానికి పడిపోయిన (రూ.1.5 స్థాయికి) జియోడెసిక్‌ షేర్ల ట్రేడింగ్‌ను కూడా ఎక్సే‍్ఛంజీలు 2014 ఆగస్టులో నిలిపేశాయి.You may be interested

‘వడ్డిం’పులు తగ్గించరేం..?

Tuesday 12th March 2019

- ఆర్‌బీఐ వరమిచ్చినా కరుణించని బ్యాంకులు - తగ్గిస్తున్నది తక్కువ... అందులోనూ జాప్యం - రుణాల కన్నా తక్కువగా డిపాజిట్ల వృద్ధి - పోస్టాఫీస్‌ పథకాలతో పోటీపడాల్సి రావటమే కారణం ముంబై: వృద్ధికి ఊతమిచ్చే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక పాలసీ రేట్లను తగ్గించినప్పటికీ .. బ్యాంకులు ఆ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో రుణ గ్రహీతలకు బదలాయించడం లేదు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది తొలినాళ్ల నుంచి రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ

నల్లధనంపై నోట్ల రద్దు ఫలితమివ్వదు

Tuesday 12th March 2019

నల్లధనంపై నోట్ల రద్దు ఫలితమివ్వదు స్వల్పకాలంలో ఆర్థిక వృద్ధికి విఘాతం కలుగుతుంది ఆర్‌బీఐ బోర్డు అభిప్రాయాలు ఆర్‌టీఐ దరఖాస్తుతో వెలుగులోకి నాటి వివరాలు న్యూఢిల్లీ: నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌)తో నల్లధనం నియంత్రణపై పెద్దగా సాధించేదేమీ ఉండదని ఆర్‌బీఐ బోర్డు అభిప్రాయపడింది. పైగా స్వల్ప కాలంలో ఆర్థిక వృద్ధికి దీనివల్ల విఘాతం కలుగుతుందని హెచ్చరించింది. 2016 నవంబర్‌ 8న రాత్రి ప్రధాని మోదీ నోట్ల రద్దుకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించడానికి సరిగ్గా రెండున్నర గంటల ముందు ఆర్‌బీఐ

Most from this category