STOCKS

News


భారత్‌లో ‘టిఫనీ’ బ్రాండ్‌..!

Friday 9th August 2019
Markets_main1565327641.png-27657

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో భాగస్వామ్యం

న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికన్ జ్యుయలరీ సంస్థ టిఫనీ అండ్‌ కో భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. ముఖేష్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భాగస్వామ్యంతో ఈ ఏడాదిలోనే తొలుత దేశ రాజధాని ఢిల్లీలో స్టోర్‌ను ఏర్పాటుచేయనుంది. వచ్చే ఏడాదిలో ముంబైలో రెండవ స్టోర్‌ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ అంశానికి సంబంధించి రిలయన్స్ బ్రాండ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దర్శన్ మెహతా మాట్లాడుతూ.. ‘టిఫనీ ప్రఖ్యాత ఆభరణాలు, అత్యుత్తమ వజ్రాభరణాలను భారత మార్కెట్లో పరిచయం చేయాలని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో 320 స్టోర్లను టిఫనీ నిర్వహిస్తోంది. మొత్తం 14 ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది.



You may be interested

ఫ్లిప్‌కార్ట్‌తో జట్టుకట్టిన లైఫ్‌స్టైల్‌

Friday 9th August 2019

న్యూఢిల్లీ: ఫ్యాషన్ రిటైలర్ సంస్థ లైఫ్‌స్టైల్‌.. ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఆన్‌లైన్ చానల్‌ ద్వారా తమ అమ్మకాలు గణనీయంగా పెరగడం కోసం తాజా ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలకు, కొత్త కస్టమర్లకు సంస్థ దుస్తులు చేరేలా చూడడం ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యమని లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ వసంత్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

లాభాల్లో రియల్టీ షేర్లు

Friday 9th August 2019

 ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు, దేశియ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతుండడంతో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఉదయం 10.31 సమయానికి 1.16 శాతం లాభపడి 266.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండియాబుల్స్‌ రియలెస్టేట్‌ 6.20 శాతం లాభపడగా, ప్రెస్టెజ్‌ ఇండస్ట్రీస్‌ 3.11 శాతం, సన్‌టెక్‌ 2.88 శాతం, మహీంద్రా లైఫ్‌ లిమిటడ్‌ 2.45 శాతం, డీఎల్‌ఎఫ్‌ 1.40 శాతం, ఒబేరాయ్‌ రియల్టీ 0.81

Most from this category