STOCKS

News


ప్రపంచ బ్యాంక్‌ కొత్త ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మాల్పాస్‌!

Friday 8th February 2019
news_main1549605769.png-24084

వాషింగ్టన్‌: ప్రపంచబ్యాంక్‌ కొత్త అధ్యక్షునిగా ప్రముఖ ఆర్థికవేత్త డేవిడ్‌ మాల్పాస్‌ పేరును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించారు. 189 సభ్యదేశాలు సభ్యులుగా ఉన్న  ప్రపంచబ్యాంక్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల ఆమోదంతో ఆయన ఈ బాధ్యతలను చేపట్టగలుగుతారు. ఇది దాదాపు లాంఛనప్రాయమే అయినా, పలు దేశాలు తమ అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించడానికి మార్చి 14 వరకూ బోర్డ్‌ సమయం ఇచ్చింది. ట్రంప్‌ ప్రభుత్వంలో ప్రస్తుతం మాల్పాస్‌ ఆర్థిక శాఖకు సంబంధించి అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీ విరమణ కాలానికి మూడేళ్ల ముందే పపంచబ్యాంక్‌ ప్రెసిడెంట్‌గా జిమ్‌ యాంగ్‌ కిమ్‌ జనవరిలో తన రాజీనామాను ప్రకటించడంతో ఆ స్థానానికి మాల్పాస్‌ పేరును ట్రంప్‌ ప్రతిపాదించారు. ట్రంప్‌కు మాల్పాస్‌ అత్యంత విశ్వసనీయుడు. చైనాకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేయడంతోపాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విధివిధానాల మారాల్సిన అవసరం ఉందని ఆయన తరచూ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.



You may be interested

శామ్‌శాంగ్‌ టాప్‌-3లో బిగ్‌ సీ

Friday 8th February 2019

భారత్‌లో ఈ బ్రాండ్‌ ఫోన్ల విక్రయాల్లో జోరు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: శామ్‌సంగ్‌ మొబైల్స్‌ విక్రయాల్లో భారత్‌లో టాప్‌-3 స్థానాన్ని మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌ సి’ దక్కించుకుంది. ఈ సందర్భంగా శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ సౌత్‌ వెస్ట్‌ ఆసియా ప్రెసిడెంట్‌ హెచ్‌.సి.హాంగ్‌ హైదరాబాద్‌లోని బిగ్‌ సి కార్యాలయానికి గురువారం విచ్చేశారు. బిగ్‌ సి ఫౌండర్‌ ఎం.బాలు చౌదరిని ప్రత్యేకంగా అభినందించారు. శామ్‌సంగ్‌ ప్రవేశ పెట్టిన ప్రతి మోడల్‌ అమ్మకాల్లో

బ్రోకరేజ్‌లు టార్గెట్‌ ధరలు పెంచిన టాప్‌టెన్‌ స్టాక్స్‌

Friday 8th February 2019

క్యు3 ఫలితాల అనంతరం బ్రోకరేజ్‌లు కొన్ని స్టాకులపై బాగా పాజిటివ్‌గా మారాయి. కొన్నింటి టార్గెట్‌ ధరలను పెంచాయి. అలాంటి టాప్‌టెన్‌ స్టాక్స్‌ వివరాలు... 1. ఐజీఎల్‌: డాయిష్‌ బ్యాంకు టార్గెట్‌ను రూ. 315 నుంచి 330కి పెంచింది. వచ్చే రెండేళ్ల ఎర్నింగ్స్‌ అంచనాలను 3 శాతం పెంచింది. ఈపీఎస్‌ వచ్చే రెండేళ్ల పాటు 18 శాతం చక్రీయ వార్షిక వృద్ది సాధిస్తుందని అంచనా వేసింది. కొత్త ప్రాంతాలకు విస్తరించడం ద్వారా రెవెన్యూ

Most from this category