STOCKS

News


జర్మనీని దాటేశాం!

Thursday 14th March 2019
news_main1552553985.png-24607

మార్కెట్‌ క్యాప్‌లో దూసుకుపోయిన భారత్‌
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్‌ క్యాప్‌ ర్యాంకుల్లో భారత్‌ దూసుకుపోతోంది. తాజాగా మార్కెట్‌క్యాపిటలైజేషన్‌ లెక్కల్లో జర్మనీ మార్కెట్‌ను భారత్‌ మార్కెట్‌ దాటేసింది. ఎన్నికల్లో స్థిర ప్రభుత్వం వస్తుందన్న అంచనాలతో కొన్ని రోజులుగా దేశీయ సూచీలు ర్యాలీ జరుపుతున్నాయి. ఈ క్రమంలో దేశ ఈక్విటీ మార్కెట్‌ క్యాప్‌ 2.12 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇదే సమయంలో ఫ్రాంక్‌ఫర్ట్‌(జర్మనీ) సూచీ డాక్స్‌ మార్కెట్‌ క్యాప్‌ 2.08 లక్షల కోట్ల డాలర్లుంది. దీంతో గత ఏడేళ్లలో రెండో మారు భారత మార్కెట్లు జర్మనీ మార్కెట్‌ను అధిగమించాయి. గతేడాది జనవరిలో ఇండియా మార్కెట్‌ క్యాప్‌2.45 లక్షల కోట్ల డాలర్ల ఆల్‌టైమ్‌ హైని చేరింది. ఈ ఏడాది కాలంలో భారత సూచీలు సుమారు 4 శాతం ముందంజ వేయగా(డాలర్‌ లెక్కల్లో), జర్మనీ సూచీ సుమారు 14 శాతం పతనమైంది. భారత్‌ మార్కెట్‌ క్యాప్‌ టు జీడీపీ నిష్పత్తి 81 శాతం ఉండగా, జర్మనీ నిష్పత్తి 51 శాతముంది. దీంతో యూరోజోన్‌ నుంచి బ్రిటన్‌ నిష్క్రమణ అనంతరం ప్రస్తుతం ఫ్రాన్స్‌ మాత్రమే టాప్‌7 గ్లోబల్‌మార్కెట్స్‌లో నిలవనుంది. ఇక ఎప్పటిలాగే ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న ఎకానమీల్లో ఒకటిగా భారత్‌ నిలిచింది. మరోపక్క జర్మనీకి మరింత గడ్డుకాలం ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే దాని జీడీపీ మూడో త్రైమాసికంలో మరికొంత కుంచించుకుపోయింది. 



You may be interested

యస్‌ బ్యాంక్‌ షేర్లకు డాయిష్‌ బూస్ట్‌

Thursday 14th March 2019

యస్‌ బ్యాంక్‌ షేరు టార్గెట్‌ ధరను అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ అయిన డాయిష్‌బ్యాంక్‌  పెంచడంతో గురువారం ట్రేడింగ్‌లో 4శాతం ర్యాలీ చేసింది. నేడు యస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో రూ.247.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డాయిష్‌ బ్యాంక్ యస్‌ బ్యాంక్‌ షేర్లపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘‘బ్యాంకు ఆదాయాలు ఆశించిన స్థాయిలోనే ఉంటాయి.  రుణ నాణ్యత మరింత పెరిగే అవకాశం ఉంది. కార్పోరేట్‌ రుణ వృద్ధి 12-15శాతం తగ్గవచ్చు. రిటైల్‌/ఎస్‌ఎంఈ రుణ

అడాగ్‌ షేర్ల పతనం

Thursday 14th March 2019

అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన అడాగ్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టాయి. ఎరిక్సన్ బకాయిల చెల్లింపుల వ్యవహారంలో నిధుల సమీకరణకు నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) తన అభిప్రాయాన్ని రిజర్వ్‌లో పెట్టడటం ఇందుకు కారణమైంది. ఎరిక్సన్‌కు రూ. 550 కోట్ల బకాయిలను నాలుగు వారాల్లో చెల్లించాలని గత నెల సుప్రీం కోర్టు ఆర్‌కామ్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణాల చెల్లింపునకు తమ

Most from this category