STOCKS

News


భరోసా ఇస్తోందా? భయపెడుతోందా?

Monday 25th March 2019
news_main1553503801.png-24787

ఫెడ్‌ వ్యాఖ్యలపై అయోమయం
యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచనని గత డిసెంబర్‌లో నిర్ణయం తీసుకున్నప్పటినుంచి ఈక్విటీలు ర్యాలీ జరుపుతున్నాయి. కానీ గతవారం ఫెడ్‌ వ్యాఖ్యలు మార్కెట్లలో భయాలు రేకెత్తించాయి. రేట్ల పెంపుదలపై ఫెడ్‌ తీసుకున్న యూటర్న్‌ మార్కెట్లలో ఆయోమయం రేకెత్తిస్తోంది. రేట్లు పెంచరని ఆనందించాలా? మాద్యం తప్పదన్న సంకేతాలకు భయపడాలా? మదుపరులు తేల్చుకోలేకపోతున్నారు. ఈ ఏడాది రేట్ల పెంపు ఉండదని, బాండ్‌ కొనుగోలు కార్యక్రమానికి కత్తెరింపులు ఉండవని ఫెడ్‌ తాజాగా ప్రకటించింది. నిజానికి ఈ నిర్ణయానికి మార్కెట్లు ర్యాలీ జరపాలి. కానీ ఫెడ్‌వ్యాఖ్యలు ఎకానమీలో మాంద్య భయాలను పెంచేవిగా ఉన్నాయని భావించిన సూచీలు పతనం బాట పట్టాయి. ఎకానమీలో ఏదో కీడు కనిపించబట్టే ఫెడ్‌ ఈ నిర్ణయానికి వచ్చిందని ఎక్కువమంది ప్రస్తుతం అంచనాలు వేస్తున్నారు. వీరి భయాలకు తగ్గట్లు యూరోజోన్‌ పీఎంఐ గణాంకాలు చాలా బలహీనంగా ఉన్నాయి. మార్చిలో యూరోజోన్‌ పీఎంఐ సూచీ 71 నెలల కనిష్ఠానికి, యూఎస్‌ పీఎంఐ సూచీ 21 నెలల కనిష్ఠాలకు దిగజారాయి. దీంతో ఉత్పత్తి మందగిస్తోందని స్పష్టమవుతోంది. జపాన్‌లో కూడా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్పత్తి రంగంలోని ఈ బలహీనత క్రమంగా సేవల రంగంలోకి వస్తుందని ఎక్కువమంది భయపడుతున్నారు. బాండు మార్కెట్లు ఇప్పటికే మాద్యం వస్తుందన్న సంకేతాలనిచ్చేలా ప్రవరిస్తున్నాయి.

యూఎస్‌ 10ఏళ్ల బాండ్‌ ఈల్డ్స్'‌ 2.44 శాతానికి పతనమైంది. జపాన్‌, యూరప్‌ బాండ్‌ ఈల్డ్స్‌ సైతం క్షీణించాయి. అదేవిధంగా బాండ్‌​ఈల్డ్స్‌' కర్వ్‌లో ఇన్వర్షన్‌ ఏర్పడింది. ఇలాంటి పాటర్న్‌ ఏర్పడినప్పుడు అనంతర ఏడాదిలో ఆర్ధిక మాంద్యం వస్తుందని గత అనుభవాలు ఎత్తి చూపుతున్నాయి.

అయితే ఉత్పత్తిరంగంలో మందగమనానికి కారణం ట్రేడ్‌వార్‌ మాత్రమేనని, ఈ వాణిజ్యయుద్ధం ముగిసిపోతే మరలా పీఎంఐ సూచీ పుంజుకుంటుందని కొందరి అంచనా.
వర్ధమాన మార్కెట్ల ప్రభావం..
ఇటీవలే ఫిచ్‌రేటింగ్స్‌ భారత జీడీపీ అంచనాలను 6.8 శాతానికి తగ్గించింది. మరోపక్క దేశీయ ఈక్విటీల వాల్యూషన్లు ఇంకా చౌకగా మారలేదు. అయితే లిక్విడిటీ కోణంనుంచి చూస్తే మందగమనం ప్లస్‌ వడ్డీరేట్ల తగ్గింపు వాతావరణం కలిసి వ్యవస్థలో లిక్విడిటీ పెంచుతాయి. దీంతో మార్కెట్ల పరుగులు కొనసాగుతుంటాయి. ఫెడ్‌ నిర్ణయంతో ఆసియా దేశాలు కూడా రేట్ల తగ్గింపు దిశగా మరలవచ్చని డీబీఎస్‌ అంచనా వేసింది. ఎకానమీలో బలహీనత డాలర్‌ను కూడా బలహీనపరుస్తుందని, దీని వల్ల వర్దమాన దేశాలకు పెద్దగా ప్రయోజనం ఉండదని కోటక్‌ రిసెర్చ్‌ అభిప్రాయపడింది. యూఎస్‌, చైనా వాణిజ్యయుద్ధంపై సందిగ్ధత, బ్రెగ్జిట్‌, ఒపెక్‌ నిర్ణయాలు, మందగమన భయాలు.. వర్దమాన మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లు కొత్త గరిష్ఠాలకు చేరలేకపోవచ్చని అంచనా వేసింది. You may be interested

బ్రోకరేజ్‌ల నుంచి షార్ట్‌టర్మ్‌ సిఫార్సులు

Monday 25th March 2019

వచ్చే రెండు మూడువారాల్లో మంచి రాబడినందించే పది షేర్లను వివిధ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి.  ఏంజిల్‌ బ్రోకింగ్‌ 1. హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 192. స్టాప్‌లాస్‌ రూ. 167. దిగువన రూ.145 నుంచి ఒక్కపాటున అప్‌మూవ్‌ చూపి రూ. 184 వరకు ఎగిసింది. అనంతరం కన్సాలిడేషన్‌ చెంది రూ. 170 స్థాయికి చేరింది. చార్టుల్లో జపనీస్‌ క్యాండిల్‌స్టిక్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. వాల్యూం కదలికలు అప్‌మూవ్‌కు అనుకూంలగా ఉన్నాయి. 2. ఇన్ఫోసిస్‌:

ఫండ్స్‌ లాభాలతో కారు లోన్‌ తీర్చేయవచ్చా ? (ధీరేంద్ర కాలమ్‌)

Monday 25th March 2019

ప్ర: నేను గత మూడేళ్లుగా నెలకు రూ.15,000 చొప్పున రిలయన్స్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. మొదట్లో ఈ ఫండ్‌ మంచి రాబడులనే ఇచ్చేది.ఇప్పుడు మాత్రం నష్టాలు వస్తున్నాయి. నేను ఇప్పటిదాకా రూ.4.60,000 ఇన్వెస్ట్‌ చేయగా, ప్రస్తుతం రూ.30,000 నష్టం వచ్చింది. నేను ఈ ఫండ్‌ నుంచి వైదొలగి వేరే కొత్త ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. కొన్ని మంచి ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఫండ్స్‌ను సూచించండి.  -హారిక, బెంగళూరు  జ:

Most from this category