STOCKS

News


ఇవేం నిబంధనలు!!

Wednesday 10th April 2019
news_main1554879822.png-25047

- భారత డేటా లోకలైజేషన్, ఈకామర్స్‌ విధానాలపై
అమెరికా విమర్శలు
- వివక్షాపూరిత ప్రతిపాదనలని ఆక్షేపణ
- పునఃసమీక్షించాలని సూచన

న్యూఢిల్లీ: భారత్‌ ప్రతిపాదిత డేటా లోకలైజేషన్‌ నిబంధనలు, ఈ–కామర్స్‌ విధాన ముసాయిదాలోని ప్రతిపాదనలను అమెరికా ఆక్షేపించింది. ఇవి అత్యంత వివక్షాపూరితంగాను, వాణిజ్యాన్ని దెబ్బతీసేవిగాను ఉన్నాయని వ్యాఖ్యానించింది. 2019లో విదేశీ వాణిజ్యానికి ప్రతిబంధకాలు అంశంపై అమెరికా వాణిజ్య విభాగం (యూఎస్‌టీఆర్‌) రూపొందించిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. "భారత్‌ ఇటీవలే డేటాను స్థానికంగా భద్రపర్చాలని (లోకలైజేషన్‌) నిబంధనలను ప్రతిపాదించింది. ఇలాంటి వాటివల్ల డేటా ఆధారిత సేవలు అందించే సంస్థలు అనవసరంగా, వృధాగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా మెరుగైన సేవల ప్రయోజనాలను స్థానిక సంస్థలు పొందనీయకుండా చేస్తుంది. సీమాంతర డేటా వినియోగంపై ఆంక్షలు విధించడం వివక్ష చూపడమే అవుతుంది. ఇవి అమెరికా, భారత్‌ మధ్య డిజిటల్‌ వాణిజ్యానికి తీవ్ర ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉంది. ఈ–కామర్స్‌ విధానం ముసాయిదాలో ఇలాంటి విచక్షణాపూరిత, వాణిజ్యాన్ని దెబ్బతీసే నిబంధనలను భారత్‌ పునఃసమీక్షించాలని అమెరికా భావిస్తోంది" అని నివేదిక పేర్కొంది. 
    చెల్లింపుల సమాచారం అంతా భారత్‌లోనే స్థానికంగా భద్రపర్చాలన్న నిబంధన వల్ల పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ వ్యయాలు పెరిగిపోతాయని, అంతర్జాతీయంగా సేకరించిన డేటాను ఒకే దగ్గర భద్రపర్చుకుని, వినియోగించుకునే  విదేశీ సంస్థలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదిక తెలిపింది. దేశీయంగా డేటా, ఇన్‌ఫ్రా అభివృద్ధి, ఈ–కామర్స్‌ మార్కెట్‌ప్లేస్, నియంత్రణపరమైన సవాళ్ల పరిష్కారం, దేశీ డిజిటల్‌ ఎకానమీకి ఊతమివ్వడం తదితర అంశాల ప్రాతిపదికగా ప్రభుత్వం ప్రత్యేక ఈ–కామర్స్‌ విధానం ముసాయిదా రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపైనే అమెరికా తాజాగా స్పందించింది. 

భారత్‌లో భారీ టారిఫ్‌లు...
ఇక భారత వాణిజ్య విధానాలపై కూడా నివేదికలో అమెరికా విమర్శలు గుప్పించింది. పలు అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అత్యంత భారీగా సుంకాలు విధిస్తోందని పేర్కొంది. పూలపై 60 శాతం, రబ్బర్‌పై 70 శాతం, ఆటోమొబైల్స్‌పై 60 శాతం, మోటార్‌సైకిల్స్‌పై 50 శాతం, కాఫీ మొదలైనవాటిపై 100 శాతం, ఆల్కహాలిక్‌ బెవరేజెస్‌పై 150 శాతం దిగుమతి సుంకాలు విధిస్తోందని పేర్కొంది. అంతేగాకుండా వాణిజ్యానికి అవరోధాలు కల్పించేలా కొన్ని వైద్యపరికరాల ధరలను నియంత్రించడం, ఇథనాల్‌ దిగుమతులపై ఆంక్షలు విధించడం వంటివి కూడా చేస్తోందని ఆరోపించింది.  You may be interested

వచ్చే అయిదేళ్లలో ఎంఎస్‌ఎంఈలో కోటి ఉద్యోగాలు

Wednesday 10th April 2019

నోమురా రిసర్చ్‌ నివేదిక వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- వచ్చే నాలుగైదేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) కంపెనీలు ఒక కోటికిపైగా ఉద్యోగాలను సృష్టించనున్నాయని నోమురా రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన నివేదికలో వెల్లడించింది. మధ్య తరగతి వర్గాలు పెరగడం, ఖర్చు చేయదగ్గ ఆదాయాల్లో వృద్ధి వెరశి భారత్‌ను వినియోగానికి ఆకర్శణీయ మార్కెట్‌గా నిలబెట్టనున్నాయి. అయితే వినియోగం అవుతున్న ఉత్పత్తుల్లో దిగుమతుల వాటా గణనీయంగా ఉండడంతో దేశీయంగా తయారీ రంగంలో ఉద్యోగ అవకాశాల

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంటర్‌ప్రైజ్‌ విభాగ ఆదాయం రూ.6,500 కోట్లు

Wednesday 10th April 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ ‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ రికార్డు స్థాయిలో ఎంటర్‌ప్రైజ్‌ విభాగం నుంచి ఆదాయాన్ని పొందినట్లు ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం నుంచి రూ.6,500 కోట్లను పొందినట్లు మంగళవారం ప్రకటించింది. గతంలో ఎన్నడూలేని విధంగా 91 ఎంటర్‌ప్రైజ్‌ల నుంచి ఈ మొత్తాన్ని పొందగా.. ఏడాది సగటున 50 నుంచి 60 ఎంటర్‌ప్రైజ్‌ల వరకూ ఉన్నట్లు తెలిపింది. ఈ అంశంపై సంస్థ సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం

Most from this category