STOCKS

News


ఎన్నారై దిగ్గజాలకు ట్రంప్ విందు

Thursday 9th August 2018
news_main1533793122.png-19089

న్యూయార్క్‌:  పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి, మాస్టర్‌ కార్డ్ సీఈఓ అజయ్ బంగా వంటి ప్రవాస భారత కార్పొరేట్‌ అధిపతులతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందునిచ్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. న్యూజెర్సీలోని ప్రైవేట్ గోల్ఫ్‌ క్లబ్‌లో ఇచ్చిన ఈ విందుకు భర్త రాజ్‌ నూయితో కలిసి ఇంద్రా నూయి, భార్య రీతు బంగాతో కలిసి అజయ్‌ బంగా హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న 15 మంది దిగ్గజాల్లో ఫియట్ క్రిస్లర్ సీఈవో మైఖేల్ మాన్లీ, ఫెడ్‌ఎక్స్‌ ప్రెసిడెంట్ ఫ్రెడరిక్ స్మిత్ తదితరులున్నారు. "నా ప్రభుత్వ విధానాలతో అత్యధికంగా లబ్ధి పొందిన సంస్థల్లో మీవి కూడా ఉన్నాయి. అలాగే పలు కేసుల్లో మీ సహకారం ఎంతగానో ఉపయోగపడింది. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దేందుకు మీ సహాయ, సహకారాలు కావాలి. కొత్త వాణిజ్య ఒప్పందాలతో రాబోయే రోజుల్లో అమెరికా వృద్ధి రేటు అయిదు శాతం స్థాయికి చేరే అవకాశాలున్నాయి" అని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 'అత్యంత శక్తిమంతమైన' మహిళల్లో ఒకరిగా ఇంద్రా నూయిని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. 
నూయికి ఇవాంకా ప్రశంసలు ..
త్వరలో పెప్సీకో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోనున్న ఇంద్రా నూయిపై డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ సైతం ప్రశంసలు కురిపించారు. పలు సామాజిక విషయాల్లో ఇంద్రా నూయి తనతో పాటు ఎందరికో స్ఫూర్తి దాత అని కితాబిచ్చారు. "ఇంద్రా నూయి.. మీరు నాతో పాటు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శకురాలు" అని మైక్రో బ్లాగింగ్ సైటు ట్విటర్‌లో ఇవాంకా ట్వీట్ చేశారు. సుమారు 24 ఏళ్లుగా పెప్సీకోలో పలు హోదాల్లో పనిచేసిన ఇంద్రా నూయి అక్టోబర్ 3న బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.You may be interested

ఎన్‌పీఏ బ్యాంకుల భారీ ర్యాలీ..!

Thursday 9th August 2018

6నెలల గరిష్టానికి ఐసీఐసీఐ బ్యాంకు ముంబై:- కార్పొరేట్‌ రుణాల కారణంగా నిరర్థక ఆస్తులు కలిగిన బ్యాంకు షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీ ర్యాలీ చేశాయి. ఎన్‌పీఏ సమస్యలతో  ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ, ప్రైవేటు రంగ ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు నేటి ట్రేడింగ్‌లో 7శాతం నుంచి 3శాతం వరకూ లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ - 50 ఇండెక్స్‌లోని టాప్‌ - 5 షేర్లలో వరుసగా ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు

నెల రోజుల కోసం బొనాంజా సిఫార్సులు

Thursday 9th August 2018

వచ్చే 30 రోజుల్లో 11 శాతం వరకు రాబడినిచ్చే 3 స్టాకులను బొనాంజా పోర్టుఫోలియో రికమండ్‌ చేస్తోంది. 1. అజంతా ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1295. స్టాప్‌లాస్‌ రూ. 1127. డైలీ చార్టుల్లో ఇంతవరకు పయనిస్తూ వచ్చిన రేంజ్‌బౌండ్‌ పాటర్న్‌కు పైన క్లోజయింది. ధర పెరగడంతో పాటు వాల్యూంలు కూడా బాగా పెరిగి కౌంటర్లో ఉత్సాహాన్ని నింపాయి. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచి అప్‌మూవ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. 2. చోళమండలమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌:

Most from this category