News


చర్చలు సరే.. టారిఫ్‌లు వేయండి!!

Saturday 15th September 2018
news_main1537006159.png-20291

ఎవ్వరీ మాట వినను.. నా దారి నాదే.. అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఛైనాతో వాణిజ్య చర్చలకు అమెరికా సిద్ధమవుతున్నప్పటికీ,  ఈయన తాజాగా 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై కొత్తగా సుంకాలను విధించమని సహాయకులను ఆదేశించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ టారిఫ్‌లు ఇదివరకు 50 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగేమతులపై విధించిన టారిఫ్‌లకు అదనం. ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ.. బీజింగ్‌తో తిరిగి చర్చలు ప్రారంభించడానికి సిద్ధమౌతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ చైనాపై టారిఫ్‌లను విధించమని ఆదేశించడం గమనార్హం. 
తాజా టారిఫ్‌లు ఫైనాన్షియల్‌ మార్కెట్లలో గందరగోళం సృష్టిస్తున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్‌ లాభాలు హరించుకుపోయాయి. నష్టాల్లోకి జారిపోయాయి. చైనా ఆఫ్‌షోర్‌ యువాన్‌తో పోలిస్తే డాలర్‌ రెండు వారాల్లో కెల్లా అత్యధికంగా బలపడింది. టెక్నాలజీ స్టాక్స్‌ క్షీణించాయి. యాపిల్‌ షేరు దాదాపు 1.7 శాతంమేర పడిపోయింది. కాగా కొత్త టారిఫ్‌ల వల్ల ప్రొడక్టుల ధరలు పెరుగుతాయని యాపిల్‌ గత వారంలోనే ప్రకటించింది. 
చైనా టారిఫ్‌ అంశంపై ట్రంప్‌ గురువారం తన టాప్‌ ట్రేడ్‌ అడ్వైజర్లతో భేటీ అయ్యారు. ఇందులో ట్రెజరీ సెక్రటరీ, కామర్స్‌ సెక్రటరీ, అమెరికా ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ వంటి వారు పాల్గొన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సమావేశంలో పాల్గొన్న వారు కొత్త టారిఫ్‌ల విధింపు వల్ల నెగటివ్‌ ప్రభావం ఏమైనా ఉంటుందని భావిస్తున్నారా? అని ట్రంప్‌ని అడిగారని, దానికి ట్రంప్‌ ప్రభావమేమీ ఉండదని సమాధానమిచ్చారని పేర్కొన్నారు. 
మరోవైపు చైనా కూడా అమెరికా టారిఫ్‌లు విధిస్తే తాము కూడా అదే విధంగా స్పందిస్తామని హెచ్చరించింది. కొత్త టారిఫ్‌లకు ప్రతిగా తాము కూడా టారిఫ్‌లు విధిస్తామని పేర్కొంది. ఇక గురువారం సమావేశానికి ముందు ట్రంప్‌.. బీజింగ్‌తో వాణిజ్య యుద్ధంలో ప్రస్తుతం తమదే పైచేయి అని ట్వీట్‌ చేశారు. సమస్య పరిష్కారంపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. కాగా గతవారం ట్రంప్‌ 50 బిలియన్‌ డాలర్లు, 200 బిలియన్‌ డాలర్లు టారిఫ్‌లకు అదనంగా 267 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై మళ్లీ అదనపు టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. ఇదే జరిగితే చైనా నుంచి అమెరికాలోకి వచ్చే ప్రతి ప్రొడక్టుపై టారిఫ్‌లు అమలవుతాయి. అయితే గురువారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
తాజా 200 బిలయన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై టారిఫ్‌ల విధింపు వల్ల యాపిల్‌ వాచ్‌లు, ఎయిర్‌పాడ్‌ హెడ్‌ఫోన్స్‌ వంటి పలు ప్రొడక్టులపై ప్రభావం పడుతుందని యాపిల్‌ ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేసింది. ఇక వాల్‌మార్ట్‌, టార్గెట్‌ కార్ప్‌ సంస్థలపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది. వాణిజ్య ఉద్రిక్తతల పరిష్కారానికి ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధులు పలు మార్లు సమావేశమయ్యారు. అయితే వాటి వల్ల ఎలాంటి ఫలితం లేదు. మళ్లీ మరోమారు భేటీ కానున్నారు. వాణిజ్య మిగులు తగ్గించుకోవాలని, తమ కంపెనీల ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ అధికారాలను పరిరక్షించాలని అమెరికా.. బీజింగ్‌పై ఒత్తిడి తీసుకువస్తోంది. 

  You may be interested

షార్ట్‌కవరింగ్‌తో కాస్త రిలీఫ్‌!?

Saturday 15th September 2018

ఈ వారంపై నిపుణుల అంచనా వచ్చే వారం సూచీలు పాజిటివ్‌ జోన్‌లోనే కదలాడే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎకానమీపై అత్యున్నత స్థాయి సమావేశం జరిగే వేళ నిఫ్టీ 11250 పాయింట్ల వద్ద నుంచి బౌన్స్‌ చూపింది. తాజా ర్యాలీ షార్ట్‌కవరింగ్‌ కారణంగా ఏర్పడిందని చెప్పవచ్చు. తాజా అప్‌మూవ్‌లో ఇంకా బలం మిగిలిఉందని, సోమవారం తర్వాత ఈ అప్‌మూవ్‌ కదలికలు ఎక్కడవరకు ఉండవచ్చో అంచనా వేయగలమని నిపుణులు చెప్పారు. మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా

400బిలియన్‌ డాలర్ల దిగువకు ఫారెక్స్‌ నిల్వలు..!

Saturday 15th September 2018

ముంబై:- రూపాయి పతనం దెబ్బకు ఫారెక్స్ నిల్వలు కరిగిపోతున్నాయి. క్షీణిస్తున్న రూపాయిని ఆదుకోవడానికి రిజర్వు బ్యాంకు మారక ద్రవ్య మార్కెట్‌ (ఫారెక్స్‌)లో డాలర్లను విక్రయిస్తోంది. ఫలితంగా ఈ ఏడాదిలో తొలిసారిగా ఫారెక్స్‌ నిల్వలు తొలిసారిగా 400 బిలియన్‌ డాలర్ల దిగువకు చేరుకున్నాయి. విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు సెప్టెంబరు 7తో ముగిసిన వారానికి 819.5 మిలియన్‌ డాలర్లు తగ్గి 399.28 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఫారెక్స్ మార్కెట్‌లో

Most from this category