STOCKS

News


తీరు మార్చుకోకుంటే తప్పుకుంటాం!

Friday 31st August 2018
news_main1535712557.png-19842

డబ్ల్యుటీఓపై ట్రంప్‌ నిప్పులు
అదే జరిగితే పెను దుమారమే
హెచ్చరిస్తున్న నిపుణులు
చైనాతో పాటు కొన్ని దేశాలపై టారిఫ్‌ల విషయంగా నిప్పులు చెరుగుతున్న ట్రంప్‌ ఈ సారి డబ్ల్యుటీఓని టార్గెట్‌ చేసుకున్నారు. అమెరికాను సరిగా ట్రీట్‌ చేయకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకోమని ప్రపంచవాణిజ్యసమాఖ్య(డబ్ల్యుటీఓ)కు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తీరు మార్చుకోకుంటే సమాఖ్య నుంచి వైదొలుగుతామని హెచ్చరించారు. అసలు డబ్ల్యుటీఓ ఏర్పాటే అత్యంత అధ్వాన్న విషయమన్నారు. డబ్ల్యుటీఓ కారణంగా కొన్ని దశాబ్దాలుగా అమెరికాకు ఎంతో నష్టం జరిగిందన్నారు. ఇకమీదటైనా సమాఖ్య తన విధానాలు మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. 2001లో డబ్ల్యుటీఓలోకి చైనాను అనుమతించడం అతిపెద్ద తప్పని యూఎస్‌ ట్రేడ్‌ ప్రతినిధి రాబర్ట్‌ లైట్జర్‌ గతంలోనే విమర్శించారు. చైనాలాంటి నాన్‌మార్కెట్‌ ఎకానమీని డబ్ల్యుటీఓ సరిగా డీల్‌ చేయలేకపోయిందని దుయ్యబట్టారు. డంపిగ్‌ కేసుల్లో సమాఖ్య అనుసరిస్తున్న విధానం తమ దేశ సార్వభౌమత్వానికే సవాలన్నారు. తాజాగా ట్రంప్‌ సైతం ఇదే పాట ఎత్తుకున్నారు. 
అల్లకల్లోలమే..
డబ్ల్యుటీఓ నుంచి వైదలగాలని ట్రంప్‌ నిర్ణయిస్తే ఎకానమీల్లో అల్లకల్లోలం తప్పదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చైనాతో యూఎస్‌ జరుపుతున్న పరిమిత వాణిజ్య వైరంతో పోలిస్తే ఎన్నోరెట్ల దుష్ఫలితాలుంటాయన్నారు. అయితే ట్రంప్‌ మాత్రం క్రమంగా వైదొలగేందుకే నిర్ణయిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో సమాఖ్య అప్పీల్‌ వ్యవస్థకు అమెరికా జడ్జీలను నామినేట్‌ చేయడం లేదు. గతేడాది మినహా యూఎస్‌ ఒక్క కేసు కూడా డబ్ల్యుటీఓలో గెలవలేదని, గతేడాది మాత్రం పలు సూట్లు గెలిచామని ట్రంప్‌ చెప్పారు. ఇందుకు కారణం తానేనని, తమకు న్యాయం జరగకపోతే వైదొలగుతామని సమాఖ్యకు అర్ధమైందని చెప్పారు. అయితే ట్రంప్‌ మాటలు అబద్ధాలని, డబ్ల్యుటీఓ ఆరంభం అయ్యాక యూఎస్‌ఏ పలు కేసులు గెలిచిందని ఎకనమిస్టులు గణాంకాలతో ఎత్తి చూపుతున్నారు. ఇటీవల కాలంలో చైనా దూకుడు తట్టుకోలేక యూఎస్‌తో పాటు ఈయు, జపాన్‌ సైతం సమాఖ్యలో మార్పులను కోరుతున్నాయి. అయితే సమాఖ్యలో మార్పులు తీసుకురావడం సులభమేమీ కాదని, కానీ యూఎస్‌ఏ వైదొలుగుతామని బెదిరిస్తే మాత్రం మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ వాణిజ్యం మెరుగుపరిచేందుకు యూఎస్‌ చర్యలు ఆరంభించింది. 1994లో డబ్ల్యుటీఓ ఆరంభమైంది. 



You may be interested

ఎన్‌ఎస్‌ఈలో వాటాల విక్రయానికి పీఎన్‌బీ సన్నాహాలు

Saturday 1st September 2018

ప్రభుత్వరంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)... దేశంలోనే టర్నోవర్‌ పరంగా అతిపెద్ద స్టాక్‌ ఎక్సేంజ్‌ ‘ఎన్‌ఎస్‌ఈ’లో తనకున్న స్వల్ప వాటాల విక్రయానికి సన్నాహాలు ఆరంభించింది. ఎన్‌ఎస్‌ఈలో పీఎన్‌బీకి 0.11 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.48 కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తోంది. పీఎన్‌బీ సబ్సిడరీ అయిన పీఎన్‌బీ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (పీఎన్‌బీఐఎస్‌ఎల్‌)... ఈ వాటాల విక్రయానికి సంబంధించి ఆసక్తి కలిగిన ఇన్వెస్టర్ల నుంచి బిడ్లను

మిశ్రమంగా ముగిసిన మార్కెట్‌

Friday 31st August 2018

రూపాయి పతనంతో రాణించిన ఫార్మా, ఐటీ షేర్లు మార్కెట్‌ ఈ వారంతపు రోజైన శుక్రవారం మిశ్రమంగా ముగిసింది. రూపాయి జీవితకాల కనిష్టానికి చేరుకోవడం, జూన్‌ త్రైమాసిక జీడీపీ గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్యయుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడం తదితర కారణాలు సూచీల మిశ్రమ ముగింపునకు కారణమయ్యాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లు నష్టపోగా, రూపాయి పతనంతో

Most from this category