STOCKS

News


చైనాపై అమెరికా మరో దఫా టారిఫ్‌ల వడ్డింపు!

Thursday 9th August 2018
news_main1533792872.png-19084

వాషింగ్టన్‌:  చైనా, అమెరికాల మధ్య టారిఫ్‌ల యుద్ధం మరింతగా ముదురుతోంది. తాజాగా మరో 16 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై ఏకంగా 25 శాతం మేర సుంకాలు విధించే ప్రతిపాదనను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా వెల్లడించింది. ఈ రెండో విడత టారిఫ్‌లు ఆగస్టు 23 నుంచి అమల్లోకి రానున్నాయి. తొలి విడతగా జూలై 6న 34 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించింది. అప్పుడే మరో 16 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపైనా విధించాలని భావించినప్పటికీ.. అమెరికన్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టింది. దీన్నే ఇప్పుడు అమల్లోకి తేనుంది. చైనా సహా ఇతర దేశాల అనుచిత వాణిజ్య విధానాలు తమకు నష్టం కలిగిస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఈ దిగుమతి సుంకాల పెంపు యుద్ధానికి తెరతీసిన సంగతి తెలిసిందే. 



You may be interested

లుపిన్‌ లాభం 43 శాతం డౌన్‌

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ లుపిన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.203 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో సాధించిన నికర లాభం, రూ.358 కోట్లతో పోలిస్తే 43 శాతం క్షీణత నమోదైందని లుపిన్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.2,807 కోట్ల నుంచి రూ.3,775 కోట్లకు తగ్గిందని లుపిన్‌ ఎండీ, నీలేశ్‌ గుప్తా తెలియజేశారు. అమెరికా, జపాన్‌ మార్కెట్లలో కంపెనీ పనితీరు అంతంతమాత్రంగానే ఉండటంతో

వచ్చే రెండేళ్లలో 25 కోట్లకు 'యోనో' యూజర్లు..!

Thursday 9th August 2018

ముంబై: డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఒకే యాప్‌ ద్వారా నిర్వహించుకునేలా 'యోనో' (యూ ఓన్లీ నీడ్‌ వన్‌) పేమెంట్‌ యూప్‌ను అందుబాటులో ఉంచిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)... ఈ యాప్‌ వినియోగాన్ని వేగంగా విస్తృత పరుస్తోంది. నగదు బదిలీ, డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం, డిజిటల్‌గానే బ్యాంక్‌ ఖాతా ప్రారంభం వంటివి ఇపుడు యోనో ప్రత్యేకతలుగా ఉన్నాయి. ప్రస్తుతం 25 లక్షల మంది యూజర్లు ఉన్న ఈ యాప్‌ వినియోగదారుల

Most from this category