STOCKS

News


చైనాపై సుంకాలవైపే ట్రంప్ మొగ్గు!!

Monday 17th September 2018
news_main1537159336.png-20310

వాషింగ్టన్‌: చైనాతో ప్రతిపాదిత చర్చల ఫలితాలు ఎలా ఉన్నా ఆ దేశం నుంచి మరిన్ని దిగుమతులపై సుంకాలు విధించాలన్న నిర్ణయాన్ని అమలు చేసేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నారు.  దాదాపు 200 బిలియన్ డాలర్ల దిగుమతులపై కొత్తగా టారిఫ్‌లను అమలు చేసే విషయంలో ట్రంప్ ముందుకే వెళ్లనున్నట్లు ది వాల్‌ స్ట్రీట్ జర్నల్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ టారీఫ్‌ల అమలు సోమవారం నుంచే ప్రారంభంకావొచ్చని ఈ కథనంలో పేర్కొన్నారు. సుంకాలు గతంలో విధించిన 25 శాతం కన్నా తక్కువ స్థాయిలో సుమారు 10 శాతం మేర ఉండొచ్చని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాన్ని ప్రచురించింది. టారిఫ్‌ల వివాదంపై చర్చించుకునేందుకు అమెరికాను ఆహ్వానించినట్లు చైనా వెల్లడించిన నేపథ్యంలో ఈ కథనం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 50 బిలియన్ డాలర్ల దిగుమతులపై ఇరు దేశాలు 25 శాతం మేర టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఒకవేళ అమెరికా గానీ మరో దఫా తమ దిగుమతులపై సుంకాలు విధించిన పక్షంలో.. ప్రతిగా తాము 60 బిలియన్ డాలర్ల పైగా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు ప్రకటించడం ఖాయమని చైనా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాను కూడా ఇప్పటికే రూపొందించింది. 



You may be interested

రూపాయిపై పరిమిత ప్రభావమే

Monday 17th September 2018

ముంబై: రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యల సానుకూల ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక నివేదికలో పేర్కొంది. రూపాయిని స్థిరీకరించే ఉద్దేశంతో స్వల్పకాలిక విదేశీ రుణాలు సమీకరించుకోవడానికి కంపెనీలకు ప్రతిపాదించిన వెసులుబాటును .. వాస్తవానికి ఇన్వెస్టర్లు దీర్ఘకాలికంగా ప్రతికూలాంశంగానే పరిగణించే అవకాశం ఉందని తెలిపింది. ఇది కంపెనీల రిస్క్‌ ప్రొఫైల్‌ను మరింతగా దిగజార్చవచ్చని పేర్కొంది. రూపాయి, ఆర్థిక అంశాలపై సమీక్ష నిర్వహించిన కేంద్రం ..

ఈనెలలో 2 ఐపీఓలు

Monday 17th September 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈనెల 17న (సోమవారం) ప్రారంభమై 19న ముగియనుంది. రైల్వే ఇంజినీరింగ్‌, మౌలిక సదుపాయాల కల్పనలో నిమగ్నమైన ఈ సంస్థ రూ.10 ముఖవిలువ కలిగిన 99.05 లక్షల ఈక్విటీ షేర్లు (ప్రభుత్వానికి చెందిన 10 శాతం వాటా) జారీ చేయనుంది. రూ.470-475 శ్రేణిలో ప్రైస్‌బ్యాండ్‌ ప్రకటించింది. హయ్యర్‌ ప్రైస్‌బ్యాండ్‌ వద్ద రూ.470 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా కంపెనీ

Most from this category