STOCKS

News


ట్రేడ్‌వార్‌.. ఆర్ధిక సంక్షోభానికి సంకేతం!

Wednesday 11th July 2018
news_main1531303200.png-18206

మార్క్‌మొబియస్‌ 
ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి యూఎస్‌ఏ- చైనా మధ్య వాణిజ్యయుద్ధం తొలిసూచనగా ప్రముఖ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ అభివర్ణించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ట్రేడ్‌వార్‌ భయాలతో వర్ధమాన దేశాల మార్కెట్లు దాదాపు 10 శాతం క్షీణించడం తెలిసిందే. అయితే ఇంతటితో ఈ ఏడాది బ్యాడ్‌ న్యూస్‌ ముగిసిపోలేదంటున్నారు మార్క్‌. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం అలముకుంటుందనేందుకు ఇవి సంకేతాలని హెచ్చరించారు. అతి త్వరలో మరో మందగమనం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్లలో తక్కువ వడ్డీ రేట్ల కాలం ముగిసిపోయిందని ఆయన గుర్తుచేశారు. దీంతో పలు కంపెనీలకు ఇక్కట్లు ఆరంభం కానున్నాయన్నారు. ఫెడ్‌ వడ్డీల పెంపుదల, ఉద్దీపనల ఉపసంహరణ దిశగా ఈసీబీ యోచన.. వర్దమాన దేశాలపై ఒత్తిడికి కారణమవుతున్నాయని వివరించారు. వీటికి డాలర్‌ బలోపేతం కావడం, ట్రేడ్‌వార్‌ ఆజ్యం పోస్తున్నాయన్నారు. యూఎస్‌ఏ విధించే టారిఫ్‌లు ఆ దేశాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టవని, యూఎస్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం, వేతనాల పెరుగుదల ఈ టారిఫ్‌ల వల్ల వచ్చే ఇక్కట్లను సమతూకం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల మరిన్ని టారిఫ్‌లకు యూఎస్‌ సై అనవచ్చన్నారు.

బేర్‌ మార్కెట్‌ ఖాయం!

ఇప్పుడున్న స్థాయిల నుంచి వర్ధమాన దేశాల మార్కెట్లు మరో 10 శాతం మేర పతనం కావచ్చని మార్క్‌ అంచనా వేశారు. ఇప్పటికే ఈ ఏడాది గరిష్ఠాల నుంచి భారీగా పతనమైఉన్న ఈ సూచీలు మరో పతనంతో బేర్‌ మార్కెట్లోకి ప్రవేశిస్తాయన్నారు. మరోవైపు వర్ధమాన దేశాల కరెన్సీ సూచీ మార్చి నుంచి ఇప్పటికి దాదాపు 7 శాతం పతనమైంది. దీంతో అటు టర్కీ నుంచి ఇటు ఇండోనేసియా వరకు పలు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి. ఈ చర్యల స్వల్పకాలిక ఊరటనిస్తుందని, కానీ రుణభారం అధికంగా ఉన్న దేశాల్లో వడ్డీరేట్ల పెంపు మరిన్ని ఇక్కట్లకు దారితీస్తుందని మార్క్‌ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లలో విశ్వాసం పాదుగొలిపేందుకు ప్రభుత్వాలు కీలక విత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుందన్నారు. అయితే తాను మాత్రం ఈ పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా చూస్తున్నట్లు ముక్తాయించారు. 
ట్రేడ్‌వార్‌తో లబ్ది పొందే దేశాలు- రంగాలు:
ఇండియా- ఉత్పత్తి రంగం
దక్షిణ కొరియా- టెక్నాలజీ
బ్రెజిల్‌- వ్యవసాయోత్పత్తులు
అర్జెంటీనా- సోయాబీన్స్‌
వియత్నాం- ఫుట్‌వేర్‌
బంగ్లాదేశ్‌- దుస్తులు.You may be interested

ఈ రంగాలలో ఎర్నింగ్స్‌ జోరు..!

Wednesday 11th July 2018

ముంబై: వచ్చే త్రైమాసికాలలో ఐటీ రంగానికి చెందిన పలు కంపెనీలు, ఫార్మా రంగంలో ఎర్నింగ్స్‌ వృద్ధి ఆకర్షణీయంగా ఉండనుందని విశ్లేషించిన ఏంజెల్ బ్రోకింగ్ ఫండ్ మేనేజర్ మౌరేష్ జోషి.. వినియోగం ఎక్కువగా ఉండే రంగాల కంపెనీలలో ఎఫ్‌ఎమ్‌సీజీ, స్టెపుల్స్‌, పలు రంగుల తయారీ కంపెనీల ఫలితాలు ఆకట్టుకునే విధంగా ఉండేందుకు అవకాశం మెండుగా ఉందని అంచనావేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆటో విడిభాగాల కంపెనీలు సరిపోతాయని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన

మెటల్‌ షేర్లకు ట్రేడ్‌వార్‌ సెగలు..!

Wednesday 11th July 2018

ముంబై:- ట్రేడ్‌వార్‌ సెగలతో బుధవారం మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. అమెరికా-చైనా దేశాల మధ్య ట్రేడ్‌వార్‌ మరోసారి మొదలవడంతో ప్రపంచవ్యాప్తంగా మెటల్ ఉత్పత్తి తగ్గుతుందనే ఆందోళనలు వెల్లువెత్తాయి. ఫలితంగా నేడు అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నాం గం.1:45ని.లకు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గత ముగింపు

Most from this category