News


తుది దశలో చైనా-అమెరికా వాణిజ్య చర్చలు

Monday 15th April 2019
news_main1555307028.png-25131

వాషింగ్టన్‌: వాణిజ్య వివాదాల పరిష్కారానికి సంబంధించి అమెరికా - చైనా మధ్య చర్చలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఒప్పందం అమలు తీరుతెన్నులే అన్నింటికన్నా పెద్ద సమస్యగా తయారైందని, ఇది దాదాపు పరిష్కారమైనట్లేనని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ మినుచిన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య దాదాపు నలభై ఏళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక బంధంలో ఇది పెద్ద మార్పు తేగలదని ఆయన పేర్కొన్నారు. "వివాదాల పరిష్కార సాధనలో తుది దశకు మరింతగా చేరువవుతున్నామని భావిస్తున్నాం" అని అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా స్టీవెన్ తెలిపారు. ఒప్పంద ఉల్లంఘన జరిగిన పక్షంలో తగు చర్యలు తీసుకునేలా ఇరు పక్షాలకు అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే, చైనా గానీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పక్షంలో ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు వడ్డించే విషయంపై ఆ దేశాన్ని ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అలాగే, ఒకవేళ అమెరికా గనుక నిర్దిష్ట ఉత్పత్తులపై మళ్లీ టారిఫ్‌లు విధించినా ప్రతీకార చర్యలు తీసుకోకుండా చైనాపై ఒత్తిడి కూడా తెస్తోంది. కానీ, ఏకపక్షంగా ఉన్న ఒప్పంద అమలు విధివిధానాలను చైనా ఇష్టపడటం లేదు. ఇవి తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని, తమ దేశ ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు ఆధిపత్యాన్ని కట్టబెట్టేవిగా ఉన్నాయనే చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపర్చిన సంగతి తెలిసిందే.



You may be interested

నేటి నుంచి జెట్ పైలట్ల సమ్మె

Monday 15th April 2019

ముంబై: జీతాల బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ పైలట్లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ఉదయం 10 గం.ల నుంచి విమానాలను నడపరాదని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 1,100 పైలట్లు ఇందులో పాల్గొనున్నట్లు పేర్కొన్నాయి. "మూడున్నర నెలలుగా మాకు జీతాలు అందడం లేదు. అందుకే ఏప్రిల్ 15 నుంచి విమానాలు నడపరాదని నిర్ణయం తీసుకున్నాం. నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్‌ఏజీ)లోని

30 కోట్లు దాటిన జియో చందాదారులు

Monday 15th April 2019

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లను అధిగమించింది. కార్యకలాపాలు ఆరంభించిన రెండున్నరేళ్లలో ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. మార్చి 2న ఇది సాధ్యమైనట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్‌ సీజన్లో 30 కోట్ల యూజర్ల మార్క్‌పై కంపెనీ టెలివిజన్‌ ప్రకటనలు కూడా ఇస్తోంది. 10 కోట్ల మంది చందాదారులను వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించిన తర్వాత కేవలం 170 రోజుల్లోనే సొంతం చేసుకుని జియో గతంలోనే రికార్డు

Most from this category