STOCKS

News


ఇరాన్‌ చమురు దిగుమతులపై కొత్త సడలింపులుండవు!

Saturday 12th January 2019
news_main1547304441.png-23557

అమెరికా స్పష్టీకరణ
ఇరాన్‌ నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవాలనుకునేదేశాలకు ఇకపై కొత్తగా నిబంధనల సడలింపు ఉండదని యూఎస్‌ తేల్చిచెప్పింది. ఇరాన్‌పై ఆంక్షల అనంతరం భారత్‌తో సహా 8 దేశాలకు అమెరికా కొద్దిపాటి సడలింపు ఇచ్చింది. అయితే ఇకపై కొత్తగా ఇలాంటి సడలింపులేవీ ఉండవని యూఎస్‌ ప్రతినిధి హుక్‌ చెప్పారు. ఇప్పటికే వేవియర్స్‌ పొందిన దేశాలకు సదరు సడలింపు గడువు మేతో ముగియనుంది. ఆపై వీటి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో హుక్‌ వెల్లడించలేదు. ప్రస్తుతానికి కొత్త సడలింపులు ఉండవని మాత్రమే చెప్పారు. ఇరాన్‌పై ఆంక్షలతో ఒత్తిడి పెంచితేనే ఆ దేశం దారికి వస్తుందన్నారు. ఇరాన్‌ ఆదాయంలో ఎక్కువ శాతం చమురు దిగుమతులేనని, కానీ ఈ ఆదాయంతో ఆ దేశం టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని హుక్‌ దుయ్యబట్టారు. అందువల్ల ఇరాన్‌కు ఈ నిధులు రాకుండా చేయడమే తమ ఉద్దేశమన్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం సరిగాలేదంటూ ట్రంప్‌ తన హయంలో ఇరాన్‌తో డీల్‌ను రద్దు చేసుకొని ఆంక్షలు విధించారు. తాము చెప్పే కొత్త ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే ఇరాన్‌తో కొత్త డీల్‌ కుదుర్చుకుంటామన్నారు. మరోవైపు ఇరాన్‌ మాత్రం తాము లొంగేది లేదంటోంది. దీంతో గత నవంబర్‌ నుంచి ఇరాన్‌పై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆంక్షల సడలింపు ఇచ్చిన  8 దేశాలు తమ తమ ఇరాన్‌ దిగుమతులను క్రమంగా తగ్గించుకుంటాయని ఆశిస్తున్నట్లు యూఎస్‌ తెలిపింది. ఇందుకు తగ్గట్లే చైనా, భారత్‌లు ఇరాన్‌ చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. మే నెల లోపు ఇరాన్‌, యూఎస్‌ మధ్య డీల్‌ కుదరకపోతే భారత్‌లాంటి చమురు దిగుమతి ఆధార దేశాలకు ఇబ్బందులు తప్పవని, ముడి చమురు ధర మరోమారు రెక్కలు విప్పవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. You may be interested

ఈ కంపెనీల నుంచి త్వరలో భారీ డివిడెండ్‌?

Sunday 13th January 2019

ప్రభుత్వరంగ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరింత మొత్తంలో డివిడెండ్‌ను వాటాదారులకు పంపిణీ చేయబోతున్నాయి. ఏడు ప్రభుత్వరంగ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం డివిడెండ్‌ రూపంలోనే రూ.21,000 కోట్లను ఆశిస్తోందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఈ ఏడు కంపెనీల వద్ద 2018 మార్చి చివరికి నగదు నిల్వలు రూ.54,235 కోట్ల మేర ఉన్నట్టు ఈ సంస్థ తెలిపింది. అదే సమయంలో నికర రుణ భారం కేవలం రూ.2,943 కోట్లుగానే

పెళ్లి కోసం లోన్‌ తీసుకుంటున్నారా?

Saturday 12th January 2019

కొత్త శతాబ్దపు యువత ఇటీవల కాలంలో వివాహానికి లోన్‌ తీసుకోవడం పరిపాటైంది. ధూంధాంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న కుర్రకారు ఇందుకోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం తీసుకుంటున్నారు. అయితే ఈ రుణ భారం తమపై, తమ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి భారం మోపుతుందో తెలుసుకోలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. పేరుకు మ్యారేజ్‌ లోన్‌ కానీ అది కూడా ఒక రకమైన పర్సనల్‌ లోనేనని, పర్సనల్‌ లోన్స్‌లాగానే ఎక్కువ వడ్డీ ఉంటుందని చెబుతున్నారు.

Most from this category